పోస్ట్‌లు

మే, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

రాష్ట్రకూటులు

రాష్ట్రకూటులు         రాష్ట్రకూటులు భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్య వంశాలలో ఒకటి.             “రాష్ట్రకూట” అనే పదంలో “రాష్ట్ర” అంటే ప్రాంతం అని, “కూట” అంటే అధిపతి లేదా సమూహం అనే అర్థాలు సూచిస్తాయని చరిత్రకారులు భావిస్తున్నారు. మొదట వీరు చాళుక్యుల సామంతులుగా ఉన్నారు. తరువాత స్వతంత్రంగా ఎదిగి సామ్రాజ్యాన్ని స్థాపించారు.      క్రీ.శ. 753లో బాదామి చాళుక్యుల్లో చివరివాడైన రెండో కీర్తివర్మ. వీరికి సామంతుడుగా ఉన్న రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు అతన్ని పారద్రోలి స్వతంత్ర రాష్ట్రకూటరాజ్యం స్థాపించినాడు.  వీరి సామ్రాజ్యం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ భాగాలు, తమిళనాడు భాగాలు,మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది.వీరి ప్రభావం రేనాడు,పాకనాడు వరకు ఉండేది. దంతిదుర్గుడు శ్రీశైలప్రాంతాలనుగూడ జయించి ఆక్రమించినట్లు చెప్పుకున్నాడు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో చాలభాగం రాష్ట్రకూట సామ్రాజ్యంలో చేరింది.వీరు క్రీ.శ. 8వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు దక్షిణ, మధ్య భారతదేశంలో విస్తారమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ...