పోస్ట్‌లు

అక్టోబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పెనుకొండ కోట – విజయనగర వైభవానికి రెండవ రాజధాని

చిత్రం
పెనుకొండ కోట – విజయనగర వైభవానికి రెండవ రాజధాని        పెనుకొండ కోట సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలంలో ఉంది. ఇది అనంతపురం నుండి సుమారు 76 కిలోమీటర్ల దూరంలో, పుట్టపర్తి నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. పెనుకొండ కోట శతృదుర్భేద్యమైన దుర్గంగా పేరు పొందింది. శాసనాల్లో దీనిని “పెనుకొండ ఘనగిరి” అని పిలిచారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 1941లో రాసిన గేయంలో పెనుకొండ గౌరవాన్ని ఇలా వర్ణించాడు – “చనిన నాళుల తెనుగు కత్తులు సానవెట్టిన బండ ఈ పెనుగొండ కొండ రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల కరితి నీలపు దండ ఈ పెనుగొండ కొండ వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ ఈ పెనుగొండ కొండ తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ ఈ పెనుగొండ కొండ."     ఆయన ఈ గేయాన్ని రాయలసీమ మహాసభలో స్వయంగా ఆలపించాడు. పెనుకొండను మొదట హోయసల రాజులు పాలించారు. వారు జైన ...