అనంత' కదిరి యోధుడు రాజన్న
మహత్తర నావికా దళ తిరుగుబాటులో 'అనంత' కదిరి యోధుడు రాజన్న
రెండవ ప్రపంచయుద్ధం తరువాత 1945-46లలో భారతదేశంలో బ్రిటీషు సామ్రాజ్యవాదుల పునాదులను కదిలించే కొన్ని సంఘటనలు జరిగినాయి. అందులో శిఖరాయమానమైనది నావికా దళ తిరుగుబాటు. 1945 జనవరిలో ప్రజా ఉద్యమానికి తలవొగ్గి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీలను విడుదల చేయక తప్పని పరిస్థితి బ్రిటీష్ వారికి కలిగింది. ఇది వారికి పెద్ద దెబ్బ. 1946 ఫిబ్రవరిలో నానిక దళ తిరుగుబాటు జరిగింది. నావికదళ తిరుగుబాటు తరువాత తమ అధికారానికి రోజులు దగ్గర పడ్డాయని బ్రిటీషు ప్రభుత్వం గుర్తించింది. నావికా దళ తిరుగుబాటు భారత దేశంలో ఆ తరువాత జరిగిన అనేక సమ్మెలకు, పోరాటాలకు ఉత్ప్రేరకంగా పనిచేసింది.
కదిరి మండలంలోని కాళ సముద్రం గ్రామంలో 12-5-1920న రాజన్న జన్మించాడు. తండ్రి జి. దేవదానం. తల్లి జి. సుందరమ్మ. యస్.యస్.యల్.సి. చదివిన తరువాత 11-9- 1943లో రాయల్ ఇండియన్ నేవీలో చేరినాడు. వార్సా, మచిలీ మార్ అనేచోట్ల శైలర్ శిక్షణ పొందినాడు. శిక్షణ తరువాత ఈయన్ను ఆర్.ఐ.యన్.కు చెందిన హియావతి అనే ఓడలో నియమించారు. అది రెండవ ప్రపంచ యుద్ధం భయంకరంగా జరిగే కాలం. ఈ ఓడ ఇరాక్ నుండి సింగపూర్కు తీసుకువస్తున్న ఆయిల్ ట్యాంకర్కు రక్షగా వెంట ఉంటుంది. అరేబియా హిందూ మహాసముద్రముల మీదుగా పసిఫిక్ మహాసముద్రం దగ్గరగా వున్న సింగపూర్కు క్షేమంగా చేరినారు. ఆ తరువాత ప్రమోషన్ యిచ్చి ఆర్.ఐ.యస్.కు 'ఫ్లాగ్ షిప్' గావున్న 'నర్మద' ఓడలోకి బదిలీ చేసినారు. ఆ ఓడకు కెప్టెన్ నాట్.. రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే అండమాన్ నికోబార్ దీవులలో వుండే జపాన్ సైన్యాన్ని వారి దేశానికి పంపడానికి ఈ ఓడ చాలా శ్రమించింది. ఫోర్ట్ బ్లెయిర్లో వుండి పని చేస్తున్నది.
ఈ సమయంలో బొంబాయి హార్బరులోని 'తల్వార్' ఓడకు చెందిన రేటింగ్సు (నావికులు) తమ అన్నంలో పురుగులు, ఇసుక కలిసి వుందని రిపోర్టు చేస్తే కెప్టెన్ వాళ్ళని తిట్టినాడు. అందువల్ల 1946 ఫిబ్రవరి 18న నావికులు తిరుగుబాటు జండా ఎగుర వేసినారు. ఈ విషయం బొంబాయి లోని కొలాబా వీధిలోని కమ్యూనికేషన్ సెంటర్ల ద్వారా పోరుట్లేయిర్ నావికులను చేరింది. ఆ వార్త అందిన వెంటనే ఓడల్ని బొంబాయికి ప్రయాణం కట్టినాయి. వస్తూ వస్తూ బ్రిటీష్ వర్కర్లను భారత నావికులు కోర్బర్ గారుఖలో బంధించారు. తిరుగబడిన వారిని సముద్రంలో ఎత్తిపారేసినారు.. ఈ విషయంలో రాజన్న చురుకుగా వ్యవహరించాడు. ఓడ మాస్కుకు ఎర్ర జెండా ఎగురవేసివాడు. బొంబాయి రేవు చేరిన తరువాత ఓడలో వున్న తుపాకులు బ్రిటీషు అధికార్లు వున్న తాజ్ మహల్ హోటల్ వైపు ఎక్కు పెట్టినారు. నావికులపై కాల్పులు జరపటాన్ని భారత సైనికులు నిరాకరిస్తే బ్రిటీషు దళాన్ని రప్పించింది ప్రభుత్వం. నావికులకు మద్దతుగా చేస్తున్న ప్రజా ప్రదర్శనపై కాల్పులు జరిపితే 300 మంది చనిపోయినారు. 1700 మంది గాయపడినారు. తిరుగుబాటు అన్ని రేవులకు వ్యాపించింది.
గాంధీ, నెహ్రూ, పటేల్, అరుణా అసఫ్ ఆలీ మొదలగు కాంగ్రెసు, ముస్లింలీగు నాయకులు నల్లజండాలు చూపుతూ కాల్పులు విరమించమని కోరుతూ ఓడలోకి వచ్చినారు. వారి ఎదురుగానే మాప్పై వున్న యూనియన్ జాక్ తొలగించి గాంధీ చరఖా వడుకుతున్న జండాను రాజన్న ఎగురవేసినాడు. అది చూచి కెప్టెన్ బూటుకాలితో తంతే రాజన్న నెహ్రూ దగ్గరకు ఎదురుకొనిపోయి పడినాడు.
177 మందిపై కోర్టు మార్షల్ విచారించింది. ఢిల్లీలోని త్రివిధ దళాల చీఫ్ు వచ్చినారు. నావికుల తరపున నెహ్రూ వాదించినాడు. యూనియన్ జాకు దించి ఇండియన్ ఫ్లాగ్ ఎత్తినాడనేది రాజన్నపై నేరారోపణ. 177 మంది నావెల్ రేటింగ్స్కు 'ఆనూటబుల్' గా పేర్కొంటూ డిస్మిన్ చేసినారు. ఆ తరువాత రాజన్న స్వగ్రామం తిరిగివచ్చి సెకండరీగ్రేడు శిక్షణ పొంది టీచరుగా పనిచేసినాడు. నావికా తిరుగుబాటులో పాల్గొన్న 177 మందికి స్వాతంత్ర్య సమరయోధులుగా 1990లో కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ మహాత్తర నావికా తిరుగుబాటులో రాయలసీమ వాసి ఉండటం మనకు గర్వకారణం.
___ పి. దస్తగిరి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి