కడప జిల్లా స్వాతంత్ర సమర యోధుడు కడపకోటిరెడ్డి

పదవులకు ప్రలోబాలకు అతీతంగా, నిస్వార్థ నిరాడంబర సేవలకు మారుపేరుగా వెలిగిన కడప కోటిరెడ్డి చిత్తూరు జిల్లా మదనపల్లె తాలూకాకు చెందిన కోటిరెడ్డి గారి పల్లెలోని మధ్యతరగతి రైతు కుటుంబంలో 1889 సెప్టెంబర్లో సిద్ధారెడ్డి నాగమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పల్లెలోనూ, హైస్కూలు చదువును మదనపల్లెలోనూ చదివారు. తరువాత మద్రాస్ క్రిష్టియన్ కాలేజీలో చదివి ఉన్నతశ్రేణిలో పట్టభద్రులయ్యారు.
"పూవు పుట్టుకతోనే పరిమళిస్తుంది'' అన్నట్లు కోటిరెడ్డిగారు చిన్నప్పటి నుంచే, చాలా చురుగ్గా ఉండేవారు. జాతీయ భావాలతో తొణికిస లాడుతూ, జాతీయ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయన దేశ సేవలో నిమగ్నమై ఉండేవారు. అంతేకాక, ఇష్టాగోష్ఠి సమావేశాలు జరుపుతూ ఆయన యువకులలో జాతీయ భావాలను మేలు కొలుపుతూ ఉండేవారు.
ఉన్నత విద్య కోసం 1911 లో లండన్ వెళ్లారు. అక్కడ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లా కోర్సు పూర్తి చేశారు. మిడిల్ టెంపుల్ నుండి బారిస్టర్ పట్టా పొందారు. స్వదేశానికి తిరిగి వచ్చాక 1914లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు.
ఆంధ్ర తిలక్ గా పేరొందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వంలో1916లో ''హోమ్ రూల్' ఉద్యమం రాయలసీమలో తీవ్రంగా ప్రారంభమైంది. కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు, గాజులపల్లె వీరభద్రరావు, కలచవీడు వెంకటరమణాచార్యులు మొదలైనవారితో కలిసి కోటిరెడ్డి ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
1917 జూన్ లో కడప జిల్లాకు చెందిన కొణదుల రామచంద్రారెడ్డి (జమీందార్) కుమార్తె రామసుబ్బమ్మగారిని పరిణయమాడారు.
హైకోర్టులో న్యాయవాదిగా చేరిన కొద్ది కాలానికే కోటిరెడ్డికి హైకోర్టు పదవి లభించింది. కానీ ప్రజా ఉద్యమాలకు, గాంధీ అహింసాసిద్ధాంతలకు ఆకర్షితులైన కోటిరెడ్డి వాటిని స్వీకరించలేదు.
1920లో అఖిల భారత కాంగ్రెస్ కమిటి ఆదేశానుసారం గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విధంగా దేశ దాస్య విముక్తిని సాధించాలని పిలుపు ఇచ్చారు. ఆ సందర్భంలో చాలామంది న్యాయవాదులు తమ వృత్తిని వదిలి సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగానే 1923లో కడప కోటిరెడ్డి న్యాయవాదవృత్తిని వదలి ప్రజాసేవారంగ ప్రవేశం చేశారు.
1922లో వారి 32వ ఏట మద్రాసు శాసనసభలో స్వరాజ్యపార్టీ ఉపనాయకులు గుత్తి కేశవ పిళ్ళై తో కలిసి శాసనసభలో 1927 నుండి 1929 వరకు పనిచేశారు. 1929లో స్వతంత్ర సభ్యులుగా, 1931లో పోటీలేకుండా ఎన్నుకోబడ్డారు.
1937లో కడప నియోజకవర్గం నుండి ఎన్నుకో బడినారు. అయినప్పటికీ 1939లో కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
1930లో ప్రజలు వాడుకొనే సహజమైన ఉప్పు పై ఈస్ట్ ఇండియా కంపెనీ పన్ను విధించింది. ఇప్పటి మన ప్రభుత్వాలు అన్నిటి పైన పన్ను వేస్తున్నాయి. అది వేరే విషయం అనుకోండి. ఆ పన్ను ను వ్యతిరేకిస్తూ గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. ఈ ఉద్యమం దేశమంతటా కారుచిచ్చులా వ్యాపించింది. రాయలసీమలో కూడా ఉప్పు సత్యాగ్రహం ముమ్మరంగా జరిగింది.
రాయలసీమ సముద్ర తీరానికి దగ్గరగా లేనందున విదేశీ వస్త్ర, బహిష్కరణ, విదేశీ వస్త్రలను దహనం చేయడం, కల్లు, సారా దుకాణాల ముందు పికెటింగ్, అరెస్టులు అధికంగా జరిగాయి. కె.సుబ్రహ్మణ్యంతో పాటు కోటిరెడ్డి దంపతులు ఉప్పుసత్యాగ్రహంలో ప్రముఖపాత్ర వహించారు.
రాయలసీమ కరువుకు పుట్టిల్లు. క్షామ నివారణ కోసం 1935లో కేంద్ర ప్రచారసంఘం ఏర్పడింది. ఆ సంఘంలోని గాడి చర్ల హరిసర్వోత్తమరావు కల్లూరు సుబ్బారావు, కలచవీడు వెంకట రమణాచార్యులు, కోటిరెడ్డి వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి బాధితులకు ఎనలేని సేవచేశారు. రాయలసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.
1937లో బెజవాడ(విజయవాడ)లో జరిగిన ఆంధ్రమహాసభ రజతోత్సవాలకు అధ్యక్షత వహించారు. రాయలసీమ ఆంధ్రరాష్ట్రంలో భాగంగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలని కృషి చేసినారు. పెద్దమనుషుల ఒప్పందం కింద రాయలసీమలో రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఏదో ఒక పట్టణంలో ఉండాలని, శాసనసభలో రాయలసీమకు సరియైన ప్రాతినిధ్యం ఉండాలని శ్రీ బాగ్ ఒడంబడికపై రాయలసీమ నాయకులు కోటిరెడ్డి సంతకం చేసినారు.
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు.
1946లో ప్రకాశం పంతులు గారి నేతృత్వంలో మద్రాసు మంత్రి వర్గంలో కోటిరెడ్డి దేవాదాయశాఖ మంత్రిగాను, అబ్కారి శాఖ మంత్రిగాను పనిచేశారు.
1952 జనరల్ ఎన్నికలలో తిరిగి కోటిరెడ్డి మద్రాస్శాసనసభకు ఎన్నికైనారు. 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రంలో తొలి ప్రభుత్వంలో రెవిన్యూమంత్రిగా పని చేశారు.
తరువాత 1957లో లక్కిరెడ్డిపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వీరు తిరిగి ఎన్నికైనారు. 1964 లో వీరు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు.
వీరు మద్రాస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలలో దీర్ఘకాలం సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రా, మద్రాస్ విశ్వవిద్యాలయాల సెనెట్ సభ్యులు. కోటిరెడ్ది ఎన్నికలలో ఎన్నడూ ఆపజయాన్ని ఎరుగరు. వీరు ఒకవిధంగా “శాసనసభ పిత" అని చెప్పాలి.
1968లోతన 79వ ఏట వీరు రాజకీయాల నుండి నిష్క్రమించారు.
కోటిరెడ్డి దాదాపు ఆరు దశాబ్దాలపాటు చేసిన రాజకీయ, సామాజిక సేవలకు గుర్తుగా కడప పట్టణ ప్రముఖులు సమర్పించిన కాంస్య విగ్రహాన్ని, భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1980 మార్చి నెల 15వ తేదీన కడప నడిబొడ్డులో ఆవిష్కరించారు.
సేకరణ: పిళ్ళా కుమారస్వామి,9490122229
(రాయలసీమ స్వాతంత్య్ర సమర చరిత్ర, స్వతంత్ర భారత సావనీర్ ఆధారంగా)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి