రాయలసీమ ప్రాచీన చరిత్ర


ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథాన్ని రచించిన ప్రముఖ కవి విద్యానాథుడు.
విద్యానాథుడు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు (1295–1323) ఆస్థాన కవి. ఈ గ్రంథం రాజుని శ్లాఘిస్తూ, అతని గుణగణాలను కీర్తిస్తూ రచించాడు.ఇతను 'తెలింగ' పదాన్ని సంస్కృతీకరించి (త్రిలింగ), దాన్ని శ్రీశైలం, కాళేశ్వర, దక్షారాము శైవ క్షేత్రాలకు సంబంధించినదిగా చెప్పినాడు. తరువాత కాలంలో ఈ భావన ఎంతో ప్రాచుర్యం పొందింది. పదవ శతాబ్దం నుండి మాత్రమే ఆ పదం శాసనాలలో 'తిలింగ' లేక 'తెలింగ' గా కనిపిస్తుంది. ఈ మాటకు సాదృశ్యాలు బ్రహ్మాండ, వాయు పురాణాల్లో ఉన్నాయని గమనించారు.  ఆంధ్ర ప్రాంతంలో తెలగాలు లేక తెలుంగలు ఒక కులంవారు కూడా ఉన్నారు. భాషగా 'తెలుంగు' అన్న పదం నన్నయ కాలంనుండి అంటే క్రీ.శ. 11వ శతాబ్దం నుండి మాత్రమే కనిపిస్తుంది. మల్లియ రేచన రాసిన తొలికాలపు ఛందోగ్రంథం కవిజనాశ్రయం లో కూడా ఈ పదం కనిపిస్తుంది. ఆ కవి, ఈ రచయిత అభిప్రాయంలో, క్రీ.శ. 10వ శతాబ్ద మధ్యభాగంలో వేములవాడలో జీవించాడు. ఇన్ని అంశాలున్నప్పటికీ తెలుగు లేక తెనుగు అన్న మాటల మూలార్థం, అది తెగల, జాతి పరమైనదో లేక ప్రాంత పరమైనదో కూడా తెలుసుకోలేకపోయాం.(page24_25,ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర_గ్రామీణజీవనం_పి.వి.పరబ్రహ్మశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి