స్వాతంత్ర సమరంలో పాల్గొన్న కడప జిల్లాప్రజా నాయకులు
స్వాతంత్ర సమరంలో పాల్గొన్న కడప జిల్లా
ప్రజా నాయకులు
చరిత్ర లేనిదే ఏ జాతికి మనుగడలేదు. చరిత్ర తెలియని వారు చరిత్రను నిర్మించలేరు అన్నాడు అంబేద్కర్. గతానికి భవిష్యత్తుకు మధ్య జరిగే సంభాషణే చరిత్ర అన్నాడు ఈ. హెచ్. కార్. చరిత్రపైనే భవిష్యత్ నిర్మితమవుతుంది. అందుకే రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో
భారతదేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఉద్యమ నాయకుల గురించి, ముఖ్యమైన ఘట్టాల గురించి తప్పకుండా మనం తెలుసుకోవడం ద్వారానే రాయలసీమ చరిత్రను మరింత ముందుకు తీసుకోవడానికి వీలవుతుంది. పౌరుషవంతులు, లక్ష్యసాధనాపరులైన రాయలసీమ వాసుల త్యాగనిరతి, సేవాతత్పరత, దేశభక్తి భావన అందరికీ స్పూర్తిదాయకం కావాలి.
దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. పోరాటంలో పాల్గొనే ప్రజలకు నాయకత్వం వహించిన నాయకులు అనేక త్యాగాలను చేశారు. వారి త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛా భారతావనికి మూలధనం. బెంగాల్ విభజన తర్వాత స్వాతంత్ర్య సమరాన్ని జోరుగా సాగించిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ కు దక్కుతుంది.
రాయలసీమలో ఈ ఉద్యమం ఉధృతంగా సాగింది. కొన్ని వేల మంది అనేక త్యాగాలు చేసినారు.అందులో ప్రప్రధమ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి.
అప్పటి కడప జిల్లా ప్రధాన కార్యాలయం మొదట సిద్ధవటంలో ఉండేది. 1812లో దాన్ని కడప పట్టణానికి మార్చారు. రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలో కడప జిల్లా ప్రజలు స్వాతంత్ర పోరాటంలో ముందుండి పోరాడారు.
ఎల్లంపేట కు చెందిన షేక్ పీర్ షా 30వ రెజిమెంట్ సిబ్బందిని అధికారులను సిపాయిలు తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొనమని ప్రోత్సహించినందుకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఆగస్టు 1857లో అనుభవించాడు.
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920లో గాంధీ ప్రారంభించాడు.ఇదొక సామూహిక ఉద్యమం. ఇది భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత మరియు అహింసాత్మక నిరసన. ఈ ఉద్యమంలో చాలామంది తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసినారు.
1921 మార్చిలో అఖిలభారత కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఆ సందర్భంలో
సత్యాగ్రహ సమరంలో కడప జిల్లా ప్రజలు విరివిగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో ఎందరో న్యాయవాదులు పాల్గొన్నారు. వారిలో ముఖ్యులు కడప కోటిరెడ్డి. రాజంపేటకు చెందిన ప్రతాపగిరి రామ్మూర్తి, అన్నవారిపల్లెకు చెందిన గాజులపల్లి వీరభద్రరావు ఈ ఉద్యమంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు.
1930-32 సంవత్సరాలలో ఉప్పు సత్యాగ్రహం ఆంధ్ర దేశాన్నంతా వుర్రూతలూగించింది. ఉప్పును గుప్పెట్లో బిగించి ఎందరో పోలీసుల లాఠీ దెబ్బలకు వెరువక ఉద్యమాన్ని నడిపారు.
రాజంపేటకు చెందిన కీర్తిపతి చంగల్ రాజు, చామర్తి గంగరాజు, ఎస్ కృష్ణయ్య, సాకల్య కృష్ణయ్య, గంగరాజు రోషిరాజు , కడపకు చెందిన లక్కు గంగిరెడ్డి, చామర్తి నారాయణరాజు, కే సుబ్రహ్మణ్యం, గంగరాజు వెంకట సుబ్బరాజు, శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనందున నాలుగు నెలల నుండి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష అనుభవించారు. రాజంపేటకు చెందిన కొండూరు చంగల్ రాజు, కొండేటి మంగయ్య, రసరాజు సుబ్బరాజు రాఘవ రాజు సుబ్బరాజు అటవీ సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు నాలుగు నెలల శిక్షకు గురయ్యాడు. కడపకు చెందిన మంబలం రంగయ్య నాయుడు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యారు.
1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. యుద్ధ వ్యతిరేక నినాదాలు ప్రతి చోట మిన్నంటాయి. ఈ సందర్భంగా ప్రొద్దుటూరుకు చెందిన కేతు బాలసురారెడ్డి, రాజంపేటకు చెందిన సరసా చెంచయ్య , పులివెందులకు చెందిన కుమ్మర గంగిరెడ్డి,, కడపకు చెందిన మరుపు రెడ్డి గురునాథ శర్మ ప్రొద్దుటూరు కు చెందిన డి కేశవ వర్మ, జమ్మలమడుగు కు చెందిన నూకల కొండయ్య, కడపకు చెందిన ఎం ఆర్ మనీ అయ్యర్ జమ్మలమడుగు కు చెందిన కే నాగరాజా రెడ్డి ,స్వర్ణ నాగయ్య, ఎంసీ నరసింహారెడ్డి, పులివెందుల కు చెందిన ఎద్దుల నారాయణరెడ్డి సిద్ధవటానికి చెందిన తాండ్ర పెరం నాయుడు కడప జిల్లాకు చెందిన బి పిచ్చయ్య నాయుడు కడపకు చెందిన ఎస్ సుబ్బరాజు శెట్టి రాజంపేట కు చెందిన పుత్తన సుబ్బరామిరెడ్డి జమ్మలమడుగు కు చెందిన భూలాపురం సుబ్బరామ శ్రేష్ఠి రాజంపేటకు చెందిన రామాయణం తిరుపాలయ్య అమలాపురానికి చెందిన వెలుగోటి వెంకట్రెడ్డి రాజంపేట కు చెందిన చక్రవాళి వెంకట శేషాచార్యులు పులివెందులకు చెందిన అలవలపాటి వీరారెడ్డి కడపకు చెందిన ఎద్దవల్లి ఎల్లారెడ్డి1941లో యుద్ధ వ్యతిరేక నినాదాలు చేసినందుకు మూడు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు ఒక్కొక్కరు జైలు శిక్ష అనుభవించారు. 1940లో చెన్నూరు రైల్వే క్రాస్ లైన్ ను ధ్వంసం చేసినందుకుగాను పెద్దపల్లి బాలయ్య రెడ్డిని అరెస్ట్ చేశారు. 1942లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని నిషేధ సాహిత్యాన్ని అచ్చు వేసి పంచినందుకుగాను రెండు సంవత్సరాలు జైలు శిక్షను కడపకు చెందిన ద్రాక్ష చిన్నగురుమూర్తి అనుభవించారు.
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయిన తరువాత 1940లో ప్రభుత్వం అవలంభించిన నిర్బంధ యుద్ధ నిధి వసూళ్ళను జిల్లాలోని కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు అయిన యువకులు వ్యతిరేకించారు. పెద్ద పసువులు గ్రామలలో యుద్ధ నిధి వసూలును ప్రతిఘటించిన ఎనిమిది మంది యువకులపై ఆర్.డి.ఓ. అక్రమ కేసులు బనాయించారు.
యుద్ధకాలంలో స్వతంత్ర భారత్ పత్రికను కాంగ్రెస్ పార్టీలో ఎద్దుల ఈశ్వర్ రెడ్డి,సంగమేశ్వర రెడ్డి మొదలైన వారు అతివాద వర్గం (వీరే తర్వాత కమ్యూనిస్టు పార్టీలో సభ్యులు)గా ఉండేవారు. వీరు
అంకాళమ్మ గూడూరు, పెద్ద పసువుల, ఆలంఖాన్ పల్లె మొదలైన గ్రామాలలోని యువకులకు రహస్యంగా అందించేవారు. 1940లో అంకాళమ్మగూడూరుకు స్వతంత్ర భారత్ ను పంపిణీ చేస్తున్న సందర్భంలోనే సంగమేశ్వర రెడ్డి, పొన్నతోట వెంకటరెడ్డి, గజ్జెల మల్లారెడ్డిలతో కలిసి పనిచేశారు.
భిన్నాభిప్రాయాలను అణిచివేసేందుకు, భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ , సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కుతో సహా ప్రాథమిక హక్కులను పరిమితం చేస్తూ బ్రిటీష్ ప్రభుత్వం 1941లో ఆర్డినెన్స్ జారీచేసింది.
ఈ నేపథ్యంలో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో ప్రతి ప్రాంతం నుండి కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే అహింసాత్మక ప్రతిఘటన ప్రచారంలో పాల్గొంటారు. 1941లో జరిగిన ఈ వ్యక్తి సత్యాగ్రహం లో పులివెందులకు చెందిన వైబి కొండారెడ్డి, దూదేకుల హుస్సేన్ సాహెబ్, కుమ్మర గంగిరెడ్డి, చావా బాల్రెడ్డి ,పి బసిరెడ్డి , సారెడ్డి అశ్వత్థ రెడ్డి, రాచమల్లు అంకిరెడ్డి, రాజంపేటకు చెందిన నారు నాగరార్య , ఆకేపాపాటి గంగిరెడ్డి , బాల నారాయణరెడ్డి,కేతు బాలసురారెడ్డి, చామర్తి చంగల్ రాజు, దాసరాజు చెంగల్ రాజు , సరసా చెంచయ్య, దాసరాజు చెంచు రామరాజు , చేకూరు అయ్యప్ప శెట్టి , జమ్మలమడుగు కు చెందిన నూకల కొండయ్య, జానపాటి నడిపి సుబ్బయ్య, కె నాగరాజా రెడ్డి, వై ఈశ్వర్ రెడ్డి, శెట్టిపల్లి బాలమద్ది, బి బాల వెంకట సుబ్బరాయుడు, ప్రొద్దుటూరు కు చెందిన భూపతి కృష్ణమూర్తి, రాపుల మునిరెడ్డి, డి కేశవ వర్మ ,కాటిగారి చిన్న నర్సప్ప, కడపకు చెందిన మరుపురెడ్డి గురునాథ శర్మ, డి కొండయ్య రాజు రాయచోటి బాలసుబ్బయ్య, కమలాపురానికి చెందిన కొప్పరపు గంగిశెట్టి, ప్రొద్దుటూరు కు చెందిన ఆర్ నాగరాజవరం శర్మ నాగిరెడ్డి , జమ్మలమడుగు కు చెందిన స్వర్ణ నాగయ్య, కడపకు చెందిన నాగిరెడ్డి, గంగిరెడ్డి నాగిరెడ్డి, జమ్మలమడుగు కు చెందిన ఎంసీ నాగిరెడ్డి, రాజంపేటకు చెందిన కీర్తిపాటి నరసరాజు అంకిరెడ్డి, ఏ.బి. నర్సారెడ్డి, పులివెందులకు చెందిన ఆరవేటి నరసయ్య చెట్టి, జమ్మలమడుగు కు చెందిన ఎంసీ నర్సింహారెడ్డి రాజంపేట కు చెందిన పంజం నరసింహారెడ్డి, రంగారి నరసింహులు, చామర్తి నారాయణ రాజు, పులివెందులకు చెందిన అధ్యకట్టు నారాయణరెడ్డి, ప్రొద్దుటూరు కు చెందిన బి నారాయణ రెడ్డి, పులివెందులకు చెందిన కొప్పాల నారాయణరెడ్డి, కమలాపురం కు చెందిన కాట్లూరు నారాయణరెడ్డి జమ్మలమడుగు కు చెందిన మడతల నారాయణరెడ్డి కమలాపురం కు చెందిన వెలుగోటి నారాయణరెడ్డి, కడపకు చెందిన గజ్జల ఓబయ్య జమ్మలమడుగు కు చెందిన కల్లూరు ఓబుల్ రెడ్డి, ప్రొద్దుటూరు కు చెందిన ఎస్ పంపావతి శాస్త్రి, రాజంపేటకు చెందిన పివి పట్టాభిరామిరెడ్డి జమ్మలమడుగు చెందిన కంభం పెద్ద నరసింహ శెట్టి, ప్రొద్దుటూరు కు చెందిన మద్దాల పెద్దన్న శెట్టి, జమ్మలమడుగు కు చెందిన సానా పెద్దసూరారెడ్డి, పులివెందులకు చెందిన అలవలపాటి పెద్ద వీరారెడ్డి, రాజంపేటకు చెందిన నాగ పెద్దిరెడ్డి, సిద్ధవటం కు చెందిన తాండ్ర పెరమనాయుడు, కమలాపురం కు చెందిన తిప్పలూరు పిచ్చయ్య నాయుడు, కడపకు చెందిన బీ పిచ్చయ్య నాయుడు, జమ్మలమడుగు కు చెందిన టి పుల్లారెడ్డి, పులివెందులకు చెందిన డి రామకృష్ణారెడ్డి ,దేవి రెడ్డి రామకృష్ణారెడ్డి , జమ్మలమడుగు కు చెందినవినాయక రామకృష్ణయ్య శెట్టి , రాజంపేట కు చెందిన రాఘవ రాజు రామలింగరాజు, బద్వేల్ కు చెందిన బొమ్ము రామారెడ్డి, పులివెందులకు చెందిన డి. రామసుబ్బారెడ్డి , బద్వేలు కు చెందిన సోమేశుల రామయ్య, పులివెందులకు చెందిన కదిరి రామిరెడ్డి, ప్రొద్దుటూరు