రాయలసీమ లో నదీనదాలు

         

 చిత్తూరు జిల్లాలోని ముఖ్యమైన నదులు తూర్పు కనుమలలో ఉద్భవించిన పొన్నై మరియు స్వర్ణముఖి నదులు. ఇతర నదులలో   కాలంగి, పాపాఘ్ని, కౌండిన్య, పాలేరు, ఆర్ని,  కుశస్థలి, బీమా, బాహుదా, పింఛా, కళ్యాణి,  మరియు పెద్దేరు ఉన్నాయి. జీవ నదులు ఏవీ  లేవు.
          వైఎస్సార్ కడప జిల్లా 15,938 చదరపు కిలోమీటర్ల (6,154 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది.ఈ జిల్లాలోని ప్రధాన నదులు పెన్నా, చిత్రవతి, కుందేరు, పాపాఘ్ని, సాగిలేరు, బాహుదా, చెయ్యేరు.

              రాయలసీమ లో  అనంతపురం అతిపెద్ద జిల్లా .అది 19,130 ​​చదరపు కిలోమీటర్ల (7,390 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది.   ఈ జిల్లాలో ఆరు నదులు ప్రవహిస్తున్నాయి.అవి పెన్నా, చిత్రవతి, వేదావతి, పాపాఘ్ని, స్వర్ణముఖి, తడకలేరు. 

           కర్నూలు తుంగభద్ర నది ఒడ్డున ఉంది. హుంద్రీ మరియు నీవా నదులు కూడా నగరం గుండాప్రవహిస్తున్నాయి K.C.  (కర్నూలు-కడప) కెనాల్   రవాణా కోసం డచ్ వారు నిర్మించారు. కాని తరువాత దానిని నీటిపారుదల కొరకు ఉపయోగించారు.
       రాయలసీమ లోని అన్ని నదులు పేరుకు మాత్రమే నదులు. వాటిల్లో ఇసుక తప్ప నీళ్లు ఉండవు.
         
         సహ్యాద్రి పర్వత శ్రేణిలో మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణానది , మహారాష్ట్ర , కర్ణాటక , తెలంగాణలో 
ప్రవహించి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది . తూర్పు కనుమలలోని నల్లమల కొండల అవరోధాల 
వలన తన గతిని మార్చుకొని ప్రవహిస్తూ , పులిచింతల వద్ద మైదాన భాగానికి వస్తుంది . విజయవాడ వద్ద కృష్ణా 
నది విశాలమైదాన ప్రాంతం నుండి పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలికృష్ణాజిల్లా లోని హంసదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది . 
               కర్ణాటకలో జన్మించిన పెన్నా నది అనంతపురం , కడప , కర్నూలు , నెల్లూరు జిల్లాల్లో ప్రవహించి నెల్లూరుకు 
దక్షిణాన ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది . 
            కర్నూలు జిల్లా నల్లమలై కొండలో జన్మించిన గుండ్లకమ్మ నది గుంటూరు , ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి