రాష్ట్రకూటులు
రాష్ట్రకూటులు
రాష్ట్రకూటులు భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్య వంశాలలో ఒకటి.
“రాష్ట్రకూట” అనే పదంలో “రాష్ట్ర” అంటే ప్రాంతం అని, “కూట” అంటే అధిపతి లేదా సమూహం అనే అర్థాలు సూచిస్తాయని చరిత్రకారులు భావిస్తున్నారు. మొదట వీరు చాళుక్యుల సామంతులుగా ఉన్నారు. తరువాత స్వతంత్రంగా ఎదిగి సామ్రాజ్యాన్ని స్థాపించారు.
క్రీ.శ. 753లో బాదామి చాళుక్యుల్లో చివరివాడైన రెండో కీర్తివర్మ. వీరికి సామంతుడుగా ఉన్న రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు అతన్ని పారద్రోలి స్వతంత్ర రాష్ట్రకూటరాజ్యం స్థాపించినాడు.
వీరి సామ్రాజ్యం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ భాగాలు, తమిళనాడు భాగాలు,మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది.వీరి ప్రభావం రేనాడు,పాకనాడు వరకు ఉండేది.
దంతిదుర్గుడు శ్రీశైలప్రాంతాలనుగూడ జయించి ఆక్రమించినట్లు చెప్పుకున్నాడు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో చాలభాగం రాష్ట్రకూట సామ్రాజ్యంలో చేరింది.వీరు క్రీ.శ. 8వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు దక్షిణ, మధ్య భారతదేశంలో విస్తారమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు.
రాష్ట్రకూట చక్రవర్తులైన ధ్రువుడు, మొదటి అమోఘవర్షుడు, ముక్కంటి వంటి రాజుల కాలంలో రేనాటి చోళులు వారికి అత్యంత నమ్మకమైన సామంతులుగా వ్యవహరించారు.తూర్పు చాళుక్యులను దక్షిణ వైపు నుండి అడ్డుకోవడానికి రాష్ట్రకూటులు రేనాడు ప్రాంతాన్ని ఒక వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగించు కున్నారు. రేనాడు పరిధిలోని కడప, కర్నూలు జిల్లాల్లో లభించిన పలు శిలాశాసనాలలో రాష్ట్రకూట రాజుల పేర్లు, వారి విజయాల ప్రస్తావనలు ఉన్నాయి.
అమోఘవర్షుని కాలానికి చెందిన కొన్ని శాసనాలు ఈ ప్రాంతంలో లభించాయి, ఇవి రాచరికపు పన్నులు, భూదానాల గురించి వివరిస్తాయి.
రేనాడు ప్రాంతం గుండానే రాష్ట్రకూటుల సైన్యాలు, వ్యాపారులు దక్షిణ భారత దేశానికి ప్రయాణించేవారు. దీనివల్ల కర్ణాటకకు చెందిన కన్నడ సంస్కృతి, జైనమతం మరియు శిల్పకళా ప్రభావం రేనాడు (రాయలసీమ) ప్రాంతంపై పడింది.
రాష్ట్రకుటాధిపుడైన ముమ్మడి గోవిందుడు తుంగభద్రాతీరం వరకు ఆక్రమించినాడు.
చాళుక్యులకు సామంతులుగా మారడంతౌ రేనాటిచోడులను నిర్మూలించడం కోసం రాష్ట్రకూటులు వైదుంబులను వారిపై పురికొల్పినారు. దాంతో రేనాటి చోళులు పతనమైనారు.
రాష్ట్రకూటులు హిందూమతం,జైనం,
బౌద్ధం పట్ల సహన విధానం పాటించారు.
జైనమతానికి వీరి కాలంలో పెద్ద ప్రోత్సాహం లభించింది.
పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన
రెండవ తైపుడు (Tailapa II) క్రీ.శ. 10వ శతాబ్దం చివరలో (క్రీ.శ. 973 లో) రాష్ట్రకూటులను ఓడించి వారి సామ్రాజ్యాన్ని
కూలదోశాడు.
___ పిళ్లా కుమారస్వామి,9490122229,
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి