వేమన గొప్ప హేతువాదం, హేతుబద్ధత.
————————————————————————————— వేమనను కేవలం శతక కర్తగానే చూపించి ఆయన స్థాయిని తగ్గించారు. ఇదే వేమన వేరే దేశంలో ఉండిఉంటే గొప్ప తత్వవేత్తగా గుర్తింపు పొందేవాడు. లేదా బ్రాహ్మణ కులంలో జన్మించి ఉంటే గొప్ప సంస్కర్తగా కొనియాడబడేవాడు.. 1. మతాలు మంచే చెబుతుండవచ్చు కానీ మతబోధకులు దొంగలంటాడు వేమన. ఆరు మతములందు నధికమైన మతంబు లింగమతము కన్న లేదు భువిని లింగదార్ల కన్నా దొంగలు లేరయా విశ్వదాభిరామ వినుర వేమ. మతము వేషధార్లు మహిమీద పదివేలు. మూఢజనుల గలప మూగుచుండ్రు కొంగలు గుమికూడి కొరకవా బోదెలు విశ్వదాభిరామ వినుర వేమ. 2. ఆత్మశుద్ది ముఖ్యం కానీ పూజలు ముఖ్యం కాదంటాడు... ఆత్మశుద్ది లేని ఆచార మదియేల భాండ శుద్దిలేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలేరా విశ్వదాభిరామ వినుర వేమ 3. పిండములను పెట్టడం గురించి.... పిండములను జేసి పితరుల తలబోసి కాకులకు పెట్టు గాడ్దెలారా పియ్యి తినెడు కాకి పితరుడెట్లాయెరా విశ్వదాభిరామ వినుర వేమ. 4. జీవులను చంపి మనిషి అనే జీవి తింటే ఒళ్ళు వస్తుంది కానీ మోక్షం ఎలా వస్తుంది అంటాడు మరో పద్యంలో.. జీవి జీవి చ...