తొలి కలెక్టర్ మన్రో
దత్త మండలాల తొలి కలెక్టర్ థామస్ మన్రో. ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు ఆదర్శప్రాయుడు. 1802-07 సంవత్సరాలలో దత్త మండలాల ప్రిన్సిపల్ కలెక్టర్ గా ఉన్న మన్రో కార్యాలయం అనంతపురంలో వుండేది. 1780లో థామస్ మన్రో తూర్పు ఇండియా వర్తక సంఘం సైన్యంలో ఒక కెడేట్ గా ఇండియా వచ్చారు. మంచి సైనికుడిగా ఒక దశాబ్దకాలం పనిచేసిన తర్వాత ఆయనను అలెగ్జాండర్ రీడ్ వద్ద సహాయకునిగా పనిచేయడానికి బరంహార్ (సేలం)కు పంపారు. థామస్ మన్రో ఇక్కడ తన శిక్షణాకాలంలో రెవెన్యూ విధానంలో రూపొందించడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 18వ శతాబ్దపు చివరి భాగంలో ల్యాండ్ సెటిల్ మెంట్ నిర్వహణకు దక్షిణ కెనడాకు పంపారు. 1800-1807 సంవత్సరాల మధ్య ఆయన ప్రజలకు ముఖ్యంగా రైతులకు చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన అమలు పరచిన రెన్యూవిధానం మన్రో విధానంగా చారిత్రక ప్రాముఖ్యతను సంత రించుకుంది. ఆనాటి పాలనాధ్యక్షులైన ఎలిఫెస్టన్, మెటకాఫ్ మెకంజీ తదితరులు ఈ విధానాన్నిభార...