సీడెడ్ కాదు_ రాయలసీమ



విజయనగర సామ్రాజ్యం ఏలుబడిలో సీమ జిల్లాలన్ని ఉండేవి. వీరి పతనం తరువాత హైదరాబాద్ నిజాం ఏలుబడిలోకి  పోయింది. తరువాత కాలంలో ఆ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పాలించడానికి వీలుగాక కప్పం కింద  బ్రిటిష్ వారికి అప్పగించింది.అందుకే దీనిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని పిలుస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దీనిని రాయలసీమ అని నామకరణం చేశారు.
       భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు 1953 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. 1953–1956 నుండి, ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగం. 1956 లో, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఫిబ్రవరి 2, 1970 న, కర్నూలు నుండి మూడు తాలూకాలు మార్కాపూర్, కంభం , గిద్దలూరు లను కలిపి, నెల్లూరు జిల్లా మరియు గుంటూరు జిల్లాలోని మరికొన్ని తాలూకాలను విలీనం చేసి ప్రకాశం జిల్లాగా ఏర్పరచారు.
మళ్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయింది.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం భారత పార్లమెంటు 2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 బిల్లును ఆమోదించింది. హైదరాబాద్ ను  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటికి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.  భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత తెలంగాణ కొత్త రాష్ట్రం 2 జూన్ 2014 న ఉనికిలోకి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాయలసీమ అంతర్భాగం.
(సేకరణ: పిళ్లా కుమారస్వామి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి