డొక్కల కరవు (1866)

*డొక్కల కరవు (1866)* 

            కర్నూలు ప్రాంతానికి కరవు తాకిడి మామూలే . పూర్తిగా వర్షాధారమైన ఈ ప్రాంతం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారయినా కరవు బారిన పడేది . 1866 ప్రాంతంలో వచ్చిన ధాతు కరవు అత్యంత భయంకరమైంది . మనుషులు తిండి లేక చిక్కిపోయి చర్మం ఒంటికి అతుక్కుపోయి , డొక్కలు కనబడటంతో దీనికి డొక్కల కరవు అని పేరు వచ్చింది . 
            ఆకలికి తట్టుకోలేక చెట్ల బెరళ్ళు , వేర్లనే కాక , మెత్తని జల్లెడ పట్టిన నల్లరేగడి మన్నును గూడా ప్రజలు తిన్నారు . పశువులు గడ్డి లేక తుడిచి పెట్టుకుపోయాయి . జనం వలసబాట పట్టారు . తిండి లేక , పని లేక సతమత మయ్యారు .రోడ్ల కిరువైపులా ఎక్కడ చూసినా శవాలే . పట్టించుకొనే వారే లేరు . దాదాపు 40 శాతం మంది ప్రజలు ఈ కరవులో మరణించినట్లు తెలుస్తోంది . దాంతో ప్రభుత్వం ఫ్యామిన్ కమీషన్ ఏర్పాటు చేసింది . సాగునీటి పారుదల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొంది .     
             మిషనరీలు అనేక చోట్ల పనులు కల్పించి , గంజి కేంద్రాలు తెరచి ప్రజలను ఆదుకున్నాయి . ఈ సమయంలో ప్రజల కోసం తన సర్వస్వం ధారపోసి తన చేతనైనంత వరకు ఆదుకొని అందరిచే కొనియాడబడిన వ్యక్తి బుడ్డా వెంగళరెడ్డి .

 
(సేకరణ: పిళ్లా కుమారస్వామి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

The unexplored relics of Rayalaseema

కదిరి