రాయలసీమ చరిత్ర రచనకు ఉపకరించిన ఆధారాలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజించవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఙ్మయాధారాలు,
1) పురావస్తు ఆధారాలు :
పురావస్తు ఆధారాలను తిరిగి మూడు విధాలుగా విభజించవచ్చు. అవి: 1) శాసనాలు 2) నాణేలు 3) కట్టడాలు (లేక) ఇతర అవశేషాలు.
1) శాసనాలు :
భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు అశోకుని శాసనాలే. అశోకుని శాసనాలు క్రీ.పూ. 250 ప్రాంతం నాటివి. ఇవి ప్రధానంగా శిలలపైనా, శిలాస్తంభాల పైనా వ్రాయబడినవి. రాయలసీమ లోని ఎర్రగుడి, రాజుల మందగిరి, కొట్టాంలలో లభించిన అశోకుని ధర్మశాసనాలు ఆంధ్రదేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమైందని నిరూపిస్తున్నాయి.
అశోకుని శాసనాల తర్వాత పేర్కొనదగినవి క్రీస్తు పూర్వం 2 నుంచి 11వ శతాబ్ధాల మధ్య బహుదా నదీ తీరాన ఆడపూరు వద్ద ఉన్న కొండపై బౌద్ధమత ఆరామాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇవి క్రీ.పూ. 200 నాటికే బౌద్ధమతం రాయలసీమ లో వ్యాపించిన విషయాన్ని తెలుపుతున్నాయి.
తూర్పు చాళుక్య యుగం నుండి శాసనాలలో తెలుగు భాష వాడకం ప్రారంభమైంది. బ్రాహ్మీలిపి తెలుగు లిపిగా పరిణామం చెందింది. అయిననూ సంస్కృత భాషా, దేవనాగరి లిపి శాసనాలలో విధిగా ఉపయోగింపబడేవి.
అశోకుని కాలం (క్రీ.పూ. మూడో శతాబ్దం) నుండి ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. నాలుగో శతాబ్దం) వరకు రాయలసీమ లో ప్రాకృతమే శాసన భాషగా వాడబడింది.
తెలుగు భాషలో లభించిన మొట్టమొదటి శాసనాలు అనంతపూర్, కడప జిల్లాలలో లభించిన రేనాటి చోళులవి. ఇవి క్రీ.శ. ఆరు, ఎనిమిది శతాబ్దాల మధ్య కాలానివి.
(ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర_పి వి కె ప్రసాదరావు)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి