అనంతకన్నీటిగాథ
రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో భారతదేశంలో ధార్ ఎడారి తరువాత అతితక్కువ వర్షపాతంగల జిల్లా అనంతపురం . పరిస్థితి ఇట్లాగే కొనసాగితే వందేళ్ళలో అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోవడం ఖాయమని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు .
రాయలసీమలో అనంతపురం జిల్లాకు విశిష్టమైన చరిత్ర వుంది . అనంతపురం పేరు వినగానే వజ్రకరూరు వజ్రాలు రామగిరి , బంగారు నగలు , లేపాక్షి , పెనుగొండ , తాడిపత్రి కళా పెన్నిధులు గురొస్తాయి . “ విజయనగరపు చక్రవర్తులకు వేసవి కాలమందలి చలువరాజధానిగా ఎంతోకాలమాశ్రయ మిచ్చిన పెనుగొండ ఘనగిరి ఇందలిది , " ( రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ )
విజయనగర సామ్రాజ్యములో రెండు శతాబ్దాల పాటు ఈ జిల్లా పరిపాలింపబడింది . వీరు గుత్తి , పెనుగండలో కోటలు కట్టించారు . బుక్కరాయల సూచన పైనే సింగయ్యభట్ అనే నిపుణుడు బుక్కరాయసముద్రము చెరువును నిర్మించినాడు . నీటిపారుదల సౌకర్యాలపట్ల అనాటి రాజులు
ఎంతో శ్రద్ధ వహించారనటానికి కావల్సిన ఆధారాలు భౌతికంగా కనిపిస్తున్నాయి . ఈ ప్రాంతాలలో కొండలు , వాగులు , చిన్నచిన్న నదులు ప్రవహించే ప్రదేశాలలో అనుకూలతనుబట్టి నీటిని నిల్వ చేసుకోటానికి ఎన్నో జలాశయాలను నిర్మించారు . మంచినీటికోసం ఎంతో కాలం నీరు నిల్వవుండేలా
బావులు తవ్వించినారు . ఇప్పటికీ వారి పరిపాలనా వైదుశ్యానికి నిదర్శనాలుగా పెనుగొండలోని పసరిక బావి , పెద్దబావి , కోటనానుకొని వున్న జలాశయం గుర్తులుగా నిలిచి వున్నాయి .
విజయనగర సామ్రాజ్య పతనానంతరం జిల్లా గోల్కొండ నవాబు వశమైంది . తరువాత మహారాష్ట్రులు , మొగలులు కర్నాటక నవాబులు పాలించారు . 1800లలో తూర్పు ఇండియా ఏలుబడికిందకు వచ్చింది . 1882లో బళ్ళారినుండి చీల్చి అనంతపురం జిల్లాను ఏర్పరచినారు .
అనంతపురం జిల్లాలో ప్రవహించే నదులలో ముఖ్యమైంది పెన్నానది. ఇది కర్నాటక రాష్ట్రంలో నంది దుర్గం దగ్గర చెన్న కేశవకొండల్లో పుట్టి కర్నాటకలో 43 కి . మీ . ప్రవహించి అనంతపురం జిల్లా హిందూపురం , తాలూకాలో ప్రవేశించి హిందూపురం పెనుగొండ , ధర్మవరం , కల్యాణదుర్గం తాలూకాల గుండా గుత్తి అనంతపురం తాలూకాల సరిహద్దుగా ప్రవహించి తాడిపత్రి తాలూకా గుండా కడప జిల్లాలోనికి ప్రవహిస్తున్నది . కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో ప్రవేశించి జమ్మలమడుగు పట్టణం వరకు పశ్చిమ దిశనుండి తూర్పుదిశగాను , తరువాత ఆగ్నేయదిశగానూ
తిరిగి ప్రొద్దుటూరు కమలాపురం తాలూకాల సరిహద్దు గా ప్రవహించి అటుపిమ్మట కడప , సిద్ధవటం తాలూకాల గుండా ప్రవహించి నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తున్నది . నెల్లూరు జిల్లాలో 23 కిమీ . ప్రవహించి ఊటుకూరు సమీపాన బంగాళాఖాతంలో కలుస్తున్నది .
చిత్రావతి జయమంగళం , , కుందేరు , సగిలేరు , పాపాగ్ని , బొగ్గేరు ఈ నదికి ముఖ్యమైన ఉపనదులు .
పెన్నానది నీటిపరీవాహ ప్రాంతం 21 , 317 చ . మైళ్ళు ఇందులో 2678 చ . మైళ్ళు కర్నాటక రాష్ట్రంలో ఉంది . “ సంవత్సరంలో పెన్నానదిలో 56 . 6 లక్షల ఎకరపు అడుగుల నీరు ప్రవహిస్తోంది . ' ( ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టులు కె . వి . శ్రీనివారావు పేజీ9 ) పెన్నానీరు కొసన నెల్లూరుకు దక్కుతున్నాయే గాని పైభాగం ఎండమావులే . దీని పరివాహక ప్రాంతం కర్నాటక రాష్ట్రంలో కూడా వుండటమూ , ఆ రాష్ట్రం వాటి మీద విచక్షణారహితంగా అనేక చెరువులు , వూటకాల్వలు , చెక్ డ్యాములు , డ్యాములు . నిర్మించటంవల్ల నీరందే అవకాశం లేకుండా పోతున్నది . పెన్నలో వర్షకాలంలో ఉన్నట్టుండి నీరు వరదల రూపానపారి వెంటనే తగ్గిపోతూంటుంది .
అదే పెన్న ! అదే పెన్న !
నిదానించినడు
విదారించునెదన్ , వట్టి
ఎడారి తమ్ముడు !
( పెన్నేటి పాట__ భూమన్ సీమసాహితి_జనవరి1996)
(సేకరణ: పిళ్లా విజయ్)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి