కదిరిలో పర్యాటక రంగం

కదిరిలో పర్యాటక రంగం
                 
కదిరి ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి .ఇందులో తిమ్మమ్మ మర్రిమాను , వేమన మెమోరియల్ కేంద్రము, చంద్రవదన మొహియార్ సమాధి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రముఖంగా ఉన్నాయి .ఇవి కాకుండా కదిరి కి దగ్గరలో హార్స్లీ హిల్స్, పుట్టపర్తి ,లేపాక్షి ఉన్నాయి.ఇవే కాకుండా పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి దేవాలయం, పాల బావి ,కదిరి కొండ, బ్రాహ్మణపల్లి జలాశయము ,వెలిగల్లు జలాశయము ,వేమన జలాశయము , వెంగ ముని ఆలయం ఇలా మొదలైన ప్రాంతాలు అటు పర్యాటక రంగానికి ఇటు యాత్రా స్థలాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటిని సరైన రీతిలో అభివృద్ధి చేస్తే కదిరి ప్రాంతంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది .దీనివల్ల  అనేక వాహనాలకు గిరాకీ ఉంటుంది. వసతి గృహాలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని వల్ల చాలా మందికి ఉపాధి పెరుగుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు
1. బ్రాహ్మణపల్లి జలాశయం దగ్గర ఒక బృందావనం ను ఏర్పాటు చేయాలి.
2. శ్రీలక్ష్మీ నరసింహ దేవాలయానికి ప్రత్యేక భోజనశాలను నిర్మించాలి. వసతిగృహాన్ని నిర్మించాలి. కోనేరు దగ్గర ప్రహ్లాద చరిత్రను రూపకంగా,  లేదా డిజిటల్ రూపకంగా ప్రదర్శించాలి. గుడి చుట్టూ ఉన్న అక్రమణలను తొలగించాలి.
3. తిమ్మమ్మ మర్రిమాను దగ్గర ఒక పార్కును నిర్మించాలి. అక్కడ వసతి  గృహాలను, ఫంక్షన్ హాల్స్ ను నిర్మించాలి. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా గాలిపటాల పండుగను  పిల్లలతో నిర్వహించాలి.
5. కదిరి కొండ దగ్గర పారువేట కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
6. టిటిడి కళ్యాణ మండపం ను  పునరుద్ధరించాలి. అక్కడకదిరి విశిష్టతను తెలియజేసే చిత్రపటాల ప్రదర్శనతో ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి.


కదిరిలో పరిశ్రమలు
                   

       కదిరిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.
1 అన్ని చెరువులకు నీళ్లు నింపి 
 పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి.
2. సిల్క్ పరిశ్రమను, మల్బరీ సాగును, పట్టు గుడ్ల నుంచి నూలును తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.
3. టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయాలి
4. చేనేత కార్మికులకు ఉపాధి పెంచే విధంగా గా చర్యలు  తీసుకోవాలి.
5. భూగర్భ ఖనిజాలను గుర్తించి సంబంధిత ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.
6. పూల సాగు  బాగుంది కాబట్టి  సెంటు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించాలి.

__పిళ్లా విజయ్


     

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి