వైఎస్ఆర్ కడపజిల్లా


             Ysr kadapa district map

      రాయలసీమలో కడప జిల్లా అంటే ఫ్యాక్షన్‌ ప్రాంతమని చెపుతుంటారు. ఇది ఒకప్పటి మాట.ఇక్కడ బాంబుల తయారీ ఒక  కుటీర పరిశ్రమ అని చాలా మంది భావిస్తారు. ఇది కూడా నలభై ఏళ్ల కిందటి మాట. ఇదే విధానాన్ని ఇప్పటికీ ఈ జిల్లా వాసులు కొనసాగిస్తున్నట్లు సినిమాలు ప్రచారం చేయడంతో అది వాస్తవమని భావించేవారి సంఖ్య అధికంగా వుంది. అయితే కడప జిల్లా బాంబుల జిల్లా కాదు బంగారు జిల్లా అనేందుకు జిల్లాలో అనేక నిదర్శనాలున్నాయి. ఖనిజ సంపదతో పాటు పదకవితా పితామహుడు అన్నమయ్య, కాల జ్ఞాని  పోతులూరి  వీరబ్రహ్మం, ప్రజాకవి వేమన లాంటి వారందరికీ జన్మస్థలం ఈ జిల్లా.  చరిత్రలోకి వెళితే ఈ జిల్లా హిరణ్య రాష్ట్రంగా పిలువబడింది. ఎందరో మహానుభావుల పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. రాయలసీమ జిల్లాలకు నడిబొడ్డున వున్న కడప గురించి ఎంతగా, ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చెప్పినా రోజులు చాలవు.

భౌగోళిక స్వరూపం

 ఉత్తర అక్షాంశం 13 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు 15 డిగ్రీల నుండి 15కు మధ్యగానూ, తూర్పు రేఖాంశం 77 డిగ్రీల నుండి 55 కు, 79 డిగ్రీల నుండి 30 కు మధ్య గానూ కడప జిల్లా విస్తరించి ఉంది. ఈ జిల్లా వైశాల్యం 15.373 చదరపు కిలోమీటర్లు. 

సరిహద్దులు

ఉత్తరంలో కర్నూలు, తూర్పున నెల్లూరు, ద క్షిణాన చిత్తూరు, పశ్చిమాన అనంతపురం జిల్లాలు సరిహద్దులుగా కడప జిల్లా ఏర్పాటు అయింది. 
కడపజిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలయసీమ ప్రాంతానికి చెందిన జిల్లా. భౌగోళికంగా కడప జిల్లా రాయలసీమ నడిబొడ్డున వుంది.

నదులు

కడప జిల్లాలో జీవనదులు లేవు. ఒక్కప్పటి జీవ నది అయిన పెన్నా(పినాకిని) ఈ జిల్లాలో పడమర నుండి తూర్పు దిశగా ప్రవహిస్తూ వెలిగొండ కనుమల్లో నుండి సోమశిల వద్ద నెల్లూరు జిల్లాలోకి ప్రవహిస్తోంది. పెన్నా నది ఉపనదులు కుందేరు(కుముద్వతి), సగిలేరు, చిత్రావతి, పాపాగ్ని, చెయ్యోరు(బాహుదా), పించా, మాండవీ, ఇవిగాక మరెన్నో వంకలు, వాగులు, ఈ జిల్లాలో అనేకం వున్నాయి.

కొండలు, అడవులు

శేషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. జిల్లాలో నల్లరేగడి, ఎర్రరేగడి, ఇసకపొర నేలలు ఉన్నాయి.
ఏజెన్సీ ప్రాంతాన్ని విడిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లా అత్యధికమైన పర్వత ప్రాంతం గల జిల్లా. ఈజిల్లాలో ఎర్రమల , నల్లమల, లంకమల, వరుసలు, పాలకొండ, భైనుకోటమల, మల్లెల కొండలు, కోకలెటి కనుమకొండలు, చిట్వేలి కొండలు, రాయచోటి తాలుకాలోని పెక్కు చిల్లరమ్మ కొండలు, గుట్టలు అనేకం వున్నాయి. ఈ జిల్లాలో 1,180,198 ఎకరాల అటవీ ప్రాంతం వుంది. కడప జిల్లా వైశాల్యంలో ఇది 90 శాతం ఆక్రమించింది.


 చారిత్రక నేపథ్యం

పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశం అని పేరు ఉంది. హిరణ్య అంటే బంగారం అని అర్థం. అంటే దీన్ని బంగారు దేశం అని పిలిచేవారన్నమాట.

ఉమ్మడి కడప జిల్లాకు దాదాపు రెండువేల ఏళ్ళ లిఖిత చరిత్ర ఉంది. చక్రవర్తి అశోకుడు మొదలుకొని శాతవాహన, పల్లవ, చాళుక్య, చోళ, రాష్ట్రకూట, బామ, నైదుంబ మౌర్య చక్రవ, పాండ్య, కాయస్థ, కాకతీయ, విజయనగర మట్లి వంశ రాజులు, మహమ్మదీయ పాలకులు,  పాలెగాళ్లు, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు పాలించారు. 

మౌర్య చక్రవర్తుల నుంచి రేనాటి చోళుల దాకా కడప జిల్లా  చరిత్రను నిర్దిష్టంగా తెలపడం ఇప్పటికి దొరికిన చారిత్రక సాక్ష్యాలను బట్టి సాధ్యం కాదు. కానీ పడమర ఉన్న అనంతపురం జిల్లా ఎర్రగుడి గ్రామంలోనూ ఉత్తరాన ఉన్న కర్నూలు జిల్లా రాజాలమందగిరి గ్రామంలోనూ లభించిన అశోకుని శాసనాలను బట్టి ఈజిల్లా మౌర్య సామ్రాజ్యంలో చేరి ఉండేదని చెప్పవచ్చు. అలాగే జమ్మలమడుగు తాలుకా పెద్దముడియంలో లబించిన శాతవాహన కాలపు నాణేలను బట్టి ఈ ప్రాంతం శాతవాహన రాజ్యంలో ఉండేదని భావించ వచ్చు. 

క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆతరువాత  శాతవాహనులు పాలించారు. శాతవాహనులనాణేలు పెద్దముడియందానవులపాడు గ్రామాల్లో దొరికాయి.

 క్రీ.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులుచోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి.

 క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా ఒక భాగం. గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులు పొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడా ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు.
 క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.ఆ తరువాత  ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్  థామస్మన్రో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరుగా పనిచేశాడు.  
క్రీ.శ.18,19 శతాబ్దాలలో విచ్చలవిడిగా ఉండే పాలెగాళ్ళను అణచి ఒక క్రమ పరిపాలనా వ్యవస్థవు ఏర్పరచి రైతువారీ భూస్వామ్యాన్ని కూడా మన్రో స్థాపించాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యాదిపత్యం ఈ జిల్లాలో స్థిరప డింది. క్రీ.శ. 1832లో జరిగిన కథకు అడిషనల్‌ సబ్‌ కలెక్టర్‌ మాక్‌ డొనాల్డ్‌ హత్య ఘటన తరువాత 1857లో జరి గి న తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చేరవలసిందిగా షేక్‌ పీర్‌షా చేసిన విజ్ఞప్తి చేశాడు. ఈ సంఘటన కడప  వాసుల బ్రిటిష్‌ వ్యతిరేకత, స్వాతంత్య్రేచ్చ కనిపిస్తాయి. 
క్రీ.శ.1900 తర్వాత ఎందరో రాజకీయవేత్తలు, మేధావులు, సామాన్యులు భారత జాతీ య కాంగ్రెస్‌ సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని మాతృదేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. హోంరూలు ఉద్యమంలో అనిబిసెంట్‌ నాయకత్వం క్రింద, విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలోనూ, క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ గాంధీజి నాయకత్వాల క్రింద ఈ జిల్లా నాయకులెందరో పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం లభించడంతో కూడా ఈ జిల్లాలో కూడా స్వేచ్చా వాయువులు వీచాయి. 
ఆతర్వాత ఆంధ్ర రాష్ట్రోద్యమం, సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమాల గాలులు కూడా ఈ నేలమీద వీచినాయి. 

రాయలసీమ లో కడప

రాయలసీమతో పాటు 1953 వరకు ఈ జిల్లా మద్రాసు అవిభక్త రాష్ట్రంలో ఉండేది. 1953 ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1955లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. రాయలసీమ విమోచనా సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ఏర్పాటు కోసం ఈ జిల్లా ప్రజలు పోరాడారు. తెలంగాణ విభజన నేపథ్యంలో తెలుగుజాతి సమైక్యత  కోసం ఈ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది.

జనాభా లెక్కలు

1981 నాటి జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా... 19.33 లక్షలు, స్త్రీ పురుషుల నిష్పత్తి: 96:100, అక్షరాస్యత: 30.99

2011 భారత జన గణన ప్రకారం జిల్లా జనాభా 28,84,524 మగవారు 1454136, ఆడవారు 1430388. జనసాంద్రత 188/కి.మీ². 

2001 జనగణన ప్రకారం అక్షరాస్యత 67.88% కాగా మగవారిలో 78.41%, ఆడవారిలో 57.26%గా ఉంది.


జిల్లా చరిత్ర

కడప జిల్లాచరిత్ర చాలా ప్రాచీనమైంది. 

మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగు భాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కోలిన్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు.

2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది. తరువాత వైఎస్ ఆర్ జిల్లా గా మార్చారు. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాను విభజించి కొంత భాగంతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు.

రాయలసీమలోని ఎనిమిది జిల్లాలకు నడిబొడ్డైన కడపలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి.

భౌగోళిక స్వరూపం



వాతావరణం

ఉష్ణోగ్రతలు వేసవికాలంలో 30°సె. - 44°సె, చలికాలంలో 21°సె. - 30°సెగా వుంటాయి. సగటు వర్షపాతము: 695 మి.మీ.

అడవులు 

అడవుల విస్తీర్ణం 4,96,672 హెక్టార్లు, జిల్లా విస్తీర్ణంలో 32.3 శాతం అన్నమాట.పులివెందుల మండలంలో తప్ప నల్లచేవ, ఎర్రచేవ,ఎపి మొదలైన కలప జాతులు, విదేశీమారకం తెచ్చిపెట్టే ఎర్రచందనము లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.


వాతావరణం, వర్షపాతం

ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. శీతాకాలంలో, వేసవిలో కంటే కడప లో చాలా తక్కువ వర్షపాతం ఉంది. కడప లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 29.2 ° సెంటీగ్రేడ్.


జలవనరులు

జిల్లాలో ప్రధాన నదులు పెన్నా, చిత్రావతి,పాపాఘ్ని, సగిలేరు, బాహుదా , చెయ్యేరు ఉన్నాయి.

తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట వద్ద మొదలై "కర్నూలు కడప కాలువ"(కెసి కెనాల్) కడప, కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ నాలుగు వేల హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తుంది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, పులివెందల కాలువ నిర్మాణంలో ఉన్నాయి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామం వద్ద పుల్లల మడుగు జలాశ్రయం నిర్మించబడింది. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. 

జిల్లా లోపల అనేక జలాశయాలున్నాయి. వాటిలో కొన్ని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్, మైలవరం ఆనకట్ట జలాశయం గండికోట రిజర్వాయర్ ఉన్నాయి.

ఆర్ధిక స్థితిగతులు

వ్యవసాయం

వరిసజ్జజొన్నరాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకుపసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది.

జిల్లాలో పెన్నానది, కె.సి.కాలువ ప్రధానమైన నీటి వనరులు. జిల్లా మొత్తంలో కాలువల క్రింద 24 వేల హెక్టార్లు, చెరువుల క్రింద 22 వేల హెక్టార్లు, బావుల క్రింద 66 వేల హెక్టార్లు తక్కిన వనరుల క్రింద 11 వేల హెక్టార్లు సాగులో ఉన్నాయి.ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, అనంత రాజపేటలో పండ్ల పరిశోధన కేంద్రం, మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ ఉన్నాయి.

ఖనిజాలు-పరిశ్రమలు

వైఎస్ఆర్ జిల్లా బెరైటీస్ (ముగ్గురాయి) గనులు, బండలకు ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్)  మంగంపేట గనుల్లో లభిస్తోంది.

 పులివెందుల ప్రాంతంలో  రాతినార తీస్తున్నారు.నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు. పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది.  యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది.  జమ్మలమడుగులో జిందాల్ వారి ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది.  ముద్దనూరు దగ్గర ఏర్పాటైన ఆర్.టి.పి.పి. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు,కడప ప్రొద్దుటూరులో పారిశ్రామిక వాడలున్నాయి. రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నెలకొల్పడం జరిగింది.



డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

రెవిన్యూ డివిజన్లు, మండలాలు

  • రెవెన్యూ డివిజన్లు (4): కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు

మండలాలు

  • మండలాలు (36). జిల్లా పునర్వ్యవస్థీకరణ తర్వాత పులివెందుల రెవిన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేశారు.

  1. కడప రెవెన్యూ డివిజన్
    1. ఒంటిమిట్ట
    2. కడప
    3. కమలాపురం
    4. చింతకొమ్మదిన్నె
    5. చెన్నూరు
    6. పెండ్లిమర్రి
    7. యర్రగుంట్ల
    8. వల్లూరు
    9. సిద్ధవటం
  2. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్
    1. కొండాపురం
    2. జమ్మలమడుగు
    3. పెద్దముడియం
    4. ప్రొద్దుటూరు
    5. ముద్దనూరు
    6. మైలవరం
    7. రాజుపాలెం
  3. పులివెందుల రెవెన్యూ డివిజన్
    1. చక్రాయపేట
    2. తొండూరు
    3. పులివెందుల
    4. లింగాల
    5. వీరపునాయునిపల్లె
    6. వేంపల్లె
    7. వేముల
    8. సింహాద్రిపురం
  4. బద్వేలు రెవెన్యూ డివిజన్
    1. అట్లూరు
    2. కలసపాడు
    3. ఖాజీపేట
    4. గోపవరం
    5. చాపాడు
    6. దువ్వూరు
    7. పోరుమామిళ్ల
    8. బద్వేలు
    9. బి.కోడూరు
    10. బ్రహ్మంగారిమఠం
    11. మైదుకూరు
    12. శ్రీ అవధూత కాశినాయన





రవాణా సౌకర్యాలు


విమానాశ్రయం

బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన  కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. 2014 లో దీనిని ప్రారంభించారు. 

రైలు మార్గం

దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్య పట్టణమైన  ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణ దశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతి పాదనలు ఉన్నాయి. 

రహదారులు

కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు రాష్ట్ర రహదారులు. నెల్లూరు-బళ్ళారిలను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది.

పశు పక్ష్యాదులు

లంకమల్లేశ్వరములో శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం, రాజంపేటలో శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం ఉన్నాయి.

విద్యా సంస్థలు


2001 గణాంకాల ప్రకారం అక్షరాస్యత 62.53% కాగా పురుషుల్లో 71.22%, మహిళల్లో 53.74%గా ఉంది. ఇవేకాకబోధనా, సార్వత్రిక విద్య, కంప్యూటర్ విషయాలకు సంబంధించి శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి.
పారిశ్రామిక శిక్షణ సంస్థలు 18 , పాలిటెక్నిక్ కళాశాలు 15 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలు 4543 ఉన్నాయి.181 ఇంటర్మీడియట్  ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.

గ్రంథాలయాలు


కడపలో  యోగి వేమన  విశ్వవిద్యాలయం,  రిమ్స్ (రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందులలో    జె.ఎన్.టీ.యూ (జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల, కడపలో క్రీడా పాఠశాల, ప్రభుత్వ హోమియో కళాశాల ఉన్నాయి. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది.

పర్యాటకం


ముఖ్య పుణ్యక్షేత్రాలు

ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి.రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా చాంద్ పీరా గుంబద్, గండికోట దుర్గం,   గండికోటసిద్ధవటం కోట, ఒంటిమిట్ట, తాళ్ళపాక ఉన్నాయి. భగవాన్ మహావీర్ పేరుతో ప్రభుత్వ మ్యూజియం కడప కలెక్టర్ ఆఫీసు ప్రాంగణంలో ఉంది.

ఇవే కాక మస్జీద్-ఏ-ఆజమ్,   గండి ఆంజనేయస్వామి దేవాలయము, వేంపల్లె, నామాలగుండు, కనంపల్లెదేవరరాయి, సంబేపల్లి, వీరభద్ర స్వామి దేవాలయము, దేవళాలు (అల్లాడుపల్లె), చాపాడు మండలం, రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము, సంజీవరాయుడు దేవాలయము ప్రొద్దుటూరు మొదలైనవి ఉన్నాయి.

ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులు


పెద్దన 

వేమన

రాజకీయనాయకులు

కడప కోటిరెడ్డి

గజ్జల మల్లారెడ్డి

 వై ఎస్ రాజశేఖరరెడ్డి

మైసూరా రెడ్డి

యం.వి.రమణారెడ్డి

వై ఎస్  జగన్మోహన్ రెడ్డి

ప్రసార సాధనాలు

1963 జూన్ 16న కడపలో  ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రసారాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, బళ్ళారి, బెంగుళూరు, కోలారు, చెన్నై తదితర ప్రాంతాల్లోనే కాక 900 కి.మీ. పరిధిలోని తెలుగు ప్రజలకు అందుతున్నాయి. ఇది కాక కడపలో  దూరదర్శన్ రిలే కేంద్రం ఉంది.

 మాధవరం చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయం తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

The unexplored relics of Rayalaseema

కదిరి