అనంత సాహితీ విమర్శా వనంలో వికసించిన విమర్శాపుష్పం బి. నాగశేషు

'కొలకలూరి ఇనాక్ రచనలు - బహుజన దృక్పథం' పై సిద్ధాంత గ్రంధాన్ని రాసి డాక్టరేట్ పొందిన బి.నాగశేషు అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం, గరిమేకుపల్లిలో 1-8-1976లో జన్మించారు. వీరి తల్లిదండ్రులుముత్యాలప్ప, కె. లక్ష్మమ్మ. ప్రాథమిక విద్యను పుట్టిన పల్లెలోనే పూర్తిచేసి, ఇంటర్, డిగ్రీ విద్యను పావగడలో చదివారు. బెంగుళూరువిశ్వవిద్యాలయంలోఎం.ఏ. లో గోల్డ్ మెడల్ సాధించాడు. తరువాత ఇనాక్ రచనలపై పరిశోధన పూర్తిచేసి డాక్టరేట్ సాధించాడు. 'వారధి' (ఆలోచనాత్మక వ్యాసాలు) గ్రంధాన్ని 2015లో వెలువరించి సాహిత్య విమర్శాలోకంలో ఒక మంచి విమర్శా పుష్పంగా వినిపించాడు. పలు అంతర్జాతీయ సదస్సుల్లో అనేక సాహిత్య వ్యాసాలను సమర్పించారు. ఆకాశవాణి,వివిధ సంస్థలు నిర్వహించే అనేక సాహిత్య గోష్టుల్లో పాల్గొన్నాడు. పలు కవితలు రాశాడు. ఒక వైపు సాహిత్య రచన చేస్తూనే మరో వైపు 'సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శిగా కూడా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవాడు హిందూపురంలో. వారధి గ్రంథంలో వివిధ సాహిత్యాంశాలపై విశ్లేషణాత్మక, వివరణాత్మక వ...