ఉమ్మడి కడప జిల్లాలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు

ఉమ్మడి కడప జిల్లాలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు 

“కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్


పాపాఘ్ని - పాపాలను దహించునది - పెన్నా నదికి ఉపనది - వేంపల్లి వద్ద పాపాఘ్ని తీరంలోనే గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ప్రసిద్ద శైవ క్షేత్రం వీరపునాయుని పల్లె వద్ద కల సంగమేశ్వర ఆలయం కూడా పాపాఘ్ని తీరాన ఉన్నది.

పెన్నా -ఉత్తర పినాకిని - పినాకిని అంటే పినాక నుండి ఉద్భవించింది అని అర్థం. శివుని ధనస్సు పినాక రెండు నంది కొండల వద్ద రెండు పాయలుగా ఉత్తర పినకిని (పెన్నా) దక్షిణ పినాకిని(పాలారు) నది అయ్యాయి. ప్రసిద్ద క్షేత్రాలు తాడిపత్రి ఆలయాలు, పుష్పగిరి, గండికోట ఈ నదీ తీరంలోనే ఉన్నాయి 

చెయ్యేరు - సంస్కృతంలో బాహుద అని కూడా పేరు - అంటే చెయ్యి ఇచ్చునది అని అర్థం - పెన్నానదికి ఉపనది- ఈ నది తీరంలోనే అత్తిరాల ఆలయ క్షేత్రాలు, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు , బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. చెయ్యేరు నది మీద ఆకేపాడు వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు ఉంది. 
        ఈ నది పేరు వెనక ఒక కథ ఉంది.    
    లిఖితుడు అనే వ్యక్తి ఒకరోజు ఆకలితో యజమాని అనుమతి లేకుండాఒక తోటలోని చెట్టు పండ్లు తిన్నాడు. తన తప్పును పొత్తపి రాజు దగ్గర అంగీకరిస్తాడు. రాజు ఆ బ్రహ్మణునికి దండనగా చేతులు ఖండిస్తాడు. లిఖితుడు తరువాత ఈ నదిలో మునిగి లేయగా అతని చేతులు తిరిగి వచ్చాయట. చెయ్యి ఇచ్చిన నది కాబట్టి చెయ్యేరు గా
పేరొందిందని పలువురు చెబుతారు.

మాండవ్య నది - బాహుదా నదికి ఉపనది. మాండవ్య మహర్షి పేరు మీద ఈ పేరు వచ్చి ఉండవచ్చు. రాయచోటి వీరభద్రాలయం ఈ నది ఒడ్డున ఉంది

 చిత్రావతి నది- దేవ కన్యా అని కూడా అంటారు . పుట్టపర్తి ఈ నదీ తీరంలోనే ఉంది. చిత్రావతి నది పెన్నా నదికి ఉపనది. గండికోట వద్ద చిత్రావతి నది పెన్నా నదిలో కలుస్తుంది. ఈ నది మీదే పార్నపల్లి వద్ద చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్ ఉన్నది. 

      పింఛా నది.బాహుదా నది దీనికి ఉపనది. ఈ నదినే పిల్లేరు / పిల్లయేరు అని గార్గేయ నది అని కూడా అంటారు.ఈ నది పేరు మీదే చిత్తూరు జిల్లా పీలేరు పట్టణానికి ఆ పేరు వచ్చింది - ఈ నది చెయ్యేరు నదికి ఉపనది. ఈ నది మీదే కడప జిల్లా టి. సుండుపల్లె మండలంలో ఆదినారాయణ రెడ్డి పింఛా ప్రాజెక్టు ఉంది.
    సగిలేరు(స్వర్ణబాహు) బద్వేల్ మీదుగా వెళుతుంది. బుగ్గవంక (కడప పట్టణం మీదుగా ప్రవహిస్తుంది.

      వీటిలో జీవనదులు ఏమాత్రం లేవు. దీనికి తోడూ పాలకుల నిర్లక్ష్యం తోడయ్యింది. అందువల్లన ఇన్ని నదులున్నా కడప కరువు కోరల్లో విలవిలలాడుతోంది.
___ పిళ్లా కుమారస్వామి,9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి