సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు
సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు తెలుగు ప్రజలు జరుపుకునే వ్యవసాయసంబంధ పండుగ సంక్రాంతి. రాయలసీమ ప్రాంత ప్రజలైన కదిరి ప్రజానీకం కూడా ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని భావించే రోజును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చిన సందర్భంలో ఇది రైతులు చేసుకునే ఆనందోత్సాహాల పండుగ. ఈ పండుగకు అల్లుళ్ళను పిలిచి మర్యాదలు చేయడం ఒక ఆనవాయితీ గా ఉంది. సంక్రాంతికి ముందు రోజును భోగి పండుగ అంటారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృ ద్ధిగా ఇళ్లకు వచ్చే కాలమిది. రెండో రోజును సంక్రాంతిగా, పెద్దలు పండుగగా, మూడో రోజును కనుమ పండుగ లేదా పశువుల పండుగగా జరుపుకుంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 14 న జరుపుతారు. భోగి రోజున తెల్లవారక ముందే కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభ మవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభించాలని మనసులో నిర్ణయించుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానాలు చేసి ప్రతి ఇంట...