రాయలసీమలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు
రాయలసీమలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు “కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్ ఇది కడప గురించి చెప్పబడ్డా, మొత్తం రాయలసీమకు అన్వయించవచ్చు. కృష్ణా, పెన్నా నదులే కాక అనేక నదులు రాయలసీమ జిల్లాల ద్వారా ప్రవహిస్తున్నాయి. కృష్ణా నది - కృష్ణవేణి - నల్లని నది - నల్లని జడ - కృష్ణ(కణ్ణ) వెణ్ణ(వేణి) నదుల సంగమం - నల్లరేగడి భూముల మీదుగా ప్రవహించునది. శ్రీశైలం వద్ద ఆనకట్ట కట్టబడింది. తుంగభద్ర - తుంగ నది , భద్ర నది కలయిక వలన ఏర్పడినది - కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది. మల్లాపురం వద్ద తుంగభద్ర బ్యారేజీ ఉన్నది. ప్రసిద్ద క్షేత్రమైన మంత్రాలయం వద్ద ఈ నది రాయలసీమలో ప్రవేశించి ఆలంపూర్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. పాపాఘ్ని - పాపాలను దహించునది - పెన్నా నదికి ఉపనది - వేంపల్లి వద్ద పాపాఘ్ని తీరంలోనే గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ప్రసిద్ద శైవ క్షేత్రం వీరపునాయుని పల్లె వద్ద కల సంగమేశ్వర ఆలయం కూడా పాపాఘ్ని తీరాన ఉన్నది. పెన్నా -ఉత్తర పినాకిని - పినాకిని అంటే పినాక నుండి ఉద్భవించింది అని అర్థం. శివుని ధనస్...