కడప నగరం


            కడప   మున్సిపల్ కార్పొరేషన్ 

కడప నగరం
      కడప, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన నగరం. వైఎస్ఆర్ కడప జిల్లాకు ముఖ్య పట్టణం. కడప మండలానికి ప్రధాన కేంద్రం. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. 

      కడప నగరం భౌగోళికంగా 14.47°N 78.82°E వద్ద ఉన్నది. ఇదిసముద్రమట్టానికి 138 మీ (452 అడుగుల) ఎత్తులో ఉంటుంది.

         కడప నగర వ్యాసార్ధం (radius) 8 కి.మీ. వైశాల్యం 203చ.కి.మీ, చుట్టుకొలత  50కి.మీ.. విమానాశ్రయం, యోగివేమన విశ్వవిద్యాలయం, కేంద్రకారాగారాలను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే కడప‌నగర వ్యాసార్థం 13 కి.మీ, వైశాల్యం 530 చ.కి.మీ, చుట్టుకొలత (circumference) 81.6 కి.మీ.

            పశ్చిమం దిశగా బళ్ళారి నుండి అనంతపురం గుండా పారే పెన్నా నది ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న నెల్లూరు జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారినా వేసవిలో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, సగిలేరు, చెయ్యేరు, పాపాఘ్ని.

       కడప పెన్నా నదికి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉంది. 

                    నల్లమల అడవులు
నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు 
                పాల కొండలు
ఉండగా, ఒక వైపు పాల కొండలు ఉన్నాయి. 

        కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప అనే పేరుకు దగ్గరగా ఉంది. స్థలపురాణం ప్రకారం దేవుని కడపలో విగ్రహ ప్రతిష్టాపన చేసింది మహాభారతం లోని కౌరవుల కులగురువైన కృపాచార్యుడు. ఆయన పేరుమీదుగా ఆ ఊరిని కృపనగరం, కృపాపురం, కృపావతి అని పిలిచేవారు.కృప అనే పేరు , ప్రజల నోళ్లలో బడి అది కాస్త కురుప/కుర్ప/కరుప/కరిప అయి వుంటుందని భావిస్తున్నారు.  క్రీ.పూ. 200 - క్రీ.శ. 200 మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించిన టాలమీ అనే గ్రీకు యాత్రీకుడు ఆ పేరును కరిపె/కరిగె అని రాసుకున్నాడు.  
          కడప నవాబుల అధికారిక భాష పర్షియన్. ఆ భాషలో క, గ అనే అక్షరాల మధ్య తేడా ఇప్పుడు తెలుగులో థ,ధల మధ్య ఉన్నట్లు ఒక చుక్క మాత్రమే. అందువల్ల 'క' ను పొరబాటుగా 'గ' అని పలికేవారు.అలా  కరుప మెల్లగా గరుపగా కాలక్రమంలో కడప గా మారిందని భావిస్తున్నారు.

         "పూర్వం తిరుమలకు వెళ్ళే యాత్రీకులు ముందుగా దేవుని కడపలోని లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించు కోవటం ఆనవాయితీగా ఉండేది." అలా గడప మెల్లగా కడప గా మారిందని భావిస్తున్నారు చాలామంది. కానీ ఈ ఆనవాయితీ ఉన్నమాట నిజమే అయినా కడప పేరుకు దానితో సంబంధం లేదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

      చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆంగ్లేయుల ఉచ్చారణకు అనుగుణంగా సృష్టించిన స్పెల్లింగు "Cuddapah"కి బదులుగా 2005 ఆగస్టు 19 లో అందరికీ సౌకర్యంగా ఉండేవిధంగా "Kadapa" అని మార్చారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం kadapa ను ysrkadapa జిల్లా గా మార్చారు.
కడపను 1868 లో ఒక పురపాలక గా ఏర్పాటు చేశారు.ఇది 6.84 చ.కీ.మి. ల లో ఉండేది. 2004నాటికి 91.05 చ.కీ.మి. విస్తీర్ణం.దీనిని 2004 లో  మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేశారు. 2006 నాటికి 164,08 చ.కీ.మి. కు పెంచారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరంలో సుమారు జనాభా 344078 ఉంది.
        
         11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప చోళ సామ్రాజ్యము లోని ఒక భాగం.14వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఇది విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉంది. 1422 లో పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లింల పరమైనది. 1800 లో బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగమైంది. కడప నగరం పురాతనమైంది. అయినా కుతుబ్ షాహీ పాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనమైంది. 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం  నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలింది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయానా  నవాబులకు ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లింది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మన్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైంది. 1830 లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాటి కడప స్థితిగతులను తన కాశీయాత్ర చరిత్రలో రికార్డు చేశాడు. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలో ఉన్న పట్టణంగా చెప్పవచ్చు. చాలా మంది పనివాళ్ళు ఉన్నారని, జిల్లా కోర్టూ, కలెక్టరు కచ్చేరీ ఉందని రాశాడు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళుకట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో నది, ఊరినడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించారు. ఊరివద్ద ఒక రెజిమెంటు ఉండేది. అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపారు. 
         కడపలో దేవుని కడప (లేదా) పాత కడప,

దేవుని కడప
                   రథోత్సవం
దేవుని కడప చెరువు,అమీన్ పీర్ దర్గా (ఆస్థాన్-ఎ-మగ్దూమ్-ఇలాహి దర్గా),సి. పి. బ్రౌన్ గ్రంథాలయం,
సెయింట్ మేరీస్ క్యాథెడ్ర చర్చ్, మరియాపురం
విజయదుర్గా దేవి గుడి, శిల్పారామం,వై ఎస్ ఆర్ క్రికెట్ స్టేడియం,పాలకొండలు, లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రాజీవ్ గాంధీ వైద్య కళాశాల, పుట్లంపల్లి,కందుల శ్రీనివాసరెడ్డి  ఇంజినీరింగ్ కళాశాల,హైదరాబాద్ పబ్లిక్ 
పాఠశాల,యోగి వేమన విశ్వవిద్యాలయం మొదలైనవి ఉన్నాయి.
         

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి