కడప కా పేరు ఎలా వచ్చిందంటే
కడప కా పేరు ఎలా వచ్చిందంటే
కడప జిల్లా గెజిటీరు ప్రకారం కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/kurpah) అనే రాసేవాళ్ళు. ఇది కృప అనే పేరుకు దగ్గరగా ఉంది. స్థలపురాణం ప్రకారం దేవుని కడపలో విగ్రహ ప్రతిష్టాపన చేసింది మహాభారతం లోని కౌరవుల కులగురువైన కృపాచార్యుడు. ఆయన పేరుమీదుగా ఆ ఊరిని కృపనగరం, కృపాపురం, కృపావతి అని పిలిచేవారు.
కృప అనే పేరు , ప్రజల నోళ్లలో బడి అది కాస్త కురుప/కుర్ప/కరుప/కరిప అయి వుంటుందని భావిస్తున్నారు. క్రీ.పూ. 200 - క్రీ.శ. 200 మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించిన టాలమీ అనే గ్రీకు యాత్రీకుడు ఆ పేరును కరిపె/కరిగె అని రాసుకున్నాడు.
కడప నవాబుల అధికారిక భాష పర్షియన్. ఆ భాషలో క, గ అనే అక్షరాల మధ్య తేడా ఇప్పుడు తెలుగులో థ,ధల మధ్య ఉన్నట్లు ఒక చుక్క
మాత్రమే. అందువల్ల 'క' ను పొరబాటుగా 'గ' అని పలికేవారు.అలా కరుప మెల్లగా గరుపగా కాలక్రమంలో కడప గా మారిందని భావిస్తున్నారు.
"పూర్వం తిరుమలకు వెళ్ళే యాత్రీకులు ముందుగా దేవుని కడపలోని లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించు కోవటం ఆనవాయితీగా ఉండేది." అలా గడప మెల్లగా కడప గా మారిందని భావిస్తున్నారు చాలామంది. కానీ ఈ భావన ఉన్నమాట నిజమే అయినా కడప పేరుకు దానితో సంబంధం లేదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
(Kadapa info.com ద్వారా)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి