సాహిత్యకారులను నిరంతరం వెంటాడుతున్న వాక్యాలు
సాహిత్యకారులను నిరంతరం వెంటాడుతున్న వాక్యాలు
తరాలు మారినా అభివృద్ధికి నోచుకోని రాయలసీమలో వానరాక , పొలాలు పండక , తిండికి గుడ్డకు చివరికి గుటికెడు మంచినీటికీ కరువై , అప్పుల బరువు మోసుకుంటూ జనాలు హైదరాబాదు, బెంగుళూరు,పూనే, తిరువనంతపురం వంటినగరాలకు వలసలు పోతున్నారు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ నేపథ్యంలో సీమనుండి వలస పోయిన కార్మికుల దయనీయ స్థితి ని మనమిప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.
రాయలసీమ వెనుక బాటుతనాన్ని , కరువును సొమ్ముచేసుకుంటూ ప్రజలను నిరంతరం వంచిస్తున్న రాజకీయాలు నడుస్తున్నాయి ." హింస , హత్యాకాండల నిలయం , బాంబుల , తుపాకుల ఉత్పత్తి కేంద్రం , కిరాయి హంతక ముఠాల స్థావరం . . ."అంటూ సినిమా లలో, సీరియల్లలో నిరంతరం ప్రచారం చేస్తున్నారు.ఆఖరుకు కొంతమంది రాజకీయ నాయకులు కూడా కడప రౌడీలు, అనంతపురం ఫ్యాక్షన్..అంటూ రాయలసీమ ను చులకన చేస్తూ మాట్లాడుతున్నారు. ఫ్యాక్షన్ బాగా తగ్గిపోయినా రాజకీయ కక్షలతో పల్లెల్లో ప్రజలు వైరివర్గాలుగా విడిపోయారు . ఇవన్నీ సమాజంలో నైతిక , సాంస్కృతిక విలువలను ధ్వంసం చేస్తున్నాయి.
పర్యావరణం ధ్వంసమై , చెట్టూ చేమా మాడిమసై , నేల బీటలువారి ఇసుక మేటలు వేస్తూ ఎడారిగా మారిపోతున్న దశ రాయలసీమ లో పలుచోట్ల దాపురించింది.కంకరకోసం, ఖనిజాల కోసం కొండలు మాయమవుతున్నాయి.
ఇవేగాక విభజనా నంతరం ఏర్పడిన అనేక పరిస్థితులు సీమ మేధావులు,రచయితలను ప్రశ్నిస్తున్నాయి. సాహితీ , సాంస్కృతిక రంగాలలో కర్తవ్యాలను నిర్దేశించుకోమని ప్రేరేపిస్తున్నాయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి