కడప విమానాశ్రయం
కడప విమానాశ్రయం
కడప విమానాశ్రయాన్ని 1953లో 669.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.
1980వ దశకంలో వాయుదూత్ అనే ప్రాంతీయ ఎయిర్లైన్స్ సంస్థ ఆధ్వర్యంలో కడప నుండి హైదరాబాదుకు కొంతకాలం పాటు విమాన సర్వీసులను నడిచాయి. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు విమానాశ్రయం నిరుపయోగంగా పడి ఉంది.
ఈ విమానాశ్రయాన్ని 2000 దశకం చివరిలో విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్చి 2007లో ATR-42 మరియు ATR-72 రకం విమానాలను నిర్వహించడానికి కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
మొదటి విడత పనులను రూ.21 కోట్లతో 2008 జూన్‌లో మొదలుపెట్టారు. 2009 డిసెంబరుకు ఆ పనులను పూర్తి చేశారు. 6వేల అడుగుల రన్‌వే, ఆఫ్రాన్( విమానాలు నిలిచే చోటు), టాక్సీ వే తో పాటు 1060 ఎకరాల పరిధికి రక్షణ గోడ నిర్మించారు. రెండో విడత పనులను 2010 అక్టోబరు 10న చేపట్టారు. రూ. 13 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో టెర్మినల్ బిల్డింగ్ తో పాటు ఏటీసీ ( ఏయిర్ ట్రాఫిక్ సర్వీసు), పవర్ హౌస్, లింకు రోడ్డులు, కార్‌పార్కింగ్, సివిల్, ఎలక్ట్రికల్ పనులను చేపట్టారు.
టెర్మినల్ బిల్డింగ్‌తో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి.ఈ నిర్మాణం పూర్తైన తర్వాత కడప విమానాశ్రయం నుంచి 700 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుందని విమానాశ్రయ వర్గాలు చెపుతున్నాయి. టెర్మినల్‌కు దగ్గరలోనే కారుపార్కింగ్‌ను నిర్మించారు. ఇన్‌వే, అవుట్‌వే లింకు రోడ్లను పూర్తి చేశారు.
ఎయిర్ పెగాసస్ బెంగుళూరుకు వారానికి మూడుసార్లు ATR 72 సర్వీస్‌ను ప్రారంభించడంతో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2016లో ట్రూజెట్ హైదరాబాద్‌కు, ఆ తర్వాత విజయవాడకు విమాన సర్వీసులను ప్రవేశపెట్టింది. కడప ఎయిర్ పోర్టు నుంచి 70 మంది సామర్థ్యం ఉన్న విమానాలు మాత్రమే సర్వీసులు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఏషియా, అకాస ఎయిర్, అలయన్స్ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విమానయాన సంస్థలు కడప నుంచి విమానాలను నడుపుతున్నాయి
కడప వయా హైదరాబాద్ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్, రాజమండ్రి, రాయపూర్, ఇండోర్, జబల్‌పూర్, ముంబై, చండీగర్, వారణాసి, జైపూర్, సూరత్, రాంచీ, ఢిల్లీ కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్, మైసూరు, కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్, హుబ్లీ, లక్నో కు సర్వీసులు నడుస్తున్నాయి.
__ పిళ్లా కుమారస్వామి,9490122229

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి