పోస్ట్‌లు

జూన్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది
కడప జిల్లాలో కథాసాహిత్యం - డా|| కేతు విశ్వనాథరెడ్డి ✪ kadapa.info కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనభై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో కథానిక చోటు చేసుకుంది. నాటకం, నాటిక విషయంలో కూడా సాంస్కతికమైన కన్పిస్తాయి. వెనకబడటమూ, ఆలస్యమూ మధ్య సంఘటనాపరమైన ఒక వైరుధ్యం లేకపోలేదు. అది, సినిమా వంటి ఒక నూతన సాంకేతిక మాధ్యమాన్ని, ఒక మిశ్ర దృశ్య సాహిత్య రూపాన్ని కడప జిల్లాకు చెందిన కీ.శే.బి.ఎన్.రెడ్డి 1939లో చేపట్టటం. ఈ వెనుకబడటమూ', చారిత్రకమైన ఈ ఆలస్యమూ వాహినీ ప్రొడక్షన్ తరపున వందేమాతరం (1941) వంటి సమకాలిక జీవితాన్ని చిత్రించటానికి ప్రయత్నించిన చిత్రాలకు A దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో వాహినీ సంస్థ, విజయా సంస్థ భారతదేశం గర్వించదగిన బి.యన్.రెడ్డివంటి కాల్పనిక దర్శ...

పల్లెతనం వదలని బిజివేముల రమణారెడ్డి

కడప జిల్లా రచయితలు ఎవరు రాసినా పల్లె జీవితం మీద పూర్తి పట్టు కలిగి ఉంటారు. పల్లెల్లో వస్తున్న మార్పుల్ని పట్టుకుని స్థానిక రాజకీయాలను ఎండగడతారు. రారా, సొదుం, కేతు, వైసివి రెడ్డి వంటి దిగ్గజాల దగ్గర్నుంచి పాలగిరి, సన్నపురెడ్డి, బత్తుల ప్రసాద్ దాక ప్రతి ఒక్కరూ ఆ కోవలోనే తెలుగు సాహిత్యం మీద తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు బిజివేముల రమణారెడ్డి వంతు. ఈయన కడప జిల్లా, పాపిరెడ్డి పల్లెకు చెందిన కథా రచయిత. నాకు తెలిసి 2004లో మొదలయ్యాడు. ఓ రెండేళ్లపాటు కథలు రాసి తర్వాత ఎందుకనో కొంత విరామం తీసుకున్నాడు. వృత్తి రీత్య జర్నలిస్టు కావడంతో ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇప్పుడు సొంత ఊరు చేరాడు. దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ కలం పట్టాడు. గత రెండేళ్లలో మరికొన్ని కథలు రాసి ‘ఏటి జేడేలు’ అనే అచ్చమైన రాయలసీమ పేరుతో పుస్తకం తెచ్చాడు. ఈ ‘ఏటి జేడెలు’ అంటే ఏంటో స్వయంగా పుస్తకం చదివి తెలుసుంటేనే బావుంటుంది. ‘డిశ్చార్జ్’, ‘ఆశ’ వంటి కథలు ఈ పుస్తకంలో ఆకట్టుకుంటాయి. రచయితకు స్థానిక జీవితం మీద, సొంత ఊరు మీద ఎంత ప్రేముందో ‘ఊరికి బోయెచ్చిన’ కథ చెబుతుంది. ఇతను పేద జీవుల పట్ల కనికరం పుష్కలంగా ఉన్నవాడు. కొంతకాలం రాజకీయాల్లో ఉన్నా...

రాయలసీమ దళిత జీవితం, సాహిత్యం

*రాయలసీమ  దళిత జీవితం, సాహిత్యం*        __*కిన్నెర శ్రీదేవి* (సేకరణ: పిళ్లా కుమారస్వామి)                 చాతుర్వర్ణ  హిందూమత వ్యవస్థలో ఏ స్థాయిలోనూ చోటులేక సాంఘిక జీవన చట్రం చివరి అంచులకు నెట్టబడి వెలిగా జీవించవలసిందిగా నిర్దేశింపబడిన వాళ్లు దళితులు. అంబేద్కరిజం పునాదిగా దళితవాదం రూపు దిద్దుకొంది.కులాన్ని కేవలం ఒక సాంఘిక విషయంగా కాక ఒక రాజకీయ ఆర్థిక దళిత వాదంలో ప్రధానమైంది దళిత అణచివేత రాజకీయాలు ప్రాతిపదికగా దళిత సాహిత్యం వచ్చింది               రాష్ట్రంలో దళిత ఉద్యమం దశదిశలా వ్యాపించినప్పటికీ, రాయలసీమలో  మాత్రం ఆ ఉద్యమం తలెత్తడం, విస్తరించడం. దళిత చైతన్యం పెరగడం వంటి అంశాలను  అంతగా పట్టించుకోలేదు. వర్తమాన దళిత ఉద్యమం గురించి తెలిసినంతగా రాయలసీమలో సంఘసంస్కర ణోద్యమకాలంలో హరిజనాభ్యుదయం  (దళితుల)పేరిట జరిగిన కార్యాచరణలు, వాళ్ళ గుర్తింపు కోసం కానీ, చైతన్యం కోసం కానీ చేసిన కార్యక్రమాలేవీచరిత్రలోకి ఎక్కలేదు. రాయలసీమ దళిత జీవితానికి సంబంధించిన వివిధ అంశాలు, దళితుల సామాజిక రాజక...

సామాజిక సమతా స్థితిని కాపాడుతున్న రాయలసీమ ముస్లిం కథ

సామాజిక సమతా స్థితిని కాపాడుతున్న రాయలసీమ ముస్లిం కథ -వేంపల్లె షరీఫ్‌ తెలుగులో ముస్లిం మైనార్టీ కథా సాహిత్యానికి పుట్టినిల్లు రాయసీమ. 1988లో కడపజిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని ‘పాచికలు’ కథ రాయడంతో తొగులో ముస్లిం మైనార్టీ కథాసాహిత్యం మొదలైంది. అంతవరకు తెలుగులో ముస్లిములు రాసిన ముస్లిమేతర సాహిత్యం, ముస్లిమేతరులు రాసిన ముస్లిం సాహిత్యం ఉంది కానీ ముస్లిములు రాసిన ముస్లిం కథా సాహిత్యం లేదు.  ఆ లోటును తీర్చడానికి రాయసీమకు చెందిన ప్రసిద్ధ సాహితీ వేత్తలు మధురాంతకం రాజారాం, వల్లంపాటి వెంకటసుబ్బయ్య గార్లు చేసిన సూచన మేరకు తాను కలం పట్టానని రచయితే స్వయంగా తన కథపుస్తకంలో చెప్పుకోవడం విశేషం. పూర్తి భిన్నమైన సామాజిక, సాంస్కృతిక జీవితం ఉన్న ముస్లిముల గురించి ముస్లిములే రాసుకోవడం వల్ల అనేక విషయాలు మరింత లోతుగా తెలుగు సాహితీ లోకానికి తెలుస్తాయనే ఉద్దేశ్యంతో వారు ఈ సూచన చేసుండొచ్చు.  ఏదేమైనా తెలుగులో ముస్లిం మైనార్టీ కథాసాహిత్యం అంతర్గత సంస్కరణాభిలాశతో మొదలవడానికి వాళ్లూ ఒక కారణమయ్యారు.  తొలి కథ ‘పాచికలు’లో రచయిత షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని ఇస్లాం మతంలో ‘తలాఖ్‌’ పద్ధతి దుర్వినియోగ...

రాయలసీమ మహిళా రచయితల కథా ప్రస్థానం

రాయలసీమ మహిళా రచయితల కథా ప్రస్థానం                              ___కిన్నెర శ్రీదేవి       ‌‌                       (సేకరణ: పిళ్లా కుమారస్వామి)                      రాయలసీమ వెయ్యేళ్ళ సాహిత్య చరిత్రలో కథాసాహిత్య చరిత్ర 1918 లో ప్రారంభమైతే, రాయలసీమ స్త్రీ రచయితల కథా ప్రస్థానం 1927 నుండి మొదలైంది.నిజానికి 1926 లో కస్తూరి వెంకట సుబ్బమ్మ (అనంతపురం) 'కథామంజరి ' పేరుతో పౌరాణిక వస్తువుతో ' బలిచక్రవర్తి చరిత్రం ', ' భీష్మోదయం ', ' గరుడ చరిత్రం ' కథలు రాశారు. కానీ ఇవి ఆధునిక జీవితాన్ని చిత్రించిన కథలు కాకపోవడం వలన కథానిక ప్రక్రియగా అంగీకరించవలసిన పని లేదు. 1927 సంవత్సరంలో చిత్తూరు జిల్లా నుండి మామిడి రుక్మిణమ్మ, కడపజిల్లా ప్రొద్దుటూరు నుండి కథలు రాసిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ ఆనాటి సమకాలీన సామాజిక సమస్యలను వస్తువుగా స్వీకరించి ' సీతాబాయి, సుందరి, అత్తగారు రేడియో తెలుసుకొంటిరా ' అనే కథలను ' భారత...

రాయలసీమ కరువు పై రాసిన తొలి కథారచయిత_తొలి దళితకథా రచయిత గుత్తి రామకృష్ణ

*రాయలసీమ  కరువు పై రాసిన తొలి కథారచయిత_తొలి దళితకథా రచయిత గుత్తి రామకృష్ణ*                   __పిళ్లా కుమారస్వామి,9490122229                స్వాతంత్ర్య సమర యోధుడు, అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరు,జిల్లా తొలిపాత్రికే యుడు , రాయలసీమ కరువు ను చిత్రించిన తొలి కథా రచయిత గుత్తి రామకృష్ణ 1915,జూలై13న అనంతపురం పట్టణంలోని అంబారపు వీధి లోని గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించారు.      ఆయన తన  జీవితమంతా  సమాజం కోసం అంకితం చేశారు.ఎంత చేసినా తనకు సంబంధం లేదన్నట్లుగా నిమిత్తమాత్రుడిగా జీవితం గడిపిన ధన్యజీవాయన.     ఆయన  బోర్డు స్కూల్ , ట్రైనింగ్ స్కూల్ , మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నారు . చదువుకునే రోజుల్లోనే తరగతుల పుస్తకాలకన్నా జనరల్ పుస్తకాలు అధికంగా చదివినారు.              రామకృష్ణ గారికి చిన్ననాటినుండే బ్రిటీష్ వారంటే ద్వేషంతో వుండేవారు. అందుకే ఆయన ఇంగ్లీషు సబ్జెక్టు చదివేవారు కాదు . స్వాతంత్రోద్యమంల...

రాయలసీమ మొదటి కథ

*రాయలసీమ మొదటి కథ*     _అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి (సేకరణ:పిళ్లా విజయ్ 9490122229)         ఆధునిక రాయలసీమ కథా సాహిత్యంలో కె.సభా ను ఒక కొండగుర్తుగా చెప్పవచ్చు. కె.సభాకు ముందు, తరువాత రాయలసీమ కథాసాహిత్యం అని స్థూలంగా విభజించు కోవచ్చు. కె. సభా 1944 ఏప్రిల్ నెలలో చిత్రగుప్త పత్రికలో రాసిన ' కడగండ్లు ' కథ మొదలుకొని తరువాత కాలంలో 300 దాకా కథలు రాసి సీమ కథా సాహిత్యంలో చెరగని ముద్రవేశాడు. కథాసాహిత్యంలో తరువాత తరాలని ప్రభావితం చేసి ఆదర్శప్రాయుడయ్యాడు.               సభా అనంతరం రాయలసీమ కథాసాహిత్యంలో చాలా మార్పులు, పరిశోధనలు జరిగాయి. 1980 ల నుండి రాయలసీమ ప్రాంతీయ అస్థిత్వం ఆధారంగా సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో పెద్ద ప్రయత్నమే జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమలో వెలువడిన సాహిత్యం సరైన క్రమంలో నిక్షిప్తం కాలేదు. కథాసాహిత్య ప్రక్రియలో ఈ లోటు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.గతానికి సంబంధించి లభిస్తున్న కొద్ది సమాచారాన్నైనా క్రోడీకరించి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.            ప్రాచ...