హంద్రీనీవా
ఈ ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలో 602500 ఎకరాలకు
సాగునీరు అందించటానికి రూపొందించిన పథకం. క్షామానికి గురౌతున్న ఈ నాలుగు జిల్లాలు
ఈ ప్రాజెక్టు వల్ల కొంత సాగునీటి సౌకర్యం పొంది, కరువు కోరల నుంచి కొద్దిగా ఉపశమనంగా
పొందుతాయి. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం రిజర్వాయరు నుంచి 40టి.యం.సిల నీరు ఎత్తిపోతలపథకం తో క్రిష్ణా బేసిన్లోని మిగులు నీటి నుంచి బచావత్ అవార్డు ప్రకారం శాశ్వత హక్కులేని విధంగా ఉపయోగించు కోవడానికి తయారు చేసిన పథకం. ఆంధ్రప్రదేశ్ లో క్రిష్ణాబేసి లోని ప్రాజెక్టుల ప్రతిపాదనలు అపరిష్కృతంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 5.5టి.యం.సిల నీళ్లతో త్రాగునీటి పథకాన్ని కేంద్ర జలవనరుల సంఘం ఆమోదానికి పంపింది. ఈ నీరు ఆంధ్రప్రదేశ్ లో అవలంబించిన పంటల మార్పిడి వలన ఆదా అయిన 19.33టి.ఎం.సిల నుంచి వాడుకొంటామని నిర్ధారించింది.
ఇరిగేషన్ కమాండ్ ఏరియా డిపార్టుమెంటు చీఫ్ ఇంజినీయర్లు హంద్రీనీవా ప్రాజెక్టును రాయలసీమలో కరువుల నుండి రక్షంచుటకు అందులోనుముఖ్యంగా అనంతపురం జిల్లాను ఆదుకోవచ్చని గుర్తించారు. అందులో 88టి.యం.సిల నీరు అనంతపురం జిల్లాకు లభించేటట్లు చేయవచ్చని క్రింద కనుబరచిన మేరకు సూచించినారు.
టి.యం.సిలు
పూడిక వల్ల ఎగువకాలువలో
తగ్గిన నీరు 6.00
నాగార్జున సాగర్ ఆయకట్టులో
పంట మార్పిడి వల్ల
ఆదా అయ్యేనీరు 19.33
కె.సి.కెనాల్ నీరు పి.ఏబి.ఆర్.కు
మల్లింపు వల్ల వచ్చే నీరు 10.00
గోదావరి నుంచి క్రిష్ణాబేసిన్‌కు
మళ్లించడం వల్ల 20.00
పులిచింతల ప్రాజెక్టు
వల్ల వచ్చే నీరు 10.00
తుంగభద్ర మరియు క్రిష్ణానదుల
నుంచి మిగులు నీరు 23.00
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి