మద్యాన్ని మానిపించే పాండురంగ మాల


మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ బారి నుండి తప్పించే దైవం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో కొలువైన ఆ పాండురంగ స్వామే మద్యాన్ని మానిపించే దేవుడు.


రాయదుర్గ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఆటోలో ఎక్కి సమీపాన ఉన్న ఉంటకళ్ (ఉంతకల్లు) పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. బళ్లారి నుండి వచ్చేవారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గం వరకు చేరుకొని, అక్కడి నుండి ఉంటకళ్ దేవాలయానికి వెళ్ళవచ్చు.ఉం

ఉంతకల్లుో కొలువైన పాండురంగ దేవాలయం ఎంతో మహిమకలది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు.

 ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పాండురంగ స్వామి దేవాలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచుతారు

కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరు ప్రజలు తరచూ మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రమైన 'పండరీపురం' వెళ్లివచ్చేవారు. ఆతర్వాత ఇక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించుకొని పాండురంగ స్వామి దేవాలయం గా పేరుపెట్టుకున్నారు.

మద్యానికి బానిసైనవారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి పాండురంగ మాల ధరిస్తే మళ్ళి జన్మలో దాని జోలికి పొరనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మాల ధరించిన ఏ ఒక్కరూ మళ్ళి ఇప్పటివరకు మద్యం జోలికి వెళ్లలేదని దాఖలాలు ఉన్నాయి అని స్థానికులు చెబుతారు.


పాండురంగ మాల' ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజుపడితే ఆరోజు వేసుకోకూడదు. మాలాధారణ నిర్వహణ నెలలో కేవలం రెండు రోజుల మాత్రమే 'శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి' రోజుల్లోనే మాల ధరించాలి. ఆ రోజులలో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్కనున్న కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో హాజరవుతుంటారు.


పాండురంగ మాల ధరించాలనుకొనేవారు ముందుగా 100 రూపాయల ధర చెల్లించి టోకెన్ తీసుకోవాలి. ముందురోజు అర్ధరాత్రి నుంచి మాలను స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. మాల ధరించేవారు ఉదయాన్నే నిద్ర లేచి స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకోవాలి. గుడి ప్రాంగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్ లో నిల్చోవాలి. ఇలా నిల్చున్న భక్తులకు ఆలయ ప్రధాన పూజారి వచ్చి మెడ లో ఒక్కోటిగా మాల వేస్తారు.


ఆరోజున ఎంత ముందైతే భక్తులు వస్తారో, అంతమందికి ఉచిత భోజనాన్ని గ్రామస్తులే వండి, వడ్డిస్తారు. టోకెన్ కు 100 రూపాయలు తప్పనిచ్చి ఇంకా దేనికీ డబ్బులు తీసుకోరు. మాలధారణ చేసిన వారు వరుసగా మూడు ఏకాదశ రోజులలో ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రపోవాలి. కావాలనుంటే ఆ మూడు ఏకాదశ రోజులు అయిపోయినాక మాల తీసేయవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి