రాయలసీమ చారిత్రక నేపథ్యం
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి వేయించిన శాసనాన్ని బట్టి ఈ ప్రాంతం అం అం ఆ సామ్రాజ్యం కింద ఉండేది అని తెలుస్తోంది ఈ శాసనాలు కర్నూలు జిల్లా ఎర్రగుడి రాజుల మందగిరి లోనే లభించాయి ఇది బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి ఈ సామ్రాజ్య పతనం తర్వాత ఈ ప్రాంతం శాతవాహనుల ఏలుబడిలోకి వచ్చింది. నాసిక్ శాసనం లో గౌతమీ బాలశ్రీ ములకనాటి ప్రభువుగా రాసుకున్నాడు. కడప జిల్లాలోని పడమటి ప్రాంతం కర్నూలు జిల్లాలోని తూర్పు ప్రాంతం కలిపి ములకనాడు అనిపిలిచేవారు.
క్రీస్తు శకం 200 ప్రాంతంలో బళ్లారి ప్రాంతంలో లభించిన పల్లవ రాజులనాటి మైన దీప శాసనంలో ఆంధ్ర పదం అనే పదం ఉంది. నిస్సందేహంగా ఈ శాసనం తెలుగు శాసనం అని చెప్పవచ్చని కంభపాటి సత్యనారాయణ పేర్కొన్నారు.
రాయలసీమలోని చాలా భాగం శాతవాహనుల పరిపాలనలో ఉండేదని ఇక్కడ దొరికిన నాణేల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం మూడో శతాబ్దం మొదటి భాగంలో శాతవాహన రాజ్యం పతనమైన తర్వాత ఇక్ష్వాకులు వచ్చారు ఇక్ష్వాకుల రాజధాని నేటి నాగార్జునకొండ. అప్పట్లో దానిని విజయపురం అనేవారు. వీరికి హిరణ్యకులతో బంధుత్వం ఉందని ఆధారాలున్నాయి. ఈ హిరణ్యకులు నేటి కడప కర్నూలు జిల్లాలుగా గుర్తిస్తున్న ప్రాంతాన్ని పరిపాలించారు.
వీరి తర్వాత ఇక్ష్వాకులు క్రీ.శ. 230నుండి 355 వరకు, పల్లవులు కంచి రాజధానిగా చేసుకుని క్రీస్తు శకం 300 నుంచి 630 వరకు పాలించారు బాదామి చాళుక్యులు మహబూబ్నగర్ కర్నూలు మధ్య ప్రాంతం నుండి తమ రాజ్యాన్ని విస్తరించు కున్నారు. వీరికి సామంత రాజులుగా రేనాటి చోళులు క్రీ.శ. 550 నుంచి 750 వరకు పాలించారు.
క్రీస్తుశకం ఆరు ఏడు శతాబ్దాల ఈ మధ్యకాలంలో బాదామి చాళుక్యులు కంచి పదవులకు మధ్య జరిగిన యుద్ధాల వలన రాయలసీమ చాలా నలిగిపోయింది కంచికి మీ ఇంటి మీదకు దండెత్తి మీదికి దండెత్తి పోతున్న రాయలసీమ గుండానే వెళ్ళేవి. వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు రాయలసీమ అ ప్రాంతంలోని ప్రజలను వీరు విపరీతంగా దోచుకున్నారని వల్లంపాటి వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు.
ఈ కాలంలో రాయలసీమను రేనాటి చోళులు పాలించేవారు వీరు పూర్తిగా తెలుగువారే. నేటి కడప జిల్లా ఉత్తర భాగాన్ని కర్నూలు జిల్లా దక్షిణ భాగాన్ని కలిపి అప్పట్లో రేనాడుగా పిలిచేవారు. వీరు తెలుగు భాషాభివృద్ధికి విశిష్టంగా కృషిచేశారని కడప జిల్లాలో లభించిన వీరి శాసనాల ద్వారా మనకు అర్థం అవుతుంది.
రేనాటి చోళులు కరికాల చోళ వంశం వాళ్ళని చెప్పుకున్నారు మీరు కడప జిల్లాలోని తూర్పు ప్రాంతాన్ని కర్ణాటకలోని తుముకూరు జిల్లా సరిహద్దుల వరకు తమ రాజ్యాన్ని విస్తరించి చేసుకున్నారు వీరి రాజధాని మదనపల్లి శివారులోని చిప్పిలి అని కొంతమంది, కడప జిల్లా కమలాపురం తాలూకా లోని చెప్పిల్లి వీరి రాజధానని మరికొంత మంది భావించారు
వీరి తర్వాత రేనాడు బాణ రాజుల వశమయ్యింది. వీరు పల్లవులకు సామంతులుగా ఉండేవారు.పల్లపు ను బాదామీ చాళుక్యులు ఓడించడంతో తిరిగి రాజ్యం బాదామి చాళుక్యుల సామంత రాజ్యంగా మారింది. రేనాటి రాజుల పతనం తర్వాత క రాయలసీమతో పాటు దక్షిణాపథాన్ని అంతా ఒకే సామ్రాజ్యం కిందకు తీసుకు వచ్చిన వారు విజయ నగర రాజులు. విజయనగర రాజులు క్రీస్తుశకం 1330లో నుంచి క్రీస్తుశకం 1565 వరకు పాలించారు. తల్లికోట యుద్ధం తో విజయనగర సామ్రాజ్య హోమ్ పతనమైంది మీరు తర్వాత బీజాపూర్ సుల్తానులు అలీ ఆదిల్షా, ఇబ్రహీం కుతుబ్షాలు రాయలసీమలోని చాలా భాగాలను ఆక్రమించుకున్నారు.
వీరి తర్వాత శివాజీ మొత్తం రాయలసీమతో పాటు దక్షిణ దేశ రాజ్యాలను కూడా జయించాడు. ఆ తర్వాత ఈ ప్రాంతం నైజాము ఏలుబడిలో కి, నైజాం తర్వాత మైసూర్ రాజ్యంలోకి భాగమైంది. మైసూర్ రాజ్యం హైదరాలీ తర్వాత టిప్పుసుల్తాన్ ఆధిపత్యంలోకి వచ్చింది. బ్రిటిష్ వారితో టిప్పు సుల్తాన్ కు మధ్య జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. నైజాము నవాబుకు బ్రిటిష్ వారికి జరిగిన సంధి ఫలితంగా రాయలసీమ నైజాంకు తిరిగి దక్కింది.నైజాం బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం నిజాం నవాబు బ్రిటిష్ వారికి రాయలసీమ జిల్లాలను ధారాదత్తం చేశాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి