పోస్ట్‌లు

జులై, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

తోలుబొమ్మలాట

తోలుబొమ్మలాట(updated)        ఆప్టన్ సింక్లేర్ అన్నట్లు కళలు,సాహిత్యం ఒక ప్రచార సాధనం. అలాగే  తోలుబొమ్మలాట కూడా ఒక ప్రచార సాధనం. రాచరికపు కాలంలో చక్రవర్తులు, మత ప్రచారకులు, ధర్మప్రచారకులు బుర్రకథ, వొగ్గుకథ, తోలుబోమ్మలాట, హరికథ లాంటి వివిధ జానపదుల కళారూపాల్లో  తమ సందేశాలను, భావాలను,ధర్మాలను ప్రచారం చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా,టి.వి., సినిమా, పత్రికలు మొదలైన వాటి ద్వారా చేస్తున్నారు. అంతేగాక విజ్ఞాన ప్రచార సాధనంగా, వినోదాత్మకంగా ఆధునిక కాలంలో ఉపయోగిస్తున్నారు.     క్రీ.పూ 3000 సం॥నికి చెందిన హరప్పా, మొహంజోదారో లో  తవ్వకాల్లో  తల భాగాన్ని ఒక తీగతో అతకించగల ఒక టెర్రకోట ఎద్దు లభించింది. ఇది ఒక పరిమితమైన యానిమేషన్ లాంటిది . పైకి క్రిందకు జారగల ఒక టెర్రకోట కోతి బొమ్మ కూడా దొరికింది. ఇది ఒక వాహన కదలికను సూచిస్తుంది. తరువాత వచ్చిన వేదకాలంలో ఇలాంటివాటికి ఆదరణ లేక పోయింది.           క్రీ.పూ 6వ శతాబ్దం మగధ సామ్రాజ్యం ఏర్పడిన నాటికి భారతదేశం లో తోలుబొమ్మల ప్రదర్శనశాల (Shadow theater) మొదలైం...