అధ్యాయం – 1


రాయలసీమ : పేరు, భౌగోళిక స్వరూపం

“రాయలసీమ” అనే పేరు ఎలా వచ్చింది

సీమ అంటే ఏమిటి

కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల భౌగోళిక లక్షణాలు

ఎండలు, వర్షాభావం, రాళ్ల నేల – చరిత్రపై ప్రభావం



రాయలసీమ చరిత్ర రచన


రాయలసీమ చరిత్ర రచనకు ఉపకరించిన ఆధారాలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజించవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఙ్మయాధారాలు,

1) పురావస్తు ఆధారాలు :

పురావస్తు ఆధారాలను తిరిగి మూడు విధాలుగా విభజించవచ్చు. అవి: 1) శాసనాలు 2) నాణేలు 3) కట్టడాలు (లేక) ఇతర అవశేషాలు.

1) శాసనాలు :

భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు అశోకుని శాసనాలే. అశోకుని శాసనాలు క్రీ.పూ. 250 ప్రాంతం నాటివి. ఇవి ప్రధానంగా శిలలపైనా, శిలాస్తంభాల పైనా వ్రాయబడినవి. రాయలసీమ లోని ఎర్రగుడి, రాజుల మందగిరి,  కొట్టాంలలో లభించిన అశోకుని ధర్మశాసనాలు ఆంధ్రదేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమైందని నిరూపిస్తున్నాయి.

అశోకుని శాసనాల తర్వాత పేర్కొనదగినవి క్రీస్తు పూర్వం 2 నుంచి 11వ శతాబ్ధాల మధ్య బహుదా నదీ తీరాన ఆడపూరు వద్ద ఉన్న కొండపై బౌద్ధమత ఆరామాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.  ఇవి క్రీ.పూ. 200 నాటికే బౌద్ధమతం రాయలసీమ లో వ్యాపించిన విషయాన్ని తెలుపుతున్నాయి.

తూర్పు చాళుక్య యుగం నుండి శాసనాలలో తెలుగు భాష వాడకం ప్రారంభమైంది. బ్రాహ్మీలిపి తెలుగు లిపిగా పరిణామం చెందింది. అయిననూ సంస్కృత భాషా, దేవనాగరి లిపి శాసనాలలో విధిగా ఉపయోగింపబడేవి.

అశోకుని కాలం (క్రీ.పూ. మూడో శతాబ్దం) నుండి ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. నాలుగో శతాబ్దం) వరకు రాయలసీమ లో ప్రాకృతమే శాసన భాషగా వాడబడింది. 

తెలుగు భాషలో లభించిన మొట్టమొదటి శాసనాలు అనంతపూర్, కడప జిల్లాలలో లభించిన రేనాటి చోళులవి. ఇవి క్రీ.శ. ఆరు, ఎనిమిది శతాబ్దాల మధ్య కాలానివి.

(ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర_పి వి కె ప్రసాదరావు)


రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?

      1928 వరకు 'రాయలసీమ' అనే పదమే వాడుకలో లేదు. 1928 వరకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను దత్త మండలాలు (సీడెడ్ డిస్ట్రిక్ట్) అని వ్యవహరించేవారు. 
'అభిషిక్త రాఘవం'లో నడిమింటి వెంకటపతి మొదటి సారిగా 'రాయలసీమ' పదాన్ని వాడారని శ్రీ రావినూతల రామారావు గారు (గుత్త కేశవ పిళ్లై జీవిత గాథలో) రాశారు. ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన కీర్తి ప్రధానంగా హరిసర్వోత్తమ రావు గారికి దక్కుతుంది. 1800 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు తనకు బ్రిటిష్ వారు సహాయం చేశారన్న కారణంతో  ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్తత ఇచ్చాడు. అందువల్ల ఈ జిల్లాలను దత్త మండలాలని అనేవారు. దత్త మండలాలు అని పిలిపించుకోవడం అగౌరవంగా భావించిన క నాయకులు 1928 నవంబరు 18వ తేదీన నంద్యాలలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన సభ జరిగిన సభలో ఈ ప్రాంతాన్ని 'రాయలసీమ ' అని పిలుచుకోవాలని తీర్మానించారు.  గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారు దీనిని ప్రతిపాదించారు.   రాజమండ్రి వ్యవస్థాపకులలో ఒకరైన చిలుకూరి నారాయణరావు  గారు సైతం ఈ సభలో పాల్గొన్నారు. 15వ, 16వ శతాబ్దాలలో విజయనగర పాలకులు నిర్మించిన నీటి వనరులు తప్పిస్తే, బ్రిటీష్ పాలకుల వల్ల తమకు కొత్తగా ఏర్పడిన నీటి వనరులు ఏవీ   రాయలసీమలో లేవు. కరువు కాలంలో దత్త మండలాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస పోయారని పెద్దలు చెబుతారు. 


*AP: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..*

 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది.  2022 ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. 

26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో  గెజిట్‌ . ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. 

*రాయలసీమలో కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..*

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల 

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22.  సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి. 

*కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..*

- కర్నూలు జిల్లా.. 26 మండలాలు
- నంద్యాల జిల్లా.. 29 మండలాలు
- అనంతపురం జిల్లా.. 31 మండలాలు
- శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు
- వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు
- అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు
- చిత్తూరు జిల్లా.. 31 మండలాలు
- తిరుపతి జిల్లా.. 34 మండలాలు

రాయలసీమ లో కాలువలు

హంద్రీ_నీవా సుజల స్రవంతి కాలువ రాయలసీమలోనే పెద్ద కాలువ.అయినప్పటికీ దీన్లో ఒక టిఎంసి లోపు నీరు కూడా పారడంలేదు.దీని మార్గంలో హంద్రీ,పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య,  బాహుదా,గార్గేయ నదులు ఉన్నాయి . . ఈ కాలువ కాలువ రాయలసీమలోని నాలుగు 

జిల్లాలకు సాగునీటినందిస్తుంది.దీనికి సమాంతర కాలువ నిర్మిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పారు.వాస్తవ రూపం దాల్చేదెప్పుడు?


కె . సి . కెనాల్ . దీనినే కర్నూల్ - కడప కాలువ అంటారు . దీన్ని 150 సంవత్సరాలకు పూర్వమే నిర్మించారు . 

కర్నూల్ జిల్లాలో సుంకేసుల బేరేజ్ నుండి మొదలైన ఈ నీటి పారుదల కాలువ కడప , కర్నూలు జిల్లాల్లో సాగునీటిని , తాగునీటిని అందిస్తుంది.




రాయలసీమలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు 

“కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్

ఇది కడప గురించి చెప్పబడ్డా, మొత్తం రాయలసీమకు అన్వయించవచ్చు.  కృష్ణా, పెన్నా నదులే కాక అనేక నదులు రాయలసీమ జిల్లాల ద్వారా ప్రవహిస్తున్నాయి.

కృష్ణా నది - కృష్ణవేణి - నల్లని నది - నల్లని జడ - కృష్ణ(కణ్ణ) వెణ్ణ(వేణి) నదుల సంగమం -   నల్లరేగడి భూముల మీదుగా ప్రవహించునది. శ్రీశైలం వద్ద ఆనకట్ట కట్టబడింది. 

తుంగభద్ర - తుంగ నది , భద్ర నది కలయిక వలన ఏర్పడినది - కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది. మల్లాపురం వద్ద తుంగభద్ర బ్యారేజీ ఉన్నది. ప్రసిద్ద  క్షేత్రమైన మంత్రాలయం వద్ద ఈ నది రాయలసీమలో ప్రవేశించి ఆలంపూర్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 

పాపాఘ్ని - పాపాలను దహించునది - పెన్నా నదికి ఉపనది - వేంపల్లి వద్ద పాపాఘ్ని తీరంలోనే  గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ప్రసిద్ద శైవ క్షేత్రం వీరపునాయుని పల్లె వద్ద  కల సంగమేశ్వర ఆలయం కూడా పాపాఘ్ని తీరాన ఉన్నది.

పెన్నా -ఉత్తర  పినాకిని - పినాకిని అంటే పినాక నుండి ఉద్భవించింది అని అర్థం. శివుని ధనస్సు పినాక రెండు నంది కొండల వద్ద రెండు పాయలుగా ఉత్తర పినకిని (పెన్నా) దక్షిణ పినాకిని(పాలారు) నది అయ్యాయి. ప్రసిద్ద క్షేత్రాలు తాడిపత్రి ఆలయాలు, పుష్పగిరి, గండికోట ఈ నదీ తీరంలోనే ఉన్నాయి 

చెయ్యేరు - సంస్కృతంలో బాహుద అని కూడా పేరు - అంటే చెయ్యి ఇచ్చునది అని అర్థం - పెన్నానదికి ఉపనది- ఈ నది తీరంలోనే అత్తిరాల ఆలయ క్షేత్రాలు, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. చెయ్యేరు నది మీద ఆకేపాడు వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు ఉన్నది. ఈ నది పేరు వెనక ఒక కథ ఉన్నది. లిఖితుడు అను బ్రాహ్మణుడు ఒకరోజు ఆకలితో యజమాని అనుమతి లేకుండాఒక తోటలోని చెట్టు పండ్లు తిని, తన తప్పును పొత్తప్పి రాజు దగ్గర అంగీకరించగా, రాజు ఆ బ్రహ్మణుడికి దండనగా చేతులు ఖండించగా, లిఖితుడు తరువాత ఈ నదిలో మునిగి లేయగా తన చేతులు తనకు తిరిగి వచ్చాయి. చెయ్యి ఇచ్చిన నది చెయ్యేరు 


కుందేరు - కుందూ నది - సంస్కృతంలో కుముద్వతి అని పేరు - కుముద్వతి అంటే తెల్ల కలువ తీగ - సీతారాముల కుమారుడు కుశుడి భార్య పేరు కూడా కుముద్వతి. కర్నూలు జిల్లాలో సున్నపు నేలల మీదుగా ప్రవహించటం వల్ల తెల్లగా ఉన్న నీటి వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతమే రేనాటి సీమ

స్వర్ణముఖి -  శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది. మరో కథ ప్రకారం ఆగస్త్యుని తపస్సు మేరకు శివుని అనుగ్రహం వలన గంగమ్మ స్వర్ణ కాంతులతో భూమి మీదకు వచ్చింది కాబట్టి స్వర్ణముఖి అయ్యిందని ఈ నదీ తీరంలో ఇసుక రేణువులు బంగారు వర్ణంలో ఉండటం చేత స్వర్ణముఖి అయ్యిందని ఇంకో కథనం.   ప్రసిద్ద శైవ క్షేత్రాలు అయిన కాళహస్తి, గుడిమల్లం ఈ నది తీరంలో ఉన్నాయి. తిరుపతి ప్రధాన నీటి వనరు కళ్యాణి డాం కూడా స్వర్ణముఖి నది మీదే ఉంది.

మాండవ్య నది - బాహుదా నదికి ఉపనది. మాండవ్య మహర్షి పేరు మీద ఈ పేరు వచ్చి ఉండవచ్చు. రాయచోటి వీరభద్రాలయం ఈ నది ఒడ్డున ఉంది

హగరి - వేదవతి : అఖ(పాపాలు) హరి(హరించేది) - పాపాలు హరించే నది కాబట్టి హగరి - ఈ నదినే వేదవతి అని కూడా అంటారు. ఈ నది తుంగభద్ర నదికి ఉపనది

ఇవే కాక ఇతర ముఖ్య నదులు - పింఛా (బాహుదా నది ఉపనది) హంద్రీ (ఆంధ్ర అన్న పదం హంద్రీ నుంచి వచ్చింది అంటారు), సగిలేరు(స్వర్ణబాహు),  వక్కిలేరు, చిత్రావతి(పుట్టపర్తి ఈ నదీ తీరంలోనే ఉంది), గాలేరు, నీవా, కాళంగి, పీలేరు నది బుగ్గవంక (కడప పట్టణం మీదుగా ప్రవహిస్తుంది) కుషావతి /కుశావతి (బహుశా సీతారామచంద్రుల కుమారుడు కుశుడు పేరు మీద ఈ పేరు వచ్చి ఉండవచ్చు ) జయమంగళ మొII 

దురదృష్టవశాత్తూ వీటిలో జీవనదులు అతిస్వల్పం. దీనికి  పాలకుల నిర్లక్ష్యం తోడవడంతో ఇన్ని నదులున్నా రాయలసీమ కరువు కోరల్లో విలవిలలాడుతోంది. ఈ దురవస్థ చూసే పెన్నేటి పాటలో విద్వాన్ విశ్వం గారు ఇలా రాశారు 

ఇంత మంచి పెన్నతల్లి
        ఎందు కెండి పోయెనో?
ఇంతమంది కన్న తల్లి
        ఎందు కిట్లు మారెనో?

___రవితేజ రెడ్డి



తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ  
     
         ఇనుప యుగం కంటే ముందు నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆదిమానవులు ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో జనపదాలు ఏర్పడి ఉండాలి. పైగా భాష కూడా ఏర్పడి ఉండాలి. జనపదాలు పెద్దవై రాజ్యాలు ఏర్పడిన తర్వాత తొలి శాసనాలు రాయలసీమలోనే లభించాయు. దీన్నిబట్టి తెలుగువారు రాయలసీమ వారై ఉంటారని భావించవచ్చు . క్రీ.శ.6వ శతాబ్దం నాటికి దానిని రేనాడు అనిపిలిచే వారు.రేనాడు ఏడువేల గ్రామాల సముదాయం.దీనిని రేనాటి చోళులు పాలించేవారు. కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడు ఎర్రగుడి దగ్గర లభించిన శాసనాల ద్వారా సీమాంధ్ర ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
      దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ తర్వాత తెలంగాణ అని తుర్లపాటి రాజేశ్వరి పేర్కొన్నారు.  
    క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో ఎరికల్ ముత్తు రాజు బిరుదు గల ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలిస్తున్న కాలంలో వేయించిన శాసనం తెలుగులో వుంది. కమలాపురం లోని ఎర్రగుడిపాడు దగ్గర లభించిన క్రీ.శ.600 నాటి శాసనం కూడా తెలుగులోనే వుంది. కమలాపురంలోనే ఇందుకూరు లో ధనంజయుని కొడుకు చోర మహారాజు కూడా ఒక శాసనాన్ని తెలుగులో వేయించాడు.క్రీ.శ. 630 నాటి కమలాపురం లోని తిప్పలూరు శాసనం కూడా తెలుగులో ఉంది. క్రీస్తు శకం 643 లో తూర్పు చాళుక్య రాజైన జయసింహ వల్లభుడు వేసిన విప్పర్ల చేజెర్ల శాసనాలు ఆనాటి తెలుగుభాషకు అద్దం పడుతున్నాయి. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చాళుక్య సేనాని పండరంగడు వేయించిన అద్దంకి శాసనం ఉంది.అది తరువోజ లో ఉంది.చాళుక్య భీముడు వేయించిన శాసనం సీస,గీత పద్యాలలో, యుద్ధ మల్లుడి బెజవాడ శాసనం మధ్యాక్కర లో రాశారు. ఇవన్నీ నన్నయకు పూర్వం శాసనాలు. దేశీయమైన కవితలు.
      క్రీ.శ.575 నాటి నుంచే తెలుగు లిపి పరిణామం చెందుతూ వచ్చింది. ఇది బ్రాహ్మిలిపి నుంచి వచ్చింది.

భారతదేశంలోని లిపులన్నింటికి మూలం బ్రాహ్మీ లిపే.ఇది అశోకుని కాలానికి ముందే రెండు శాఖలుగా చీలిపోయింది.1.ఉత్తర బ్రాహ్మీ లిపి 2.దక్షిణ బ్రాహ్మీ లిపి.
       ఉత్తర భారతదేశంలోని లిపులన్నింటికి మూలం "ఉత్తర బ్రాహ్మీ లిపి" కాగా,, దక్షిణ భారత దేశంలోని లిపులన్నింటికి "దక్షిణ బ్రాహ్మీ లిపి" మూలాధారం.
ఈ విధంగా దక్షిణ భారతంలోని తమిళభాష, మలయాళ భాష,, కన్నడ భాష,, తెలుగు భాష, మొదలగు భాషల లిపులన్నింటికి దక్షిణ బ్రాహ్మీ లిపినే మూలాధారం. దక్షిణ బ్రాహ్మీ లిపి నుండి 11 వ శతాబ్దం కాలంలో 'కదంబ' లిపి నుండి కన్నడ, తెలుగు లిపులు ఏర్పడ్డాయి. ప్రారంభంలో తెలుగు,కన్నడ లిపులు ఒకే రకంగా ఉండేవి. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. 
      నన్నయకు పూర్వం తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని తూర్పు చాళుక్య లిపి లేదా
వేంగీచాళుక్య లిపి అనేవారు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే రాసినారు. ఆ లిపిలో తాటాకుపైనగాని గంటంతో రాసేటప్పుడు తలకట్లు దీర్ఘాలు రాస్తే తాటాకు చినిగిపోయేది. నన్నయ దీనికి పరిష్కారంగా ఇప్పటి తలకట్లను దీర్గాలను రూపొందించాడు.
        భాషాపరంగా కన్నడ తమిళ భాషలు ద్రావిడ కుటుంబానికి చెందినవి. అయితే, ఆ మూలభాష నుండి ఒక భాష ముందుగా విడివడింది. ఆ భాష క్రమేపీ కన్నడ, తెలుగు భాషలుగా విడిపోయింది. విడిపోయినా లిపి మాత్రం ఒకటే ఉంది. ఆ లిపి కన్నడ భాషకి స్థిరపడగా, సా. శ. 10..11 శతాబ్దాల నాటికి ప్రత్యేకంగా తెలుగుకు కూడా లిపి ఏర్పడింది. కన్నడ లిపికి చాలా సమీపంగా ఉన్న లిపిలో వేసిన శాసనాలను "తెలుగన్నడ" (తెలుగు+ కన్నడ) శాసనాలు అన్నారు చరిత్రకారులు. కానీ ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది.కాల గమనంలో రెండు భాషలకు వేరు వేరు లిపి రూపొందింది. 

____ పిళ్లా కుమారస్వామి,949012229


        రాయలసీమ లో నూతన శిలాయుగం 


పులివెందుల తాలూకా వేములలో, కడప సమీపంలోని వెల్లటూరులో, కదిరి తాలూకా ముండ్లవారిపల్లె దొరిగల్లులో అనేక తరహాల పనులకుపయోగపడే నూతన శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. వెల్లటూరులో దొరికిన చిన్న తోటలో సున్నం లాంటి పదార్థం కనిపించింది. దానిని బట్టి ఆనాడు తాటి కల్లు పరిశ్రమ వుండేదని వూహిస్తున్నారు. ముండ్ల వారి పల్లెలో శంకు చిప్పల కంకణాల పరిశ్రమ గుర్తులు కనిపించినాయి.

http://dsal.uchicago.edu/reference/gaz_atlas_1909/fullscreen.html?object=33%22 కర్నూలులో నూతన శిలాయుగపు పరికరాలు దండిగా దొరికినాయి. పత్తిపాడు వద్ద జాడీలు, చుట్టగుదురులు, లోటాలు, మాదిరి చిన్న పాత్రలు, కుదురు బిళ్ల, చిన్న గుర్రపుబొమ్మ, ఇంకా అనేకానేక ఆసక్తికరమయిన వస్తువులు దొరికినాయి. భారతదేశంలో మరెక్కడా దొరకని కొమ్ముకుండ ఒకటి ఇచ్చట దొరికింది. బహుశ పాలు, పెరుగులకు దీనిని ఉపయోగించి వుంటారని అనుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో వుంది. పత్తికొండ తాలూకా కప్పతల్లి మిట్టమీద, వస్తువులు మెరుగు పెట్టేందుకు వుపయోగించిన గాడి పల్లాలు దొరికాయి. ఆనాడు సున్నపురాతితో బండి చక్రాలు తయారు చేసేవారని తెలుస్తున్నది. నూతన శిలాయుగపు ప్రారంభదశలో జనం గుహలు మొదలైన ప్రకృతి సిద్దమయిన రక్షణ ప్రదేశాలలోనే వుండేవారు. సేద్యాలు చేసేవారు.భారత పురావస్తుశాఖ వారి 1968 నాటి పరిశోధనలలో ఈ విషయం బయట పడింది.

కడప జిల్లా ఎర్రగుంట్ల అనివేములలో చాలా సమాధులు (సిస్ట్‌లు) దొరికాయి. వాటిని అక్కడివారు పాండవగుళ్లు అంటారు. చిత్తూరు జిల్లాలో నవీన శిలాయుగం నుండి మానవులు నివసించినట్టు అక్కడ కనిపించే పాండవ గుళ్ల వలన తెలుస్తున్నది. టాలేమి, ప్లినీ రాత ప్రతుల్ని బట్టి కోరమండల్‌ చేరిన ఈ ప్రాంతం క్రీ.శ.1వ శతాబ్దానికి జనవాహితమయినట్టు తెలుస్తున్నది.

 

 

అనంతపురం పట్టణానికి 12 మైళ్ల దూరాన వున్న కాలమేదునూరు మిట్ట మీద నూతన శిలాయుగపు వుత్తర దశ నాటి జనావాసం కనబడింది. నూతన శిలాయుగపు జనావాసం తరువాత ఇక్కడే ఇనుప యుగం ప్రారంభమయినట్టుగా తెలుస్తున్నది. గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు సమీపంలో నూతన శిలాయుగపు, ఇనుప యుగపు జనావాసాలు పక్కపక్కనే కనిపించాయి. ఈ జిల్లాలో ముదిగల్లు, దేవాదుల బెట్ట మాల్వవంతం, కొండాపురం, పూతేరులలో సిస్ట్‌లు కనిపించాయి. ముదిగల్లులో ఈ సిస్ట్‌లు 6-7 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో చెదిరి వున్నాయి. రాయలసీమను మౌర్యులు, పల్లవులు, శాతవాహనులు, చాళుక్యులు పరిపాలించారు. క్రీ.శ. 3వ శతాబ్దంలోచిత్తూరు జిల్లా పల్లవుల రాజ్య పాలన కింద ఉండేది. అనంతపురం జిల్లా అశోకుని తర్వాత పల్లవుల పాలనలోకి వచ్చింది. శాతవాహన పతనానంతరం క్రీ.శ. 2వ శతాబ్దంలో కడప జిల్లా పల్లవుల పరిపాలన కిందకొచ్చింది. కర్నూలు జిల్లా తెలుగు చోళుల పాలనలో ఉండేది. ఆంధ్రదేశాన్ని దీర్ఘకాలం పరిపాలించి, ఆంధ్ర చరిత్రలో కొన్ని నూతన అధ్యాయాలను నెలకొల్పిన చాళుక్యుల జన్మస్థలం కడప జిల్లా. ప్రాచీన కాలంలో ఈ జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారు. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందులు సంఘర్షిస్తున్న కాలంలో రాయలసీమకు చెందిన రేనాడులో తెలుగు చోళులు పరిపాలించేవారు. ఈ కుటుంబానికి చెందిన కరికాలచోళుడు, త్రిలోచనపల్లవుడనే 4వ విజయస్కంద వర్మను ఓడించాడు. ఈయనే చోళ వంశారంభకుడు. ఇతని వారసులు కడప జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకాలను క్రీ.శ. 700 వరకు పరిపాలించినారు. మదనపల్లె తాలూకాలోని చిప్పిలి వారి రాజధానిగా వుండేది. క్రీ.శ. 5,8 శతాబ్దాల మధ్య కడప, కర్నూలు జిల్లాలను పాలించిన రేనాటి చోళులు తమ శాసనాలలో ప్రాచీన తెలుగును ఉపయోగించినారు. ఈనాడు వానిని అర్థం చేసుకోవడం కష్టం. రేనాటి చోళులు తెలుగు పద్యానికి రాజాదరణ నిచ్చినారు.

కొంతకాలం పల్లవులకిందా, మరి కొంతకాలం చాళుక్యుల కిందా సామంతులుగా వుండిన రేనాటి చోళులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు, మండలాలుగా విభజించినారు. మండలాలను గ్రామాలుగా విభజించినారు. పశుసంపదను రక్షించటంలో ప్రాణాలు అర్పించిన వీరుల సంస్మరణార్థం ఆనాడు నాటిన రాతిస్థంభాలు రాయలసీమ గ్రామాలలో నేటికీ వున్నాయి. ఆనాటి చోళరాజులు అనేక చెరువులు తవ్వించినారు.

కాకతీయులు తమ రాజ్యాన్ని రేనాడు, మురికినాడు, ఏరువనాడులుగా విభజించి పరిపాలించారు. కడప, కర్నూలు జిల్లా భాగాలు ఏరువనాడుగా విభజింపబడినాయి. కాకతీయులు వ్యవసాయాన్ని బాగా అభివృద్ది చేసినారు. భూములను కొలిచి తరగతుల కింద విభజించారు. భూసారాన్ని బట్టి పన్నులు విధించారు. కాలువలు, చెరువులు తవ్వినారు. అంజూపురం లాంటి కొన్ని గ్రామాలు వెలిసాయి. "పొత్తపినాడు పౌరులు అత్తిరాళ్లలోని పరమేశ్వర దేవాలయంలో సభ జరిపి చెయ్యేరు దక్షిణపు ఒడ్డున కరకట్ట పోసి పరమేశ్వర దేవాలయానికి వరద ముంపు కాకుండా చెయ్యటానికై గ్రామానికో మాడ వసూలు చేయ నిశ్చయించినారు'' అని ఒక శాసనం తెలుపుతోంది. కర్నూలు జల్లా అడవిగా వుండటం చూసి ప్రతాపరుద్రుడు ఉత్తర దిశ నుంచి నీటి పారుదలకు ప్రోత్సాహం ఇచ్చినాడు. అడవి కొట్టించి, గ్రామాలు నిర్మించి భూముల్ని ఉచితంగా ఇచ్చినాడు.




*రాయలసీమలో కొత్త రాతి యుగపు (Neolithic Period) అవశేషాలు* 

        కొత్త రాతి యుగం 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమై 4000 సంవత్సరాల వరకు సాగింది. ఈ యుగంలోనే మనిషి ఒకచోట స్థిరంగా ఆహారాన్ని వ్యవసాయం చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. దానికోసం శిలాపనిముట్లను తయారు చేసుకున్నాడు. 
దాంతో గ్రామాలు ఏర్పడినాయి. నాగరిక జీవనానికీది నాంది పలికింది. ఈ కాలపు అవశేషాలు తెలుగు రాష్ట్రాల్లో 4000 ఏళ్ల కింద కనిపించాయి.
 చరిత్రపూర్వయుగానికి పితామహుడిగా పేరొందిన రాబర్ట్ బ్రూస్ ఫుట్ కడప జిల్లాలో హనుమంతరావు పేట, పెద్దముడియం, బలిజపల్లె లో , అనంతపురంజిల్లాలో 25 స్థావరాల్లో త్రవ్వకాలు జరిపి ఈ యుగానికి చెందిన ఆధారాలు వెలికితీశాడు. 
      
  పశువుల పేడను కుప్పగా కాల్చడం వల్ల ఏర్పడిన బూడిద కుప్పలు (ash mounds) 
అనంతపురం జిల్లాలోని పాలవాయి, కర్ణాటకలోని కుపల్, పిక్లిహాల్లో కనిపించాయి. కానీ ఇవి వైఎస్ఆర్ జిల్లాలో కనిపించలేదు.
ధర్మోలు మినిసెన్స్ పద్ధతి ద్వారా ఈ బూడిద దిబ్బలు సుమారు క్రీ.పూ 2000 కాలంలో కాల్చినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనిని బట్టే అప్పటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణపైన ఆధారపడ్డారని నిర్ధారించారు. ఈ కాలంలో జొన్న, రాగి, ఉలవ, పెసర మొదలైన పంటలు పండించారు. కర్నూలు జిల్లాలో రామాపురంలో బార్లీ, మినుములను ఎక్కువగా పండించారు.ఈ కాలం నాటి వ్యవసాయ క్షేత్రాలు అనంతపురం జిల్లాలోని పాలవాయి, లత్తవరం, కర్నూలు జిల్లాలోని బేతంచర్లలో కనిపించాయి. 
 వ్యవసాయం చేయడానికి పశువులు అవసరం అయ్యాయి. దానికోసం గేదెలు(ఎనుములు), ఆవులు, మేకలు, గొర్రెలు, పందులను పెంచారు. కుక్క, ఎద్దు, మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నారు. 
నియోలిథిక్ మనిషి సాగుతో పాటు, వేట, చేపలు పట్టడం అతనికి సహజంగా లభించే పండ్లు, కూరగాయలు, తినదగిన గడ్డి లేదా దుంపలు వంటివాటిపై ఆధారపడి ఉన్నాడు.

ఆది మానపుడు కుండలు తయారు చేయడం నేర్చుకుంది ఈ యుగంలోనే.మొదట్లో కుండలను చేత్తో తయారు చేసి, పట్టుకొని కాల్చాడు. ఆ కుండ అడుగు భాగం కాలి ఎర్రగా వుంది. పై భాగం కాలకుండా నల్లగా ఉంది. చేతి గుర్తులు కూడా ఉన్నాయి.‌ కుమ్మరి సారెను తరువాత కొనుక్కున్నాడు. కుండలతో పాటు అన్ని రకాల పాత్రలను తయారు చేసుకున్నాడు.రాతి విగ్రహాలను కూడా తయారు చేశాడు.ఈ యుగపు ఆనవాళ్లు కడప జిల్లాలోని మైలవరంలో ఎక్కువగా కనిపించాయి. పులివెందుల, వేముల, ఎల్లటూరు,పెద్దముడియం బలిజేపల్లి లో ఎరుపు రంగులో పెయింట్ వేయబడిన కుండలు కొన్ని తవ్వకాల్లో లభించాయి. కార్బన్ డేటింగ్ పద్ధతిలో ఇవి క్రీ.పూ. 1540, క్రీ.పూ. 1100 మధ్య కాలానికి చెందినవిగా నిర్ధారించారు. ఇవి దాదాపు కర్ణాటకలోని వాట్ గల్ ప్రాంతంలో లభించిన కుండల కాలానికి సమకాలీనంగా ఉన్నాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలానికి చెందిన వేల్పుమడుగు గ్రామప్రాంతంలో మూపురం గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం లభ్యమైంది.తెనగల ప్రాంతంలో ఎరుపు రంగులో ఉన్న కుక్క, జింక చిత్రాలు లభించాయి.
     చెర్ట్ (సహజంగా ప్రకృతిలో లభించే పదునైన రాయి)నుంచి చిన్న బ్లేడ్‌లు తయారు చేసి వాటిని బహుశా బార్బ్‌లు లేదా బాణం తలలుగా ఉపయోగించేవారు.లేదా వాటిని కత్తులు, కొడవళ్లు లాగా ఉపయోగించేందుకు రెసిన్‌(బంక)తో చెక్క ముక్క లకు లేదా ఎముకకు అమర్చబడి ఉండవచ్చు. 
ప్రధానంగా గొడ్డలి, సుత్తి, ఉలి అనే పనిముట్లు ఉపయోగించారు. వీటికొరకు నల్లశాణం, బసాల్ట్, చెర్ట్ శిలను వాడారు. ఆయుధాలు డోలమైట్ తో తయారుచేశారు.
గుంటూరు జిల్లాలోని వడ్డమాను గ్రామం దగ్గర ఈ కాలపు రాతి గొడ్డలిని కనుగొన్నారు. రాయితో చేసిన బ్లేడులు కూడా దొరికాయి. బేతంచర్ల (కర్నూలు జిల్లా), వీరాపురం, నాగార్జునకొండ, గిద్దలూరు, తాడిపత్రి మొదలైన ప్రాంతాల్లో కొత్త రాతి యుగపు పనిముట్లు లభించాయి. బండి చక్రాన్ని కూడా ఈ యుగంలోనే కనుగొని బండ్లను తయారు చేసుకున్నాడు. పిడికర్ర పెట్టేందుకు చెక్కిన రాతి ముక్క లభించినది
గిడుగనూరు వద్ద ఒకవిధమైన పాలరాతితో చేసిన కత్తులు లభించాయి. తెలంగాణా లోని కరీంనగర్ జిల్లా కు చెందిన కదంబాపూర్ లో పనిముట్లు తయారు చేసే కేంద్రం కూడా ఒకటి బయటపడింది. 
     ‌వలయాకృతిలో రాళ్లను పేర్చి కర్రలను కడ్డీలుగా అమర్చి, రెల్లుగడ్డితో కప్పును వేసుకున్నారు.ఇంటి వెనుక నుండి జంతువులు దాడి చేయడానికి వీలు లేకుండా, ఇళ్ళను ఒకదానికి మరొకటి అనించి నిర్మించుకున్నారు.ఇటువంటి ఇళ్ల ఆనవాల్లు వైఎస్ఆర్ జిల్లాలోని పెద్దముడియం
లో ఇలాంటి అవశేషాలు రెండు గుర్తించారు. 
ఇవి 1540 В.С.,1100 В.С.కాలానికి చెందినవిగా రేడియో కార్బన్ ద్వారా నిర్ధారించారు. 
       అనంతపురం జిల్లాలోని హుళికల్లు, లత్తవరం, మహబూబ్ నగర్ జిల్లాలోని చినమారూరులో కూడా ఇలాంటి వే కనిపించాయి.టెక్కల్‌కోట (కర్ణాటక) వద్ద  3 మీటర్ల నుండి 5 మీటర్ల వ్యాసం కలిగిన చిన్న వృత్తాకార  గుడిసెల అవశేషాలు చేయబడ్డాయి. ఇవి 1780 బి.సి. నుండి 1540 B.C. కాలానికి చెందినవని గుర్తించారు.  

ఈ కాలంలోనే రాతి బండను తొలిచి గుహలలో ఉండే విధంగా 8 ఇళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో ఒక ఇంటి మధ్యలో కుండలో శిశువు కళేబరాన్ని పెట్టి సమాధి చేయబడింది. కడప జిల్లాలోని పులివెందుల దగ్గర ఇలాంటి ఒక గుహను కనుగొన్నారు. ఆ గుహలో ఆనాటి ప్రజలు నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు.
       గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద గల గండ్లూరు గ్రామంలో కూడా ఇలాంటిది కనిపించింది. ఈ ఆధారాల వల్లనే కొత్త రాతి యుగపు బూడిద దిబ్బలనే పదాన్ని సాహిత్యంలో ఉపయోగించేందుకు దారితీశాయి.
      ఈ యుగంలోనే మత విశ్వాసాలు ప్రారంభమయ్యాయి. పురుషాధిక్యత మొదలైంది. రాబర్ట్ బ్రూస్పూట్ ప్రకారం ఈ యుగ కాలంలో మొదటగా 'రాయచూరు'లో 'లింగ ఆరాధన' మొదలైంది. శ్రమ విభజన కూడా జరిగింది.
   పురావస్తు శాస్త్రవేత్తలకు రాక్ ఆర్ట్ అనేది చాలా ఉపయోగకరమైనది. వీటి ఆధారంగా అప్పటి ప్రజల సంస్కృతిని, జీవన విధానాన్ని అంచనా వేయగలుగుతారు. ఈ రాక్ ఆర్ట్ రెండు విధాలుగా ఉంటుంది. గుహల్లో బండలపైన ఒక పదునైన రాయితోనో, ఉలితోనో చెక్కిన ఆకారాలు ఒకటి.
 వివిధ రంగులతో గీచిన చిత్రాలు మరొకటి. వీటిని బట్టి వాటి కాలాన్ని నిర్ధారించవచ్చు.వీటి ఆధారంగా వైఎస్ఆర్ జిల్లా లో కనుగొన్న రాతి చిత్రాలను క్రీ.ఫూ.8000-1500 కు చెందినవిగా గుర్తించారు.

వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు
మండలం చింతకుంట గ్రామంలో, వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ లో ఐఐఐటి సమీపంలో ఉన్న కొండలపై
ఆది మానవుడు రాళ్ల పై గీచిన రేఖా చిత్రాల గురించి ఆస్ట్రియా పురాతత్వ శాస్త్రవేత్త ఇర్విన్ న్యూ మేయర్” లైన్స్ ఆన్ స్టోన్ ది ప్రి హిస్టారిక్ రాక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా" అనే పుస్తకంలో వీటి గురించి రాసినాడు. చింతకుంటలో మాదిరి దొప్పల్లెలో కూడా ఇలాంటి రేఖా చిత్రాలున్నాయి. అయితే ఆ పల్లె ఇప్పుడు మైలవరం జలాశయంలో మునిగిపోయింది.
దక్షిణ భారతదేశంలోనే మొదటి పెద్దదైన, ప్రముఖమైన మిసోలిథిక్ కాలానికి ( వీటిని 1981లో గుర్తించారు.మన రాష్ట్రంలో మధ్య రాతి యుగం (మిసోలిథిక్), కొత్త రాతి యుగం నాటి రాతి కళా స్థావరాలు చాలాచోట్ల ఉన్నాయి.
       ఇవి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మహబూబ్ నగర్, ప్రకాశం, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్నాయి. 
        ఆ నాటి మానవుడు చెక్కుచెదరని విధంగా తనకు తెలిసిన నైపుణ్యం తో
రాళ్ల మీద వేసిన బొమ్మలను చూస్తే అచ్చెరువొందుతాము. జింకల బొమ్మలు, మానవాకృతి చిత్రాలున్నాయి. వాటికి శిరోవేష్టనం ఉంది. రేఖలు చెదిరి శరీరభాగం మీద అడ్డదిడ్డంగా ఉన్నాయి. మధ్య శిలాయుగంతోపాటు నవీన శిలాయుగ శిలా చిత్ర లేఖనాలు చింతకుంటలో ఉండటం చాలా అరుదైన విషయం. 
  విల్లంబులు కలిగి ఉన్న మానవులు మూపురం ఎద్దుల పక్కనే ఉన్నారు. శిలల మీద గంట్లు, గీట్లు పెట్టినట్లు చెక్కడాలు కూడా మూపురం ఎద్దులకే ఎక్కువగా వున్నవి. ఈ మూపురం ఎద్దులకు శైలీపరమైన పోలికలున్న శిలా చిత్రలేఖనాలు భారతదేశంలో ఎక్కడా కానరాలేదని పరిశోధకులు చెపుతున్నారు. 
ఈ చిత్రాలు నేలకు 3 నుంచి 5 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అందులో మూపురం ఎద్దులు ఒకే ఒక గుండుపై ఉన్నాయి. ఈ గుండును స్థానిక ప్రజలు ఆవుల గుండు అంటారు. అలాగే మైథున క్రీడలో వున్న దంపతుల చిత్రం కూడా ఉంది. వేంపల్లె సమీపంలో ఉన్న ఇడుపులపాయలో కనిపిస్తున్న చిత్రాలలో
పాడెను(శవాన్ని) నలుగురు మోస్తున్న తీరు, ఆ శవంతో పాటు వెళ్తున్న ప్రజలు కనిపిస్తారు. ఇది ఆనాటి ప్రజలు చేసిన విధానమే ఇప్పటికే కొనసాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది.
ఇక్కడే మరో చోట
ఎర్రని రంగుల రేఖా చిత్రాలలో కొన్ని ఏనుగుల బొమ్మలు కూడా వున్నాయి. 

ఎథ్నో-ఆర్కియాలజీ:

      నియోలిథిక్ ప్రజలు పశుపోషణను మొదటిగా ఆచరించిన ప్రాచీన ప్రజలు. ఈరోజు కూడా గొల్ల, కురుబ అనే రెండు సమకాలీన పశుపోషక తెగల జీవనశైలి, సంస్కృతి అధ్యయనం చేయడం ద్వారా నియోలిథిక్ ప్రజల జీవన విధానాన్ని మనం బాగా అర్థం చేసుకోగలం. నియోలిథిక్ స్థలాల పరిసరాల్లో ఉన్న వ్యవసాయ భూములు పశుపోషక కులమైన గొల్ల కులానికి చెందినవిగా కనిపిస్తున్నాయి. ఈ గొల్లలు ఈ అధ్యయన గ్రామాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈనాటికీ ప్రభావశీలులుగా ఉన్నారు. ఎందుకంటే వారు వ్యవసాయంతో పాటు పశుపోషణను కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి, జీవనాధార పద్ధతులు, ఆర్థిక జీవితం, భౌతిక సంస్కృతిని మనం అధ్యయనం చేయడం ద్వారా, వీరు అనుసరించిన జీవన విధానం ఆధారంగా ప్రాచీన ప్రజల జీవన విధానాన్ని పునర్నిర్మించడం సాధ్యపడుతుంది. వారు కూడా వ్యవసాయం, పశుపోషణ, వేట మొదలైనవన్నీ ఆచరించినవారే.



___ పిళ్లా కుమారస్వామి,9490122229

 *References* :
An outline of Indian Prehistory__D K Bhattacharya
(ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి__డా. యం. అబ్దుల్ కరీం)
(ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర__
డా॥పి. జోగినాయుడు)
ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి__ సయ్యద్ రాజా
LINES ON STONE : The Prehistoric Rock Art Of India__ERWIN NEUMAYER
Kadapainfo.com
NEOLITHIC EXPLORATIONS KADAPA DISTRICT OF AP: A HISTORICAL SURVEY_Hemamanjari
కడపజిల్లా విజ్ఞాన దీపిక_డా.చింతకుంట శివారెడ్డి
PARIPEX-INDIAN JOURNAL OF RESEARCH | Volume 11 



ఇవ్వబడిన పూర్తి విషయాన్ని అర్థం మారకుండా, అకాడమిక్ శైలిలో తెలుగులోకి అనువదిస్తున్నాను. మీరు దీన్ని నేరుగా పేపర్ / థీసిస్ / పుస్తకం కోసం ఉపయోగించుకోవచ్చు.





ఆర్థిక అభివృద్ధిలో మానవ మూలధనపు పాత్ర



(Role of Human Capital in Economic Development)


మానవ వనరులు ఆర్థిక అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆర్థిక శాస్త్రవేత్తలు చాలామంది జనాభాను అభివృద్ధికి సహాయకారకంగా కాకుండా, అభివృద్ధికి అడ్డంకిగా చూస్తుంటారు. అయితే, మానవుడు ఆర్థిక వృద్ధికి సానుకూలంగా దోహదపడతాడు. ఉత్పత్తికి అవసరమైన శ్రమశక్తిని మానవుడే అందిస్తాడు. ఒక దేశంలో శ్రమ సమర్థవంతంగా, నైపుణ్యంతో కూడి ఉంటే, ఆ శ్రమ ఆర్థిక వృద్ధికి ఇచ్చే సహకారం అత్యధికంగా ఉంటుంది.


అజ్ఞానం, నైపుణ్యలేమి, రోగగ్రస్త స్థితి, మూఢనమ్మకాలతో బాధపడే ప్రజల ఉత్పాదకత సాధారణంగా తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రజలు దేశ అభివృద్ధి కార్యాచరణకు ఆశాజనకమైన శక్తిగా నిలవలేరు.


“మానవజాతి జీవించి ఉండాలంటే మన ఆలోచనా విధానంలో మౌలికమైన మార్పు అవసరం.”

— ఆల్బర్ట్ ఐన్‌స్టీన్


ప్రజలను అభివృద్ధి చేయడం అనేది మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల మూల సారాంశం. అభివృద్ధి ప్రణాళికలు, విధానాలు, కార్యక్రమాలు, కొత్త వ్యవస్థలు, యంత్రాంగాల ఏర్పాటు వంటి అన్ని అభివృద్ధి చర్యలకు మానవాభివృద్ధి ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది.





ఆంధ్రప్రదేశ్ – ప్రాంతీయ నేపథ్యం



ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఇది దేశం యొక్క ఆగ్నేయ తీర ప్రాంతంలో ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. 2011 భారత జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ జనాభా 4,93,86,799గా ఉండి, జనాభా పరంగా దేశంలో 10వ స్థానంలో ఉంది. 972 కిలోమీటర్ల తీరరేఖతో, గుజరాత్ తరువాత రెండవ పొడవైన తీరరేఖ గల రాష్ట్రంగా నిలుస్తుంది.


ఈ రాష్ట్రానికి వాయువ్యంగా తెలంగాణ, ఈశాన్యంలో ఒడిశా, దక్షిణంలో తమిళనాడు, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి:


  1. తీరాంధ్ర
  2. రాయలసీమ



మొత్తం 13 జిల్లాలు ఉండగా, వాటిలో 9 జిల్లాలు తీరాంధ్రలో, 4 జిల్లాలు రాయలసీమలో ఉన్నాయి.





రాయలసీమ – మానవ మూలధన పరిస్థితి



రాయలసీమ (అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ అంచున ఉంది. తూర్పున నెల్లూరు జిల్లా, పడమరన కర్ణాటక, ఉత్తరాన తెలంగాణ, దక్షిణాన తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.


2011 జనగణన ప్రకారం, రాయలసీమ నాలుగు జిల్లాల విస్తీర్ణం 67,299 చదరపు కిలోమీటర్లు, జనాభా సుమారు 1.52 కోట్లు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా మాత్రమే కాకుండా, కరువు ప్రభావిత ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఈ అధ్యయనం రాయలసీమలో మానవ మూలధన స్థితి (HDI) ఏ విధంగా ఉందో విశ్లేషిస్తుంది.





మానవాభివృద్ధి భావన



మానవాభివృద్ధి అనేది ప్రజల ఎంపికలను విస్తరించడమే కాకుండా, వారి జీవన స్థాయిని పెంచే ప్రక్రియ. పౌల్ స్ట్రీటెన్ పేర్కొన్నట్లు, మానవాభివృద్ధి భావన ప్రజలను మళ్లీ కేంద్ర బిందువులోకి తీసుకువస్తుంది. సాంకేతిక పదజాలం ఆధిపత్యం చెలాయించిన దశాబ్దాల తరువాత, అభివృద్ధి యొక్క మౌలిక దృష్టిని ఇది తిరిగి స్థాపిస్తుంది.





ఆంధ్రప్రదేశ్‌లో మానవ మూలధన స్థితి



అభివృద్ధి యొక్క కేంద్రబిందువు ప్రజలేననే సత్యాన్ని మేము తిరిగి గుర్తిస్తున్నాము. అభివృద్ధి లక్ష్యం ప్రజలకు మరిన్ని అవకాశాలను అందించడమే. ఆదాయ ప్రాప్తి ఒక ముఖ్యమైన అవకాశం అయినప్పటికీ, అది స్వయంగా లక్ష్యం కాదు; మానవ సౌఖ్యాన్ని పొందడానికి ఒక సాధనం మాత్రమే.


ఇతర ముఖ్యమైన అవకాశాలు కూడా ఉన్నాయి:


  • దీర్ఘాయుష్క జీవితం
  • జ్ఞానం
  • రాజకీయ స్వేచ్ఛ
  • వ్యక్తిగత భద్రత
  • సమాజంలో భాగస్వామ్యం
  • మౌలిక మానవ హక్కుల హామీ



ప్రజలను కేవలం ఆర్థిక జీవులుగా మాత్రమే చూడలేం. అభివృద్ధి ప్రక్రియలో మానవ సామర్థ్యాలు ఎలా విస్తరించబడుతున్నాయో, ఎలా సమర్థవంతంగా వినియోగించబడుతున్నాయో పరిశీలించడం ఎంతో ఆసక్తికరం.





ఆదాయం, అక్షరాస్యత, ఆయుర్దాయం



పట్టిక–1 ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా 2008–09 మరియు 2009–10 సంవత్సరాలలో వ్యక్తిగత ఆదాయాన్ని చూపిస్తుంది. తీరాంధ్రలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మరియు రాయలసీమలో అనంతపురం, వై.ఎస్.ఆర్. కడప జిల్లాలు అత్యధిక వ్యక్తిగత ఆదాయం కలిగి ఉన్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం (తీరాంధ్ర) మరియు చిత్తూరు, కర్నూలు (రాయలసీమ) జిల్లాలు అత్యల్ప వ్యక్తిగత ఆదాయం కలిగి ఉన్నాయి. మొత్తం మీద, తీరాంధ్ర సగటు వ్యక్తిగత ఆదాయం రాయలసీమ కంటే ఎక్కువగా ఉంది.


పట్టిక–2 ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీ అక్షరాస్యత రేటును చూపిస్తుంది. గత మూడు దశాబ్దాలలో అక్షరాస్యత పెరిగినప్పటికీ, అది జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉంది. 2011 జనగణన ప్రకారం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు మాత్రమే 70% కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించాయి. వీటిలో రాయలసీమకు చెందిన జిల్లా చిత్తూరు మాత్రమే.


విజయనగరం, కర్నూలు జిల్లాల్లో అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. కాబట్టి తీరాంధ్ర సగటు అక్షరాస్యత రాయలసీమ కంటే ఎక్కువగా ఉంది. అక్షరాస్యత మానవాభివృద్ధి సూచిక (HDI)లో అత్యంత ముఖ్యమైన ప్రమాణం. అక్షరాస్యత తక్కువగా ఉండటమే ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ HDI ర్యాంకు రావడానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అవసరం.


పట్టిక–3 ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ఆయుర్దాయం (Life Expectancy) వివరాలను చూపిస్తుంది. 1980–81 నుంచి 2005–06 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో ఆయుర్దాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రగతి సాధించింది.





రాయలసీమలో మానవ మూలధన అభివృద్ధి అవసరం



రాయలసీమ ప్రాంతంలో మానవ మూలధన అభివృద్ధి అత్యంత అవసరం. పోషణ, ఆరోగ్యం, విద్య ద్వారా మానవ మూలధన నిర్మాణం జరగాలి. ఆర్థిక వృద్ధి ఫలితాలు ప్రజల జీవితాల్లోకి చేరాలంటే మానవాభివృద్ధి కీలకం.


“ప్రజల కోసం అభివృద్ధి” అంటే అభివృద్ధి ఫలితాలు ప్రజలకు చేరాలి.

“ప్రజల ద్వారా అభివృద్ధి” అంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రక్రియల్లో వారు భాగస్వాములు కావాలి.


అంటే, అభివృద్ధి ప్రజలకు అనుగుణంగా ఉండాలి; ప్రజలను అభివృద్ధికి అనుగుణంగా మార్చకూడదు.




డా. జి. యెల్లా కృష్ణ

(www.impactjournals.us)

మానవ మూలధనం – ఆరోగ్యం – విద్య – ఆదాయం




మీకు ఇవ్వబడిన పూర్తి విషయాన్ని అర్థం మారకుండా, అకాడమిక్ శైలిలో తెలుగులోకి అనువదిస్తున్నాను. మీరు దీన్ని నేరుగా పేపర్ / థీసిస్ / పుస్తకం కోసం ఉపయోగించుకోవచ్చు.





ఆర్థిక అభివృద్ధిలో మానవ మూలధనపు పాత్ర



(Role of Human Capital in Economic Development)


మానవ వనరులు ఆర్థిక అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆర్థిక శాస్త్రవేత్తలు చాలామంది జనాభాను అభివృద్ధికి సహాయకారకంగా కాకుండా, అభివృద్ధికి అడ్డంకిగా చూస్తుంటారు. అయితే, మానవుడు ఆర్థిక వృద్ధికి సానుకూలంగా దోహదపడతాడు. ఉత్పత్తికి అవసరమైన శ్రమశక్తిని మానవుడే అందిస్తాడు. ఒక దేశంలో శ్రమ సమర్థవంతంగా, నైపుణ్యంతో కూడి ఉంటే, ఆ శ్రమ ఆర్థిక వృద్ధికి ఇచ్చే సహకారం అత్యధికంగా ఉంటుంది.


అజ్ఞానం, నైపుణ్యలేమి, రోగగ్రస్త స్థితి, మూఢనమ్మకాలతో బాధపడే ప్రజల ఉత్పాదకత సాధారణంగా తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రజలు దేశ అభివృద్ధి కార్యాచరణకు ఆశాజనకమైన శక్తిగా నిలవలేరు.


“మానవజాతి జీవించి ఉండాలంటే మన ఆలోచనా విధానంలో మౌలికమైన మార్పు అవసరం.”

— ఆల్బర్ట్ ఐన్‌స్టీన్


ప్రజలను అభివృద్ధి చేయడం అనేది మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల మూల సారాంశం. అభివృద్ధి ప్రణాళికలు, విధానాలు, కార్యక్రమాలు, కొత్త వ్యవస్థలు, యంత్రాంగాల ఏర్పాటు వంటి అన్ని అభివృద్ధి చర్యలకు మానవాభివృద్ధి ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది.





ఆంధ్రప్రదేశ్ – ప్రాంతీయ నేపథ్యం



ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఇది దేశం యొక్క ఆగ్నేయ తీర ప్రాంతంలో ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. 2011 భారత జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ జనాభా 4,93,86,799గా ఉండి, జనాభా పరంగా దేశంలో 10వ స్థానంలో ఉంది. 972 కిలోమీటర్ల తీరరేఖతో, గుజరాత్ తరువాత రెండవ పొడవైన తీరరేఖ గల రాష్ట్రంగా నిలుస్తుంది.


ఈ రాష్ట్రానికి వాయువ్యంగా తెలంగాణ, ఈశాన్యంలో ఒడిశా, దక్షిణంలో తమిళనాడు, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి:


  1. తీరాంధ్ర
  2. రాయలసీమ



మొత్తం 13 జిల్లాలు ఉండగా, వాటిలో 9 జిల్లాలు తీరాంధ్రలో, 4 జిల్లాలు రాయలసీమలో ఉన్నాయి.





రాయలసీమ – మానవాభివృద్ధి సూచికల పరిస్థితి



రాయలసీమ (అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ అంచున ఉంది. తూర్పున నెల్లూరు జిల్లా, పడమరన కర్ణాటక, ఉత్తరాన తెలంగాణ, దక్షిణాన తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.


2011 జనగణన ప్రకారం, రాయలసీమ నాలుగు జిల్లాల విస్తీర్ణం 67,299 చదరపు కిలోమీటర్లు, జనాభా సుమారు 1.52 కోట్లు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా మాత్రమే కాకుండా, కరువు ప్రభావిత ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఈ అధ్యయనం రాయలసీమలో మానవ మూలధన స్థితి (HDI) ఏ విధంగా ఉందో విశ్లేషిస్తుంది.



మానవాభివృద్ధి భావన

మానవాభివృద్ధి అనేది ప్రజల ఎంపికలను విస్తరించడమే కాకుండా, వారి జీవన స్థాయిని పెంచే ప్రక్రియ. పౌల్ స్ట్రీటెన్ పేర్కొన్నట్లు, మానవాభివృద్ధి భావన ప్రజలను మళ్లీ కేంద్ర బిందువులోకి తీసుకువస్తుంది. సాంకేతిక పదజాలం ఆధిపత్యం చెలాయించిన దశాబ్దాల తరువాత, అభివృద్ధి యొక్క మౌలిక దృష్టిని ఇది తిరిగి స్థాపిస్తుంది.





రాయలసీమ ‌లో మానవాభివృద్ధి స్థితి



ప్రజలే అభివృద్ధికి కేంద్రబిందువు. అభివృద్ధి లక్ష్యం ప్రజలకు మరిన్ని అవకాశాలను అందించడమే. ఆదాయ ప్రాప్తి ఒక ముఖ్యమైన అవకాశం అయినప్పటికీ, అది స్వయంగా లక్ష్యం కాదు; మానవ సౌఖ్యాన్ని పొందడానికి ఒక సాధనం మాత్రమే.ఇతర ముఖ్యమైన అవకాశాలు కూడా ఉన్నాయి:


  • దీర్ఘాయుష్క జీవితం
  • జ్ఞానం
  • రాజకీయ స్వేచ్ఛ
  • వ్యక్తిగత భద్రత
  • సమాజంలో భాగస్వామ్యం
  • మౌలిక మానవ హక్కుల హామీ



ప్రజలను కేవలం ఆర్థిక జీవులుగా మాత్రమే చూడలేం. అభివృద్ధి ప్రక్రియలో మానవ సామర్థ్యాలు ఎలా విస్తరించబడుతున్నాయో, ఎలా సమర్థవంతంగా వినియోగించబడుతున్నాయో పరిశీలించడం ఎంతో ఆసక్తికరం.





ఆదాయం, అక్షరాస్యత, ఆయుర్దాయం



పట్టిక–1 ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా 2008–09 మరియు 2009–10 సంవత్సరాలలో వ్యక్తిగత ఆదాయాన్ని చూపిస్తుంది. తీరాంధ్రలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మరియు రాయలసీమలో అనంతపురం, వై.ఎస్.ఆర్. కడప జిల్లాలు అత్యధిక వ్యక్తిగత ఆదాయం కలిగి ఉన్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం (తీరాంధ్ర) మరియు చిత్తూరు, కర్నూలు (రాయలసీమ) జిల్లాలు అత్యల్ప వ్యక్తిగత ఆదాయం కలిగి ఉన్నాయి. మొత్తం మీద, తీరాంధ్ర సగటు వ్యక్తిగత ఆదాయం రాయలసీమ కంటే ఎక్కువగా ఉంది.


పట్టిక–2 ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీ అక్షరాస్యత రేటును చూపిస్తుంది. గత మూడు దశాబ్దాలలో అక్షరాస్యత పెరిగినప్పటికీ, అది జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉంది. 2011 జనగణన ప్రకారం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు మాత్రమే 70% కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించాయి. వీటిలో రాయలసీమకు చెందిన జిల్లా చిత్తూరు మాత్రమే.


విజయనగరం, కర్నూలు జిల్లాల్లో అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. కాబట్టి తీరాంధ్ర సగటు అక్షరాస్యత రాయలసీమ కంటే ఎక్కువగా ఉంది. అక్షరాస్యత మానవాభివృద్ధి సూచిక (HDI)లో అత్యంత ముఖ్యమైన ప్రమాణం. అక్షరాస్యత తక్కువగా ఉండటమే ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ HDI ర్యాంకు రావడానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అవసరం.


పట్టిక–3 ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ఆయుర్దాయం (Life Expectancy) వివరాలను చూపిస్తుంది. 1980–81 నుంచి 2005–06 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో ఆయుర్దాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రగతి సాధించింది.





రాయలసీమలో మానవ మూలధన అభివృద్ధి అవసరం



రాయలసీమ ప్రాంతంలో మానవ మూలధన అభివృద్ధి అత్యంత అవసరం. పోషణ, ఆరోగ్యం, విద్య ద్వారా మానవ మూలధన నిర్మాణం జరగాలి. ఆర్థిక వృద్ధి ఫలితాలు ప్రజల జీవితాల్లోకి చేరాలంటే మానవాభివృద్ధి కీలకం.


“ప్రజల కోసం అభివృద్ధి” అంటే అభివృద్ధి ఫలితాలు ప్రజలకు చేరాలి.

“ప్రజల ద్వారా అభివృద్ధి” అంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రక్రియల్లో వారు భాగస్వాములు కావాలి.


అంటే, అభివృద్ధి ప్రజలకు అనుగుణంగా ఉండాలి; ప్రజలను అభివృద్ధికి అనుగుణంగా మార్చకూడదు.




డా. జి. యెల్లా కృష్ణ

(www.impactjournals.us)

మానవ మూలధనం – ఆరోగ్యం – విద్య – ఆదాయం


ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ తెగల సామాజిక–ఆర్థిక స్థితి




కడప జిల్లా : ఒక విశ్లేషణ



(Socio-economic Status of Scheduled Tribes in Andhra Pradesh: An Analysis in Kadapa District)


షెడ్యూల్డ్ తెగల సామాజిక–ఆర్థిక స్థితిని అధ్యయనం చేయడానికి **బహుస్థాయి యాదృచ్ఛిక నమూనా పద్ధతి (Multi-stage Random Sampling Technique)**ను ఉపయోగించారు.


మొదటి దశలో, ఈ అధ్యయనం కోసం కడప జిల్లాను ఉద్దేశపూర్వకంగా (purposively) ఎంపిక చేశారు.

రెండవ దశలో, కడప, జమ్మలమడుగు, రాజంపేట అనే మూడు రెవెన్యూ డివిజన్లను ఎంపిక చేశారు.

మూడవ దశలో, ప్రతి డివిజన్ నుండి యాదృచ్ఛికంగా రెండు మండలాలను ఎంపిక చేయగా, అవి రాయచోటి, టి.సుందుపల్లి, నందలూరు, బి.కోడూరు, తొండూరు, వెంపల్లి మండలాలు.

నాలుగవ దశలో, ప్రతి మండలం నుండి యాదృచ్ఛికంగా 25 మంది గిరిజనులను నమూనాగా ఎంపిక చేశారు.


ఈ విధంగా ఎంపికైన నమూనా గ్రామాలలోని అన్ని గిరిజన కుటుంబాలను సిద్ధం చేసిన ప్రశ్నావళి (schedule) సహాయంతో ఇంటర్వ్యూ చేయగా, కడప జిల్లాలో మొత్తం 150 మంది నమూనా ప్రతిస్పందకులు (respondents) ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.





జనసాంఖ్యిక లక్షణాలు



అధ్యయన ప్రాంతంలో పురుషులు 59.33 శాతం, మహిళలు 40.66 శాతంగా ఉన్నారు.

వయస్సు పరంగా పరిశీలిస్తే,


  • 25–35 సంవత్సరాల వయస్సు గలవారు 39.33 శాతం,
  • 35–45 సంవత్సరాల వయస్సు గలవారు 28 శాతం,
  • 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు 12 శాతం,
  • 18–25 సంవత్సరాల వయస్సు గలవారు 20.66 శాతంగా ఉన్నారు.






విద్యా స్థాయి



విద్యా స్థాయి పరంగా చూస్తే,


  • 36.66 శాతం నిరక్షరాస్యులు,
  • 46 శాతం ప్రాథమిక విద్య,
  • 12 శాతం ద్వితీయ విద్య,
  • 5.33 శాతం ఇంటర్మీడియట్ స్థాయి విద్య కలిగి ఉన్నారు.






వైవాహిక స్థితి



వైవాహిక స్థితిని పరిశీలిస్తే,


  • 115 మంది (76.66 శాతం) వివాహితులు,
  • 16 శాతం అవివాహితులుగా ఉన్నారు.






నివాస పరిస్థితులు



నివాస గృహాల వివరాలు ఇలా ఉన్నాయి:


  • 16.66 శాతం మంది కచ్చా ఇళ్లలో,
  • 27.33 శాతం మంది పక్కా ఇళ్లలో,
  • 50.66 శాతం మంది మిశ్రమ (కచ్చా + పక్కా) ఇళ్లలో,
  • 5.33 శాతం మంది గుడిసెల్లో నివసిస్తున్నారు.






పశుసంపద



అధ్యయన ప్రాంతంలో పశుసంపద పంపిణీ ఈ విధంగా ఉంది:


  • ఎద్దులు – 5.33 శాతం,
  • ఆవులు – 8 శాతం,
  • గేదెలు – 17.33 శాతం,
  • గొర్రెలు, మేకలు – 69.33 శాతం.






ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం



షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, ఏ పథకం ఎంతవరకు ప్రజలకు చేరుతుందో (outreach) తెలుసుకోవడం అత్యంత అవసరం.


ఈ అధ్యయన ఫలితాల ప్రకారం:


  • ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ (FFW),
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS),
  • ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం



ఈ మూడు పథకాలు విజయవంతంగా అమలయ్యాయి. మొత్తం నమూనా ప్రతిస్పందకులందరూ ఈ మూడు పథకాల లబ్ధిదారులే.


అయితే, ఇందిరమ్మ పథకం ద్వారా పూర్తిగా లబ్ధి పొందిన వారు కేవలం 60.66 శాతం మాత్రమే, మిగతావారు లబ్ధికి దూరమయ్యారు. అందువల్ల, గిరిజనుల ఆదాయ స్థితి వారికి సరైన సామాజిక భద్రత లేదా జీవన ప్రమాణాన్ని అందించడం లేదు. వారు ఇంకా ప్రభుత్వ గృహ పథకాలపై ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి ఈ పథకాల అమలులో ప్రభుత్వం మరింత వినూత్నంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.





భూమి స్వామ్యత



భూమి కల్పన పరంగా చూస్తే:


  • 12 శాతం భూమిలేని వారు,
  • 55.33 శాతం ఒక ఎకరం కంటే తక్కువ భూమి కలిగిన వారు,
  • 28.66 శాతం 1–2 ఎకరాల భూమి కలిగిన వారు,
  • 4 శాతం రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారుగా ఉన్నారు.






వృత్తులు



వృత్తుల పంపిణీ ఇలా ఉంది:


  • వ్యవసాయదారులు – 12 శాతం,
  • కూలీలు – 15.33 శాతం,
  • గృహ పనులు చేసే వారు – 9.33 శాతం,
  • అటవీ ఉత్పత్తుల సేకరణ – 21.33 శాతం,
  • వ్యవసాయం కాని కూలీలు – 38 శాతం,
  • ఇతర వృత్తులు – 4 శాతం.






ఆదాయం మరియు వ్యయం




ఆదాయ స్థాయిలు:



  • రూ.10,000 వరకు – 5.33 శాతం,
  • రూ.10,000–20,000 – 35.33 శాతం,
  • రూ.20,000–30,000 – 43.33 శాతం,
  • రూ.30,000–40,000 – 8 శాతం,
  • రూ.40,000–50,000 – 6 శాతం,
  • రూ.50,000 పైగా – 2 శాతం.




వ్యయ స్థాయిలు:



  • రూ.10,000 వరకు – 2.66 శాతం,
  • రూ.10,000–20,000 – 5.33 శాతం,
  • రూ.20,000–30,000 – 30 శాతం,
  • రూ.30,000–40,000 – 39.33 శాతం,
  • రూ.40,000–50,000 – 18.66 శాతం,
  • రూ.50,000 పైగా – 4 శాతం.






రుణభారం (Indebtedness)



నమూనా ప్రతిస్పందకుల ఆదాయం తక్కువగా ఉండటం, ఖర్చులకు సరిపోకపోవడం వల్ల వారు తరచుగా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా, ఆర్థిక సంస్థలు సులభంగా అందుబాటులో లేకపోవడం వల్ల వారు వడ్డీ వ్యాపారులను (money lenders) ఆశ్రయిస్తున్నారు.


వడ్డీ వ్యాపారులు మరియు భూస్వాములు 24 నుంచి 60 శాతం వరకు అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నారు.

ఇతరవైపు, సహకార బ్యాంకులు 1–14 శాతం, వాణిజ్య బ్యాంకులు మరియు గ్రామీణ బ్యాంకులు 4–11 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నాయి.





రుణాల మూలాలు



రుణాల మూలాలు ఈ విధంగా ఉన్నాయి:


  • వాణిజ్య బ్యాంకులు – 1.33 శాతం,
  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు – 5.33 శాతం,
  • సహకార బ్యాంకులు – 7.33 శాతం,
  • భూస్వాములు – 19.33 శాతం,
  • వడ్డీ వ్యాపారులు – 16.66 శాతం,
  • పొరుగువారు – 25.33 శాతం,
  • స్నేహితులు, బంధువులు – 14 శాతం,
  • గ్రామ వ్యాపారులు – 10.66 శాతం.



గిరిజనుల రుణ అవసరాల్లో ఎక్కువ భాగం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ద్వారా నెరవేరుతోంది. అధిక వడ్డీ రేట్లు వారి జీవితాలను మరింత అసురక్షితంగా మారుస్తున్నాయి.





సూచనలు మరియు ముగింపు



షెడ్యూల్డ్ తెగల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం మరింత సృజనాత్మకంగా చర్యలు తీసుకోవాలి. తక్కువ వడ్డీ రేట్లతో సరిపడా రుణాలు అందిస్తూ బ్యాంకింగ్ సేవలను విస్తరించాలి. వ్యక్తి స్థాయిలో ఆర్థిక అభివృద్ధి జరిగితే, అది సమాజం మరియు గ్రామీణ సముదాయ అభివృద్ధికి దోహదపడుతుంది.


మనందరికీ తెలిసినట్లుగా, అభివృద్ధి గ్రామాల నుంచే ప్రారంభమవుతుంది. అటవీ ఆధారిత ఉత్పత్తులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ సౌకర్యాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను విస్తృతంగా అందించాలి.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

The unexplored relics of Rayalaseema

కదిరి