రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?
రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది? 1928 వరకు 'రాయలసీమ' అనే పదమే వాడుకలో లేదు. 1928 వరకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను దత్త మండలాలు (సీడెడ్ డిస్ట్రిక్ట్) అని వ్యవహరించేవారు. 'అభిషిక్త రాఘవం'లో నడిమింటి వెంకటపతి మొదటి సారిగా 'రాయలసీమ' పదాన్ని వాడారని శ్రీ రావినూతల రామారావు గారు (గుత్త కేశవ పిళ్లై జీవిత గాథలో) రాశారు. ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన కీర్తి ప్రధానంగా హరిసర్వోత్తమ రావు గారికి దక్కుతుంది. 1800 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు తనకు బ్రిటిష్ వారు సహాయం చేశారన్న కారణంతో ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్తత ఇచ్చాడు. అందువల్ల ఈ జిల్లాలను దత్త మండలాలని అనేవారు. దత్త మండలాలు అని పిలిపించుకోవడం అగౌరవంగా భావించిన క నాయకులు 1928 నవంబరు 18వ తేదీన నంద్యాలలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన సభ జరిగిన సభలో ఈ ప్రాంతాన్ని 'రాయలసీమ ' అని పిలుచుకోవాలని తీర్మానించారు. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారు దీనిని ప్రతిపాదించారు. రాజమండ్రి వ్యవస్థాపకులలో ఒకరైన చిలుకూరి నారాయణరావు గారు సైతం ఈ సభలో పాల్గొన్నారు. 15వ, 16వ శతాబ్దాలలో విజయనగర పాలకులు నిర్మించిన నీటి వనరు...