ఆ పేరెలా వచ్చింది?
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రాయలసీమలో ప్రతి పల్లెకు, చెరువుకు, నదికి, కొండకు, కోనకు, గుహకు, బండకు, కోటకు, గ్రామ దేవతకు,శిష్టదేవతకు, ఒక్కొక్క పేరు వుంటుంది. ఆ పేరెలా వచ్చిందని ఆ ప్రాంత వాసుల్ని కదిపితే ఆసక్తి కరమైన ఒక కథ చెబుతారు.సాధారణంగా వ్యక్తుల పేర్లను బట్టి, ఇంటి పేర్లను బట్టి, కులం పేర్లను బట్టి, మిట్ట పల్లాలను బట్టి, పరిమాణాన్నిబట్టి ఊర్ల పేర్లు ఏర్పడ్డాయి.
అనంతపురం
ఈ నగరాన్ని కర్ణాటకకు చెందిన నడియార్ వంశానికి చెందిన అనంతరసు అనే రాజు పాలించాడు.ఆయన పేరు మీద అనంతపురం అనే పేరు వచ్చింది.
బుక్కరాయసముద్రం
విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహర రాయలు,బుక్కరాయలలో బుక్కరాయలు అనంత పురానికి దగ్గరలో ఒక చెరువు త్రవ్వించినారు.ఆయన పేరు మీద బుక్కరాయ సముద్రం అనే వూరు ఏర్పడింది.ఇప్పుడది అనంతపురం జిల్లాలో ఒక మండలం.
పుంగనూరు
రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో లో పుంగనూరు అనే ఊరు ఉంది. పుంగనూరు అసలు పేరు పుంగ పురి. ఈ ఊరు పూర్వం పరుశురామ క్షేత్రం గా పేరుగాంచింది. చోళుల కాలంలో దీనిని పులనాడు అనేవారు.
పుంగన్ లేదా పుంగవన్ అంటే తమిళంలో
మునిశ్రేష్టుడని అర్థం. ముని పుంగవుడైన వాల్మీకి ఈ
ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. అందుకే ఆయన పేరుతో పుంగన్ +ఊరు = పుంగనూరు అయిందని చెపుతారు. పుంగనూరు ప్రాంతంలో పుంగ(కానుగ) వృక్షాలు ఎక్కువగా వుండడం వల్ల 'పుంగనూరు' అనే పేరు వచ్చివుండవచ్చని మరి కొందరి వాదం. పుంగం అంటే ఎద్దు. ముందునుంచి పుంగనూరు ఒక ప్రత్యేకమైన జాతి ఆవులకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఊరికి పుంగనూరు అనే పేరు వచ్చిందంటారు.
ఇంకా కొంతమంది. 'వలవనారాయణ చతుర్వేది
మంగళం' అనే పేరుగల ఊరిని పుంగమ్మ అనే రాణి ఏలినందు వల్ల ఆమె పేరుతో పుంగమ్మ ఊరు పుంగనూరుగా మారిందని చెపుతారు. పుంగమ్మ పేరు మీద ఈ ప్రాంతంలో అత్యంత
ప్రచారంలో వున్న కోలాట పదం చూడవచ్చు.
ఏమే భామా! భామా నీ పేరేమి?
నీ ఊరు పేరేమి? నిలిచి మాట్లాడు! అని అడిగితే
ఊరు గొప్పదిరా! ఉగ్రచందికరా
పుంగమ్మ ఏలేటి పుంగనూరు మాదిరా! అని
సమాధానం చెప్పింది. దీన్ని బట్టి చూస్తే వలవనారాయణ
చతుర్వేది మంగళాన్ని ధైర్య సాహసాలకు మారుపేరైన
పుంగమ్మ అనే రాణి ఏలిందని, ఆమె పేరుతోనే 'పుంగనూరు' ఏర్పడిందని తెలుస్తోంది.
పుంగనూరులో చారిత్రాత్మకమైన ఒక చెరువు వుంది. ఈ చెరువు పేరు పూర్వం 'రాజేంద్ర సోళపేరేరి' వర్షాలు ఎక్కువై చెరువుకు గండి పడింది. చెరువు తెగితే ఊరు ఊరే కొట్టుకుపోతుంది. ప్రజలు ఎంత కష్టం పడ్డా గండిని పూడ్చ లేకపోయారు. చివరకు పుంగమ్మ తను పరిపాలిస్తున్న ప్రజల కోసం గండికి అడ్డుపడి, తనపై కట్ట కట్టమంది. ప్రజలు విధిలేక ఆమెపై మట్టితో గండిని పూడ్చారు. తమకోసం పుంగమ్మ తన ప్రాణాలను త్యాగం చేసినందువల్ల అక్కడే నది కట్టమీద ఆమె శిలా విగ్రహాన్ని పెట్టి, చిన్న గుడిని కట్టించి పూజిస్తున్నారు. పుంగమ్మ సత్యంవున్నంతకాలం
ఈ కట్ట తెగదని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఆనాటి నుంచి
రాజేంద్ర సోళ పేరేరి పుంగమ్మ చెరువు గా పేరు మారింది.
vijay pilla
9490122229
9490122229
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి