పడుగుపేకలు
ప్రస్తుత కరోనా సందర్భంలో చేనేత కార్మికుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. ఈ సమయంలో వెంకట కృష్ణ గారు 'పడుగుపేకలు' పై చేసే విశ్లేషణ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. దేవతలకే వస్త్రాలు నేసిచ్చిన వృత్తి, సాలెగూడు, పాము కుబుసంతో పోటీపడగల, అగ్గిపెట్టెలో పట్టే ఆరుగజాల సన్నని చీరను నేసిన నేతన్న జీవితం చుట్టూ అల్లిన 58 కథల సంకలనం ఇది. యుగాలుగా కాలంతో పాటు పయనిస్తూ చేనేత వృత్తి ఎన్ని సంక్షోభాల్ని ఎదుర్కొని నిలబడింది? ఎంత వైభవాన్ని చవి చూసింది? ఎంత పూట గడవని స్థితిలోకి నెట్టివేయబడింది? ఇందులోని ప్రతి కథ, ప్రతి అక్షరం చెప్పడానికి ప్రయత్నించాయి. మనం ఈ రోజు సభ్య సమాజంలో సభ్యతగా, నాగరికంగా కనిపిస్తున్నామంటే దానికి కారణం చేనేత కార్మికుడు. అలాంటి చేనేత కార్మికుని జీవితం నాటి నుండి నేటి దాకా ఎలా మారుతూ వచ్చింది? చేనేత వృత్తిలోని లోతుపాతులేమిటి? వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలేమిటి? ఇందులోని కథకులు వాడిన భాష, వృత్తి పదజాలం ఏమిటి? ప్రయోగించిన శిల్పం ఏమిటి? ఇలా ఎన్నో కోణాల్లో వెంకటకృష్ణగారు మాట్లాడారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి