రాయలసీమ భౌగోళిక లక్షణాలు
రాయలసీమ భౌగోళిక లక్షణాలు
ఏ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, నాగరికతలనైనా తీర్చిదిద్దటానికి భౌగోళిక లక్షణాలు ఎంతగానో తోడ్పడతాయి. రాయలసీమ ప్రాంత చరిత్ర తెలుసుకొనే ముందు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులను తప్పక తెలుసుకోవాలి. ఆ భౌగోళిక పరిస్థితులే ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల్ని ప్రభావితం చేస్తాయి. భౌగోళిక పరిస్థితులకు, చరిత్రకు విడదీయరాని సంబంధం ఉంది. .
రాయలసీమ జిల్లాల ఉత్తర అక్షాంశాలు
చిత్తూరు - 12"-37'- 14°,
అనంతపురం-13°--41'--15°14',
కర్నూలు -14°-54'-16°18', |
వై.ఎస్.ఆర్.కడప - 13°-43'-15°14'.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల తూర్పు రేఖాంశాలు
అనంతపురం - 76°--47'- 78° 26',
చిత్తూరు - 78°-30 - 79°56',
కర్నూలు -77°24'- 79°40',
వై.ఎస్.ఆర్.కడప-77°-51'-79°29'.
రాయలసీమ అనేక కొండలు లోయల్లతో ప్రకృతి సౌందర్యానికి పుట్టిళ్ళు గా ఉంది. ఈ ప్రాంతంలో శేషాచలం కొండలు, నల్లమల, ఎర్రమల,సాండూరు, గండికోట పర్వతాలు తూర్పు కనుమల్లో భాగంగా ఉన్నాయి.
తూర్పుకనుమలు
రాయలసీమ తూర్పు కనుమలు, శేషాచలం పర్వత శ్రేణులు, నల్లమల, ఎర్రమల, సాండూరు పర్వతాలతో
కలసి ఉంది. కర్నూలు, కడప తూర్పు సరిహద్దున వెలికొండలు ఉన్నాయి. ఇవి కడప, చిత్తూరు జిల్లాల్లో అగ్నేయం
నుండి నైరుతికి వ్యాపించి, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, పలమనేరు, వుంగనూరు దాటి కుప్పం వరకూ విస్తరించాయి.
శేషాచల పర్వత శ్రేణులకు చెందిన కరకంబాడి-తిరుపతి శ్రేణుల నుండి మొదలై వాయల్పాడు, రాజంపేట,రాయచోటి. సిద్ధవటం, కడప, పులివెందుల ప్రాంతాలను తాకుతూ, అనంతపురం జిల్లాలో తాడిపత్రి, గుత్తి
ప్రాంతంలోని ముచికుంద వరకూ విస్తరించాయి.
కర్నూలు జిల్లాలో నల్లమలకొండలు ఉత్తరానున్న తుంగభద్రానది నుండి దక్షిణానున్న కడప జిల్లా లోని పెన్నా
నది వరకూ వ్యాపించి, ప్రొద్దుటూరు,కడప,బద్వేల్లో విస్తరించాయి. కర్నూలు పట్టణంలో మొదలైన ఎర్రమలకొండలు
కడప, రామళ్ళకోట, పాణ్యం, పెద్దపల్లి(అనంతపురం) లవరకు వ్యాపించాయి.
కడప జిల్లా లో పర్వతాలను గండికోట పర్వతాలని, అదోని, ఆలూరు, రాయదుర్గం ప్రాంతంలోని పర్వతాలను సాండూరు పర్వతాలని పిలుస్తారు. ఈ పర్వత శ్రేణులు, కొండలు, గుట్టలు, ప్రకృతి వరప్రసాదాలుగా పరిగణించ బడుతున్నాయి. వాతావరణ మార్పులకు వర్షపాతానికి ఈ పర్వతాలు, కనుమలు చాలా అనుకూలం.
ఈ కొండలోయలు ప్రకృతి సౌందర్యానికి,నదీనదాలకు పుట్టిళ్ళు.
పీఠభూమి
రాయలసీమ లో కఠిన శిలలచే ఏర్పడిన పీఠభూమి ప్రాంతం అనేక నదులు పుట్టటానికి కారణమైంది. ఈ పీఠభూమి ప్రాంతంలో చంద్రగిరి, గండికోట, గుత్తి ,మడకశిర, పెనుకొండ అనే బలిష్టమైన దుర్గాలు నిర్మించబడ్డాయి. పీఠభూమి ప్రాంతంలో పలుగురాయి, కడప, కర్నూల్, లో సున్నపురాయి విరివిగా దొరుకుతుంది. ఈ ప్రాంతంలో జనుము, మాంగనీస్, రాతినార, రాగి, వజ్రాలు, బాక్సైట్ మొదలైన ఖనిజాలు లభ్యమవుతున్నాయి.
నదీనదాలు
చిత్తూరు జిల్లాలోని ముఖ్యమైన నదులు తూర్పు కనుమలలో ఉద్భవించిన పొన్నై మరియు స్వర్ణముఖి నదులు. ఇతర నదులలో కాలంగి, పాపాఘ్ని, కౌండిన్య, పాలేరు, ఆర్ని, కుశస్థలి, బీమా, బాహుదా, పింఛా, కళ్యాణి, మరియు పెద్దేరు ఉన్నాయి. జీవ నదులు ఏవీ లేవు.
వైఎస్సార్ కడప జిల్లా 15,938 చదరపు కిలోమీటర్ల (6,154 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది.ఈ జిల్లాలోని ప్రధాన నదులు పెన్నా, చిత్రవతి, కుందేరు, పాపాఘ్ని, సాగిలేరు, బాహుదా(చెయ్యేరు).
రాయలసీమ లో అనంతపురం అతిపెద్ద జిల్లా .అది 19,130 చదరపు కిలోమీటర్ల (7,390 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది. ఈ జిల్లాలో ఆరు నదులు ప్రవహిస్తున్నాయి.అవి పెన్నా, చిత్రవతి, వేదావతి, పాపాఘ్ని, స్వర్ణముఖి, తడకలేరు.
కర్నూలు తుంగభద్ర నది ఒడ్డున ఉంది. హుంద్రీ మరియు నీవా నదులు కూడా నగరం గుండాప్రవహిస్తున్నాయి K.C. (కర్నూలు-కడప) కెనాల్ రవాణా కోసం డచ్ వారు నిర్మించారు. కాని తరువాత దానిని నీటిపారుదల కొరకు ఉపయోగించారు.
రాయలసీమ లోని అన్ని నదులు పేరుకు మాత్రమే నదులు. వాటిల్లో ఇసుక తప్ప నీళ్లు ఉండవు.
సహ్యాద్రి పర్వత శ్రేణిలో మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణానది , మహారాష్ట్ర , కర్ణాటక , తెలంగాణలో ప్రవహించి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది . తూర్పు కనుమలలోని నల్లమల కొండల అవరోధాల
వలన తన గతిని మార్చుకొని ప్రవహిస్తూ , పులిచింతల వద్ద మైదాన భాగానికి వస్తుంది . విజయవాడ వద్ద కృష్ణా నది విశాలమైదాన ప్రాంతం నుండి పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి కృష్ణాజిల్లా లోని హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది .
కర్ణాటకలో జన్మించిన పెన్నా నది అనంతపురం , కడప , కర్నూలు , నెల్లూరు జిల్లాల్లో ప్రవహించి నెల్లూరుకు దక్షిణాన ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది .
కర్నూలు జిల్లా నల్లమలై కొండలో జన్మించిన గుండ్లకమ్మ నది గుంటూరు , ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
సీడెడ్ కాదు_ రాయలసీమ
విజయనగర సామ్రాజ్యం ఏలుబడిలో సీమ జిల్లాలన్ని ఉండేవి. వీరి పతనం తరువాత హైదరాబాద్ నిజాం ఏలుబడిలోకి పోయింది. తరువాత కాలంలో ఆ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పాలించడానికి వీలుగాక కప్పం కింద బ్రిటిష్ వారికి అప్పగించింది.అందుకే దీనిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని పిలుస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దీనిని రాయలసీమ అని నామకరణం చేశారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు 1953 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. 1953–1956 నుండి, ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగం. 1956 లో, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఫిబ్రవరి 2, 1970 న, కర్నూలు నుండి మూడు తాలూకాలు మార్కాపూర్, కంభం , గిద్దలూరు లను కలిపి, నెల్లూరు జిల్లా మరియు గుంటూరు జిల్లాలోని మరికొన్ని తాలూకాలను విలీనం చేసి ప్రకాశం జిల్లాగా ఏర్పరచారు.
మళ్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయింది.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం భారత పార్లమెంటు 2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 బిల్లును ఆమోదించింది. హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటికి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత తెలంగాణ కొత్త రాష్ట్రం 2 జూన్ 2014 న ఉనికిలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాయలసీమ అంతర్భాగం.
రాయలసీమ లో కాలువలు
హంద్రీ_నీవా సుజల స్రవంతి కాలువ రాయలసీమలోనే పెద్ద కాలువ.అయినప్పటికీ దీన్లో ఒక టిఎంసి లోపు నీరు కూడా పారడంలేదు.దీని మార్గంలో హంద్రీ,పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య, బాహుదా,గార్గేయ నదులు ఉన్నాయి . . ఈ కాలువ కాలువ రాయలసీమలోని నాలుగు
జిల్లాలకు సాగునీటినందిస్తుంది.దీనికి సమాంతర కాలువ నిర్మిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పారు.వాస్తవ రూపం దాల్చేదెప్పుడు?
కె . సి . కెనాల్ . దీనినే కర్నూల్ - కడప కాలువ అంటారు . దీన్ని 150 సంవత్సరాలకు పూర్వమే నిర్మించారు .
కర్నూల్ జిల్లాలో సుంకేసుల బేరేజ్ నుండి మొదలైన ఈ నీటి పారుదల కాలువ కడప , కర్నూలు జిల్లాల్లో సాగునీటిని ,
తాగునీటిని అందిస్తుంది.
రాయలసీమ లో అటవీప్రాంతం
వైశాల్యం అడవి జనాభా అటవీ శాతం
చ.కి.మీ. చ.కి.మీ ( 2011)
1 కర్నూలు 17658 | 3515 .49 40.47 19.91
2 కడప 15359 | 5002 .95 28.85 32.57
3 అనంతపురం 19130 ! 1969 .78 40.83 10.30
4 చిత్తూరు 15152 | 4520 .18 41.70 29.83
రాయలసీమ 67299 | 15008 .40 151.85 22.30
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి