రాయలసీమ జానపదుల సంస్కృతి


   

           వివిధ కథా గానాలా ధారంగా రాయలసీమ జాన పదుల సంస్కృతి సంప్ర దాయాలు,ఆచార వ్యవ హారాలు,కళలు, అలంకరణలు, వినోదాలు,నమ్మకాలు మొదలై నవి తెలుస్తాయి.
             గ్రామదేవతలకు ప్రతి శివరాత్రికి తిరునాళ్ళు జరుపుతారు.తిరునాళ్ళు ఎంతో వైభోగంగా జరుగు తాయి.సుదూర ప్రాంతాల నుంచి కూడ ఈ తిరునాలకు వెళ్తారు. కడపలో దేవునికడపలో, నిత్యపూజ య్య స్వామి దగ్గర తిరునాల జరుగుతూంటుంది.
            "చిన్నపరెడ్డి కథ"లో తిరునాళ్ళకు వచ్చేటప్పుడు
ఎద్దులకు చేసిన ఆలంకరణను చూడడానికి జనాలు ఎగబడి నట్లు వారిని నివారించడంలో యజమానులు ఎంతో కష్ట పడినట్లు ఉంది.
" రామలక్ష్మణ ఎద్దులా ఆ ప్రభకేమో కట్టుకున్నారు. రాజా!
ఎక్కడెక్కడ వున్నా మంది ఆంతమందిని తొలగదీసిరి ||
కోటప్పస్వామి కొండకు ప్రదక్షిణ చేశాడు రెడ్డి ||రాజూ||
"తిమ్మమ్మ" కథాగానంలో, తిమ్మమ్మ తిరునాళ్ళు గురించి ఉంది.
"వేద బ్రామ్మలు వేదాలు చదవంగ హరికథలు, బుర్రకథలు చెప్పుతుంటారు.
జాతకంబులు వాళ్ళు చక్కగా చదవంగ సకల సంతోషంబుగా పరస జరుగుతుంది"
             అనంతపురం జిల్లా తిమ్మమ్మ మర్రిమాను దగ్గర
శివరాత్రికి జాతర జరుగు తుంది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచే గాక రాయలసీమ అన్ని జిల్లాలు, కర్నాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలనుంచి కూడ భక్తులు విరివిగ పాల్గొంటారు. రాత్రికి జాగరణ చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హరికథలు, బుర్రకథలు చెబుతారు.ఒక్క పొద్దు (ఉపవాసం)తో తిమ్మమ్మను పూజిస్తారు. అలా చేస్తే తమ కష్టాలు తీరి సంతోషంగా ఉంటారని జానపదుల నమ్మకం.
             గ్రామదేవతలకు సంవత్సరానికొక సారి జాతర్లు
జరిపిస్తారు. జాతర సమయం లో అమ్మవారికి పొట్టేళ్ళను (యాటలను), మేకపోతులను బలి ఇస్తారు. బోనాలు చెల్లిస్తారు.ఆ సందర్భంగా జానపదులు తడి గుడ్డలతో అగ్నిగుండంలో దిగి నడుస్తారు. కాల్చిన గడ్డపారలను చేతులతో పట్టుకోవడం పవిత్రంగా భావిస్తారు. అలా చేస్తే దేవతలు శాంతిస్తారని చల్లగా కాపాడుతారని వీరి నమ్మకం.
           "పోలేరమ్మ కథ"లో "అంకాలమ్మ కథ"లో జంతు బలుల ప్రస్తావన ఉంది. బలి ఇచ్చిన తర్వాత పొలి
చల్లడం ఆచారం. రక్తం, అన్నం, వేపాకులనుచేటలో కలిపిఊరి పొలిమేరవరకు పొలి చల్లుతారు. ఇలాచేస్తే పంటలు సమృద్ధిగా పండి, గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని, దయ్యాల భూతాల బారినుండి అమ్మవారు గ్రామస్తులను కాపాడుతారని జానపదుల విశ్వాసం. ఈ పోలేరమ్మ కథలో, అంకాలమ్మ కథలో పొలి చల్లే విధానం గురించి చక్కగా వర్ణించారు.

            జానపదులు అన్ని పండుగలను ఎంతో వైభో
జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటిరోజు భోగి, రెండవరోజు సంక్రాంతి, మూడవరోజు కనుమపండుగ. ఇదే పశువుల పండుగ. ఆరోజు పశువులను అలంకరించి, పూజించి వాటికి ప్రసాదాన్ని తినిపిస్తారు. గంగమ్మకథలో ఇవన్నీ వివరించారు.

         __ సి.రమాదేవి
      ( సేకరణ: పిళ్లా కుమారస్వామి)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి