పోస్ట్‌లు

డిసెంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అధ్యాయం – 1

​ రాయలసీమ : పేరు, భౌగోళిక స్వరూపం • “రాయలసీమ” అనే పేరు ఎలా వచ్చింది • సీమ అంటే ఏమిటి • కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల భౌగోళిక లక్షణాలు • ఎండలు, వర్షాభావం, రాళ్ల నేల – చరిత్రపై ప్రభావం రాయలసీమ చరిత్ర రచన రాయలసీమ చరిత్ర రచనకు ఉపకరించిన ఆధారాలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజించవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఙ్మయాధారాలు, 1) పురావస్తు ఆధారాలు : పురావస్తు ఆధారాలను తిరిగి మూడు విధాలుగా విభజించవచ్చు. అవి: 1) శాసనాలు 2) నాణేలు 3) కట్టడాలు (లేక) ఇతర అవశేషాలు. 1) శాసనాలు : భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు అశోకుని శాసనాలే. అశోకుని శాసనాలు క్రీ.పూ. 250 ప్రాంతం నాటివి. ఇవి ప్రధానంగా శిలలపైనా, శిలాస్తంభాల పైనా వ్రాయబడినవి. రాయలసీమ లోని ఎర్రగుడి, రాజుల మందగిరి,  కొట్టాంలలో లభించిన అశోకుని ధర్మశాసనాలు ఆంధ్రదేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమైందని నిరూపిస్తున్నాయి. అశోకుని శాసనాల తర్వాత పేర్కొనదగినవి క్రీస్తు పూర్వం 2 నుంచి 11వ శతాబ్ధాల మధ్య బహుదా నదీ తీరాన ఆడపూరు వద్ద ఉన్న కొండపై బౌద్ధమత ఆరామాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.  ఇవి క్రీ.పూ. 200 నాటికే బౌద్ధమతం రా...