గంజికరువు పై కావ్యం



          ఆధునిక సాహిత్యంలో 1952 నాటి గంజి కరువును గురించి బెళ్లూరి శ్రీనివాసమూర్తి తన ' తపోవనం ' కావ్యంలో ఇలా ప్రస్తావించారు . 

" కనుడోయీ ఇటు గంజికేంద్ర మిటులాకర్ణింపు దాక్రందన 
ధ్వనిహస్తంబుల మట్టి పాత్రలు వహియింపన్ ధీనభావంబు లా నన సీమన్ వహియింపగా ముసుచున్నారెంత దారిద్ర్య మీ 
జనతన్ మ్రింగగ వేచి యున్నయది దుష్కాలంబుప్రాప్తింపగన్ " 

“ ముదుసళ్లు , స్త్రీలు , పురుషులు 
పెదవులు తడియారు చంటి బిడ్డలు , మెయి 
పయ్యెదలేమి సిగ్గు మరచిన 
సుదతులు గలరిందు , క్షుదకు సోలి నడచుచున్ " 

             గంజి కరువుపై బెళ్లూరి శ్రీనివాసమూర్తి ఒక ఖండికను మాత్రమే రాయగా కడప జిల్లా సుండుపల్లె ప్రాంతానికి చెందిన భైరపురెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి రాయలసీమ ' రైతు ' అనే కావ్యాన్నే రాశారు . 

“ కసవు పొసగదు నీరైన నొసగ లేక 
మేప నడవికి తోలిన గోపవరుల 
కనుగొలంకుల జొచ్చిన కరుణ జలము 
గ్రోల గనజూచి నట్లుండె గోచయంబు " 

“ జలము తొలగిన పచ్చిక నెలవులకట 
నీరు తొరగిన పిన్న యెడారుల వలె 
గడ్డి పోచయు లేనట్టి కాడులగుట 
నవసి పశుకోటి చావని శవములయ్యె " 

అంటూ గంజి కరువునాటి హృదయవిదారక పరిస్థితులను వర్ణించారు . 
(సేకరణ:పిళ్లా విజయ్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి