అరుదైన చిత్రం
విజయనగర రాజుల కాలం నాటి భవన నిర్మాణశైలికి అద్దంపట్టే అరుదైన చిత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన కొందరు వ్యక్తులు లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఆ వర్ణ చిత్రాన్ని
గుర్తించి ఇక్కడి హెరిటేజ్ అసోసియేషన్ సభ్యులకు పంపారు. 16వ శతాబ్దంలో గిరిదుర్గంగా పేరొందిన రాయదుర్గం శత్రుదుర్భేద్యమైన కోటగా ఉండేది.
కొండపై మాధవరాయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఇది ఉండేది. దీనికి ఇరువైపులా ఉన్న రెండు వాచ్ టవర్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, పురావస్తుశాఖ అధికారులు పురాతన కట్టడాల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి