నాలుగు భారీ ప్రాజెక్టులు(ఈనాడు,27.8.2020)
గండికోటకు మరో 10వేల క్యూసెక్కులకు టన్నెల్
గాలేరు-నగరి, హంద్రీనీవా అనుసంధానానికి రూ.5,036 కోట్లు
Galeru Nagari Canal near Gandikota Reservoir
గాలేరు నగరి సుజల స్రవంతి పథకు నుంచి
హంద్రీనీవా సుజల స్రవంతిని అనుసంధానించేలా ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు రూ. 5,098 కోట్లతో పాలనామోదం ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన పరిశోధన, నిర్మాణ పనులు కలిపి చేసేందుకు వీలుగా వీటికి అనుమతులు మంజూరు చేశారు. అంచనాలు, పని పరిమాణం తదితరాలకు సంబంధించి కొన్ని షరతులతో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఉన్న ఏ ఇతర ప్యాకేజీ పనులు, ప్రాజెక్టు పనులను అధిగమించేలా
ఉండకూదదని అందులో పేర్కొన్నారు. ఆయన బుధవారం మరికొన్ని ప్రాజెక్టులకు పాలనామోద ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
గండికోటకు నీటిని తీసుకువెళ్లేలా అదనపు టన్నెల్
గండికోట జలాశయానికి నీటిని తీసుకువెళ్లేందుకు వీలుగా అదనపు టన్నెల్ నిర్మించనున్నారు. అదనంగా 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకు
వెళ్లేందుకు వీలుగా ఈ నిర్మాణు చేపట్టబోతున్నారు. మొత్తం రూ. 604 80 కోట్ల అంచనా విలువతో జలవనరులశాఖ పాలానామోదం ఇచ్చింది.
రూ.1,113 కోట్లతో ఎత్తిపోతల, కొత్త జలాశయం
చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం నుంచి రెండు దశల్లో 70 రోజుల పాటు నీటిని ఎత్తిపోసేలా ఒక పథకం నిర్మించబోతున్నారు. సీబీఆర్ నుంచి ఎర్రబల్లి చెరువుకు అక్కడి నుంచి గిడ్డంగివారి పల్లె జలాశయానికి ఈ నీరు తీసుకువెళ్తారు. అక్కడ మరో కొత్త జలాశయం నిర్మించబోతున్నారు. 1.20 టీఎంసీల నీటిని ఇక్కడ నిల్వ చేస్తారు. ఈ పనులు అన్నింటికీ కలిపి రూ.1,113 కోట్ల అంచనా వ్యయంతో పాలనామోదం ఇచ్చారు.
ఎత్తిపోతల పథకాల ఉన్న తీకరణకు రూ.3,556.76 కోట్లు
గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయానికి నీటిని తీసుకువెళ్లేందుకు సామర్థ్యం పెంచేందుకు.. మరోవైపు గండికోట నుంచి పైడిపాలెం జలాశయానికి నీటిని తీసుకువెళ్లేలా ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంచేందుకు వీలుగా ప్రభుత్వం పథకాలు చేపట్టబోతోంది. ఇందుకు రూ. 8,556. 76 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ పాలానామోదం ఇచ్చింది.
పుష్పగిరి ఆలయం వద్ద మరో బ్యారేజి
కర్నూలు జిల్లా, పుష్పగిరి ఆలయం సమీపంలో ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ తయారు చేయడానికి రూ. 85. 50 లక్షలతో తొలి దశ పాలనామోదం ఇచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి