రాయలసీమ సామెతలు


సామెతలు లేదా  లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట
చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి
మనసుంటే మార్గముంటుంది
అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది
కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే
ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి
క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి
ఊరక రారు మహానుభావులు
అంతా మావాళ్లేగాని అన్నానికి రమ్మనేవాళ్లు లేరు !
ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుణ్ణి మొక్కినట్లు
ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది
కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు
సిగ్గులేని వాడికి నవ్వే సింగారం !
మన దీపమని ముద్దాడితే మూతి కాలకుండా
వుంటుందా !
అన్నానికి ముందు వ్యవహారానికి వెనుక
నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు
పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు 
నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్య కు యెండు
పూరి
కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది
చింతకాయలమ్మే దానికి సిరిమానం వస్తే.. ఆ వంకరటింకర కాయలేమని అడిగిందంట!
గ‌డార్లు గాలికి పోతుంటే ఏకులు నాగ‌తేమ‌న్న‌ట్టు’ 
ప‌చ్చ‌ర బాము ప‌సిబిడ్డా ఒక‌టే’
పోతే నీ ఆవులు ఎవురు మేపుతారంటే, నా తిత్తిలో దుడ్డు మేపుతుంది అనిందిట‌
తిరు‌ప‌తిలో మా గుండోణ్ణి చూశావా అన్న‌ట్టు 
సుఖం మ‌రిగిన గోవింద‌మ్మ మొగుణ్ణి అమ్ముకుని తినిందంట.
నాకే లేదు నాకుడు బెల్లం, నీ క్యాడ తెచ్చేది 
గోకుడు బెల్లం
బ‌డే సాబ్ బండీ, అల్లీ సాబ్ ఎద్దులు ఎట్ల‌పోతేనేమీ
అత్త అటక నాకుతుంటే అల్లుడు దీపాలపండగ అన్నాడట.
(అటక అనగా అనంతపురం జిల్లా పల్లెల్లో అన్నం) చారు వండే మట్టి పాత్రలు.
రైతు సామెత... ఉలవలు ఇత్తి(విత్తి) ఊరకేవుండరా అంటే..పత్తి ఇత్తి పని గావిచ్చుకొన్నెంట.
ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతా అన్నెంట
శెట్టి సింగారమయ్యే టప్పటికి పట్నం పాడాయనంట.
ఎంటికలుణ్ణాయమ్మ యాకొప్పు కడితే వద్దంటారు
పగవాణ్ణి పంచాగమడిగితే మద్యాన్నానికి మరణ మన్నట్టు.
చింత లేనమ్మకి సంతలో నిద్ర వచ్చెనంట.
సంతకి దొంగయితే చీర్లమ్మేది యాడ.
మొగుడు చచ్చి ముండేడుస్తుంటే మిండగాడు రాళ్లేసెనంట.

అభ్యాసం కూసువిద్య

అత్తా ఒకింటి కోడలే

అడవికాచిన వెన్నెల

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

అచ్చి పెళ్ళి బుచ్చి చావుకు వచ్చిందట 
అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

అంగట్లో అన్నీ ఉన్నాయి,అల్లుడి నోట్లో శని ఉంది
 
అత్తలేని కోడలుత్తమురాలు, 
కోడలులేని అత్త గుణవంతురాలు

అంతా శ్రీవైష్ణవులే కాని బుట్టెడు రొయ్యలూ ఏమైనాయో 
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు

అగ్నికి వాయువు తోడైనట్లు 

అనువుగాని చోట అధికులమనరాదు

అప్పిచ్చివాడు బాగు కోరతాడు తీసుకున్నవాడు చేడు కోరతాడు 
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు 
ఆకాశానికి నిచ్చెన వేసినట్లు 
ఆడదాని మాట నీటిలో మూట ఒకటేనట
ఆడ పిల్ల, సిగ్గు బిల్ల పలువురి లో కనిపించ రాదు.
ఆడదాని వయస్సు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు.
ఆకలి రుచి యెరుగదు, నిద్దుర సుఖము యెరుగదు, వలపు సిగ్గు యెరుగదు.
ఆకలి వేస్తే రోకలి మింగమన్నాడట.ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సొమలింగం.
ఆరిపొయే దీపానికి వెలుగు యెక్కువ.
ఆలస్యం అమృతం విషం.ఆరోగ్యమే మహాభాగ్యము.
ఆస్థి మూరెడు ఆశ బారెడు.
ఆవలింతకు అన్న ఉన్నాడు కాని,తుమ్ముకు తమ్ముడు లేడంట.
ఆవు చేను మేస్తే,దూడ గట్టు మేస్తుందా?
ఆయనే వుంటే మంగలి ఎందుకు?
అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికి ఒక జంజపు పోగు.
ఆడువారి మాటలకు అర్ఠాలే వేరులే.
అడగనిదే అమ్మైనా అన్నము పెట్టదు.
అడ్డాలు నాదు బిడ్డలు కాని,గడ్డాలు నాడు కాదు.
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.
అడుక్కున్నమ్మకు అరవయ్యి కూరలంట,వందుకున్న అమ్మకు ఒకటే కూరట.
అడుక్కునే వాడికి చెప్పులు కుట్టుకునే వాడు.
అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల?
ఏ ఎండకు ఆ గొడుగు.
అగడ్తలో పడ్డ పిల్లికి అడ్డే వైకుంటము.
ఏమి లేని యెడారిలో ఆముధము చెట్టే మహా వృక్షము.
అగ్నికి ఆజ్యం పోసినట్లు.
ఐశ్వర్యము వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమనేవాడు.
ఆకులు నాక్కునే వాడి దగ్గర మూతులు నాక్కునే వాడట.
అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవలకి వెళ్ళి నోట్లో వెసుకున్నాడట.
అంబలి నాకెటోడికి మీసాలెట్టెటొడు ఒకడు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి.
అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు.
అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు.
అర్దరాత్రి మద్డ్డెలదరువు.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.
అయ్య వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా?
వాపును చూసి బలము అనుకున్నదట.
వడ్డించే వాడు మనవాడైతే, యే పంక్తిలో ఉంటె ఏమి.
వెన్నతో పెట్టిన విద్య.
వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నట్లు.
వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పె వాడు వెదాంతిట.
విశ్వేశ్వరుడికి లేక విభూది నాకుతూ ఉంటే, నందీశ్వరుడు వచ్చి నాకేది అని అడిగాడట.
తా చెడ్డ కోతి వనమేల్ల జెరచిందట.
తాలిబొట్టు బలమువల్ల తలంబ్రాల వరకు బతికాడు.
తాడి తన్నువాని తల తన్ను వారు ఉండును.
తాటాకు చప్పుల్లకు కుందేలు బెదురుతుందా?
తాతకు దగ్గులు నేర్పించుట.
తేలుకు పెతనమిస్తే తెల్లవార్లు కుట్టిందట.
తన కొపమే తన శత్రువు.
తంతే గారెల బుట్టలొ పడ్డట్లు.
తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు ఓర్వలేనివాడు.
తెగేదాక లాగవద్దు.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.
తిక్క మొగుడితో తీర్తానికి వెలితే తీర్తం అన్త తిప్పి తిప్పి కొట్టాడట.
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు.
తుమ్మితే ఊడిపొయే ముక్కులా.
నారు పొసిన వాడు నీరు పొయ్యడా?
నడుమంత్రపు సిరి, నరాల మీదనుండు.
నేతి బీరకాయలో నెయ్యి ఎన్త ఉందొ, నీ మాటలో అంతే నిజం ఉంది.
నాట్యం చెయ్యవే రంగసాని అంటే నేల వంకర అందట.
నీ ఎడమ చెయ్యి తియ్యి నా పుర్ర చెయ్యి పెడతానన్నాడట ఒకడు.
నీరు పల్లమెరుగు, నిజము దేముడెరుగు.ని
జం నిలకడ మీద తెలుస్తుంది.
నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు.
నువ్వు మేకని కొంటే, నేను పులిని కొని నీ మెకని చంపిస్తా అన్నాడట.
డబ్బు పొయే శని పట్టె.
డబ్బుకు లోకం దాసొహం.
దరిద్రుడి పెల్లికి వడగల్ల వాన.
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.
దొంగకు దొంగ బుద్ది, దొరకు దొర బుద్ది.
దూరపు కొండలు నునుపు.
ఈతకు మించిన లోతు లేదు.
ఎలుగు బంటి తొలు ఎన్నాళ్ళు ఉతికినా ,నలుపు నలుపేకాని తెలుపు రాదు.
ఎర్ర చీర కట్టున్నదల్లా నీ పెళ్ళామే?
ఎవరు తీసుకున్న గొతిలో వారే పడతారు.
ఎదురుగా ఉన్నవాడె పెళ్ళికొడుకు అందిట.
రాజుగారి దివానములో చాకలొడి పెత్తనము.
రాజు గారి రెండవ భార్య మంచిది అన్నట్టు.
రాజు గారు తలచు కొంటె దెబ్బలకు కొదువా.
రాజును చూసిన కన్నులతొ, మొగుడ్ని చూస్తే చులకనలే.
రామేశ్వరం వెల్లినా శనీశ్వరం వదలనట్లు.
రంకు నెర్చినమ్మ బొంకు నెర్వదా అన్నట్లురోలు వచ్చి మద్దెలతొ మొర పెట్టుకుందిట.
రౌతు కొద్దీ గుర్రము.
గాజుల బేరము భోజనానికి సరి.
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్చ పొయిందట.
గంతకు తగ్గ బొంత.
గాలికి పొయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు.
గతి లేనమ్మకు గంజే పానకము.
గోరుచుట్టు మీద రోకలి పోటు.
గ్రుడ్డి కన్న మెల్ల మేలు.
గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి