నాలుగు కడపలు (దేవుని కడప (దేవర కడప), పాత కడప / కాపు కడప, శహర్ కడప (నేకనామ్ ఖాన్ పేట / నేకనాంబాద్), కడప సుబా ప్రస్తుత రాయలసీమలో కడప అన్నికంటే ముందుఏర్పడిన జిల్లా. అదేవిధంగా కడప పట్టణం కూడా మిగతా అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల కంటే ముందు నుండే ఉనికిలో ఉంది. గ్రీకు గణితవేత్త మరియు ఖగోళ, భౌగోళిక శాస్త్రజ్ఞుడు టాలెమీ క్రీశ 2వ శతాబ్దంలో (దాదాపు1900 సంవత్సరాల క్రితం) ప్రపంచ భౌగోళిక స్వరూపంపై రాసిన పుస్తకంలో ఆనాటి భారతదేశ పట్టణాల పేర్లు, ఇతర భౌగోళిక వివరాలు పొందుపరిచారు. అందులో నేటి కడప పట్టణాన్ని ‘కరిగె’ అని పేర్కొన్నాడు. అయితే కడప ముందు ఒక చిన్న గ్రామం. చెన్నూరు సీమ / ములికినాటి సీమ /గండికోట సీమలలో ఉన్న గ్రామం క్రమేపీ పట్టణంగా, జిల్లా ప్రధాన కేంద్రంగా ఎదిగింది. వాడుకలో కడప పట్టణాన్ని మొత్తాన్ని కడప అని సంబోధించినా వివిధ కాలాల్లో ఏర్పడిన / వృద్ధి చెందిన వివిధ కడపల సమాహారమే నేటి కడప. విజయనగర రాజులు, కడప నవాబులు, బ్రిటీషు వారి ఏలుబడిలో ఉండిన కడప; దేవుని కడప, పాలకొండ్రాయుడు స్వామి ఆలయాలు, అమిన్ పీర్ దర్గా(పెద్ద దర్గా), చాంద్ ఫిరా గుంబద్, మరియాపురం, CSI సెంట్రల్ చర్చ్ లతో భిన్న సంస్కృతుల ...
పోస్ట్‌లు
జూన్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
సీ.పీ. బ్రౌన్ గ్రంథాలయం పరిశోధకులకు అనుకూలంగా, పాఠకులకు విజ్ఞానాన్ని పంచుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 2006 నవంబరు 1వ తేదీన 20 వేల పుస్తకాలు, 20 లక్షల రూపాయల నిధి, 3 అంతస్తుల భవనంలో ఉన్న గ్రంథాలయం యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దీని అభివృద్ధిలో వేగం పెరిగింది. సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంగా రూపాంతరం చెంది వివిధ వర్గాల నుంచి, విద్యాంసుల నుంచి ఆరు సంవత్సరాల్లో పుస్తకాల సంఖ్య 50 వేలకు పైగా పెరిగింది. దీంతో పాటు 200 తాళపత్ర గ్రంథాలను సేకరించి, శుద్ధిచేసి, స్కాన్ చేసి భద్రపరిచారు. వివిధ విశ్వవిద్యాలయాలకు పరిశోధకులు సమర్పించే సిద్ధాంత గ్రంథాల రాతప్రతులను దాదాపు 200 ప్రతులను సేకరించి పరిశోధకుల కోసం భద్రపరిచారు. ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో సర్వేయర్ జనరల్‌గా పనిచేసిన కల్నల్ మెకంజీ సేకరించిన కైఫీయత్తులు అనబడే స్థానిక చరిత్రలను, కడప జిల్లాకు సంబంధించిన వాటిని ఇప్పటి వరకు 6 సంపుటాలను ప్రచురించారు. దీంతో పాటు గ్రంథాలయ వికాస చరిత్రను తెలిపే ‘మొండిగోడల నుంచి మహాసౌధం దాక’ అన్న గ్రంథాన్ని ప్రచురించారు.
ఉమ్మడి కడప జిల్లాలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఉమ్మడి కడప జిల్లాలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు “కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్ పాపాఘ్ని - పాపాలను దహించునది - పెన్నా నదికి ఉపనది - వేంపల్లి వద్ద పాపాఘ్ని తీరంలోనే గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ప్రసిద్ద శైవ క్షేత్రం వీరపునాయుని పల్లె వద్ద కల సంగమేశ్వర ఆలయం కూడా పాపాఘ్ని తీరాన ఉన్నది. పెన్నా -ఉత్తర పినాకిని - పినాకిని అంటే పినాక నుండి ఉద్భవించింది అని అర్థం. శివుని ధనస్సు పినాక రెండు నంది కొండల వద్ద రెండు పాయలుగా ఉత్తర పినకిని (పెన్నా) దక్షిణ పినాకిని(పాలారు) నది అయ్యాయి. ప్రసిద్ద క్షేత్రాలు తాడిపత్రి ఆలయాలు, పుష్పగిరి, గండికోట ఈ నదీ తీరంలోనే ఉన్నాయి చెయ్యేరు - సంస్కృతంలో బాహుద అని కూడా పేరు - అంటే చెయ్యి ఇచ్చునది అని అర్థం - పెన్నానదికి ఉపనది- ఈ నది తీరంలోనే అత్తిరాల ఆలయ క్షేత్రాలు, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు , బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. చెయ్యేరు నది మీద ఆకేపాడు వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు ఉంది. ఈ నది పేరు వెనక ఒక కథ ఉంది. లిఖితుడు అనే వ్యక్తి ...