కదిరి ఆవిర్భావం



కదిరి ఆవిర్భావం 


        కడప గెజిటీర్లో పేర్కొన్న ప్రకారం 1807 నాటికి కదిరి పులివెందులతో కలిపి పులివెందుల తాలూకాగా కడప జిల్లా కింద ఉండేది . అందువల్ల కడప జిల్లా నుంచి కదిరిని వేరుపరిచే వరకు కడప జిల్లాను పాలించిన వారే కదిరిని కూడా పాలించారు.
2వ శతాబ్దంలో పల్లవులు పరిపాలించారు వారి పరిపాలన మూడు నాలుగు శతాబ్దం వరకు ఉందని సిద్దవటం తాలూకా గంగ పేరూరులో లభించిన రోమకు నాణేలవల్ల తెలుస్తోంది తర్వాత ఇక్ష్వాకులు చాళుక్యులు పరిపాలించారు. కడప జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారు ఈ జిల్లాను చాళుక్యులు పరిపాలించారు. మూడవ శతాబ్దంలో వీరు కడప ప్రాంతాన్ని పరిపాలించారు అందులో భాగంగా కదిరి వారి ఆధీనంలో ఉంది. చాళిక్కులు అనంతరం ఈ ప్రాంతాన్ని సాధారణ శకం 8వ శతాబ్దం వరకు తెలుగు చోళులు పాలించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని రేనాడుగా వ్యవహరించే వారని చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ రాతలను బట్టి తెలుస్తోంది. పదవ ఎనిమిదవ శతాబ్దంలో చివరి భాగంలో రాష్ట్రకూటులు దండయాత్ర చేశారు. వీరే రాట్టులుగా, తర్వాత కాలంలో రెడ్లుగా మారారని చరిత్ర చెబుతోంది. తొమ్మిదో శతాబ్దంలో బాలరాజులు పరిపాలించారు పదవ శతాబ్దంలో చోళుల ప్రాబల్యం పెరిగింది. ఇదే కాలంలోనే రాష్ట్ర కూటులు పులివెందల తాలూకాను ఆక్రమించారు అప్పటికి కదిరి పులివెందుల కిందనే ఉంది. రాష్ట్ర కోటలకు సామంతులుగా మారిన వైదంబులు 11 12 శతాబ్దంలో ఇనగల్లూరు నాడుగా పిలవబడిన పులివెందుల తాలూకా ను పరిపాలించారు.
  కదిరి లో లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నిర్మించక ముందు చాళుక్యులు క్రీ.శ. 965-1076 కాలంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. దుర్గాదేవి విగ్రహాన్ని కృష్ణవర్ణ(నల్లని) శిలతో సుందరంగా చెక్కించి తమ కాలపు కళాత్మక ప్రత్యేకతను నాటి రాజులు చాటుకున్నారు. వీరి తరువాత క్రీ.శ.1191 సంత్సరం వరకు పశ్చిమ చాళుక్యులు , క్రీ.శ.1212 వరకు హొయసల వంశస్థులైన బల్లాల రాజులు పరిపాలించారు. క్రీ.శ. 1274లో వీర బుక్కరాయలు విజయనగరమహా సామ్రాజ్యాన్ని పాలించేవాడు. ఆయన ఆ నాటి ఖాద్రి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ ఆ నాటి గిరిజన ప్రజానీకం పూజించిన స్థలాన్ని గుర్తించి ఒక మండపాన్ని నిర్మించాడు. దీన్ని క్రీ.శ 1275లో నిర్మించినట్లు ఇక్కడి శాసనాలు చెపుతున్నాయి . 

         

1856లో పులివెందులను రెండుగా విభజించి పులివెందుల తాలూకా, కదిరి తాలూకాలుగా మార్చారు. కడప గెజిటీర్ ప్రకారం 1910 లో కదిరిని అనంతపురంలో విలీనం చేశారు. మళ్లీ 2022,ఏప్రిల్ లో ఇచ్చిన ప్రభుత్వ గెజిట్ ప్రకారం అనంతపురం జిల్లాను అనంతపురం జిల్లా , సత్యసాయి జిల్లాలుగా రెండుగా విభజించి కదిరిని సత్యసాయి జిల్లాలోకి మార్చారు. అంతేకాక కదిరిని రెవెన్యూ డివిజన్ గా కూడా చేసినారు.

___ పిళ్లా కుమారస్వామి,9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి