పోస్ట్‌లు

ఏప్రిల్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

చిత్రం
యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కటకం కృష్ణవేణి                 కటకం కృష్ణవేణి              శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యంతో పాటు శాంతిని సాధించే మార్గమే యోగా. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమేకాదు. మన శరీరాన్ని ప్రకృతికి చేరువచేసే మార్గం. యోగాతో సమాజాన్ని చూసే దృక్పథం మారుతుంది. నేను అనే అహం నుంచి మనం అన్న వైపు ప్రయాణించే సాధనమే యోగా ప్రక్రియ. మానసిక శారీరక అనారోగ్యాలతో బాధపడేవారికి యోగా చక్కని మార్గదర్శిని గా భావించిన కృష్ణవేణి  యోగాలో మాస్టర్ డిగ్రీ చేసి యోగవేణిగా ప్రసిద్ధురాలైంది.            పుట్టింది కడప జిల్లాలో అయినా పెరిగింది మాత్రం కదిరిలోనే.  8.10.78 లో కడప లో బి.రామచంద్రారెడ్డి,బి. రామాంజనమ్మ లకు జన్మించిన కృష్ణవేణి బాల్యమంతా కదిరిలోనే గడిపింది. కదిరిలో బాలికల ఉన్నత పాఠశాలలో హైస్కూల్ చదువును బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ను పూర్తి చేసింది. బిఏ డిగ్రీ ని ఎస్కే యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఇక్కడే వివాహం చేసుకుంది. ఆమెకు సంగీత, సు...