కు చెందిన ప్రబంధము రంగాచార్, సింగనమల రంగప్ప, కడపకు చెందిన ఎన్ రంగారెడ్డి, జమ్మలమడుగు కు చెందిన శెట్టిపల్లి శాంతా రెడ్డి, రాజంపేటకు చెందిన వి ఆర్ సత్యనారాయణ, సానిశెట్టి సత్యనారాయణ గుప్తా, సిద్ధవటం కు చెందిన వీణ శేషమ్మ, కమలాపురం కు చెందిన మోపురి శేషారెడ్డి, జమ్మలమడుగు కు చెందిన షేక్ నబీ రసూల్ సాహెబ్, పులివెందులకు చెందిన రాయి పెద్ది సీతారామయ్య, బద్వేల్ కు చెందిన ఎస్. శివారెడ్డి, రాజంపేట కు చెందిన చిట్ల సోమయ్య , ఎస్ సుబ్బరాజు, లామర్తి సుబ్బరామరాజు, పుత్తన సుబ్బరామిరెడ్డి, కమలాపురం కు చెందిన పొట్లదుర్తి సుబ్బారావు, కడపకు చెందిన సిరా సుబ్బారావు, జమ్మలమడుగు కు చెందిన భూలాపురం సుబ్బరామశాస్త్రి, అరవేటి సుబ్బరాయుడు, ప్రొద్దుటూరు కు చెందిన సుంకు సుబ్బరాయుడు, అన్నవరం సుబ్బారెడ్డి, సిద్ధవటంకు చెందిన నాగిరెడ్డి సుబ్బారెడ్డి , ప్రొద్దుటూరు కు చెందిన పుట్ట సుబ్బారావు , రాజంపేటకు చెందినఎల్లా సుందర రామిరెడ్డి, జమ్మలమడుగు చెందిన సయ్యద్ రసూల్ సాహెబ్, రాజంపేటకు చెందిన జొన్న తంబయ్య శెట్టి , రామాయణం తిరుపాలయ్య, తలవంచి వెంగల్రెడ్డి, పులివెందులకు చెందిన సింహం వెంగయ్య నాయుడు, తుమ్మలూరు వెంకట కొండారెడ్డి , బద్వేలకు చెందిన ముచ్చట్ల వెంకటనారాయణ గుప్త, కమలాపురం కు చెందిన ఎద్దుల వెంకటనారాయణ రెడ్డి , రాజంపేటకు చెందిన వెంకట్రాయి శర్మ, జమ్మలమడుగు కు చెందిన బి వెంకట్ రెడ్డి , కమలాపురం కు చెందిన వెలుగోటి వెంకట్రెడ్డి, రాజంపేటకు చెందిన చక్రవాళి వెంకట శేషాచార్యులు, కడపకు చెందిన వి వెంకట సుబ్బానాయుడు, రాజంపేటకు చెందిన డి వెంకట సుబ్బరాజు, అక్కపాటి వెంకటసుబ్బారెడ్డి, కడపకు చెందిన వి వెంకట సుబ్బానాయుడు, రాజంపేటకు చెందిన డి వెంకటసుబ్బరాజు, చింతు వెంకటసుబ్బారెడ్డి, గణపతి వెంకటసుబ్బారెడ్డి, కమలాపురం కు చెందిన ఎద్దుల వెంకటసుబ్బారెడ్డి ,
ప్రొద్దుటూరు కు చెందిన ఎస్ వెంకటసుబ్బయ్య, రాజంపేట కు చెందిన ఓనమాల వెంకటసుబ్బయ్య, కొత్తపల్లి వెంకటస్వామి , బద్వేల్ కు చెందిన మేకపాటి వెంకటస్వామి గుప్తా , జమ్మలమడుగు కు చెందిన మేడ వెంకయ్య, పులివెందులకు చెందిన అలవలపాటి వీరారెడ్డి, కే వీరారెడ్డి, కడపకు చెందిన పి వీరారెడ్డి ఎద్దబల్లి ఎల్లారెడ్డి మొదలైన వారు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వీరంతా జైలు శిక్ష కూడా అనుభవించారు.
1942 ఆగస్టులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం"క్విట్ ఇండియా" తీర్మానం చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు. జమ్మలమడుగు చెందిన బి బాల వెంకట సుబ్బరాయుడు , శెట్టిపల్లి బాలమద్ది, కడపకు చెందిన ఎస్ లక్ష్మయ్య, రంతు గోపాల్, ఏ బలరామిరెడ్డి, తాడిపత్రి జన్మస్థలమైనప్పటికీ కడపలో నివసించిన చందనం వెంకోబరావు, పులివెందులకు చెందిన ఆల్వాలపాటి బాల వీరారెడ్డి , నల్ల పల్లె గంగిరెడ్డి, డి రామకృష్ణారెడ్డి, చావా బాల్రెడ్డి, చవ్వా రామిరెడ్డి అలియాస్ రాములు, సుంకు సుబ్బరాయలు అలియాస్ రామసుబ్బయ్య, వాజిరెడ్డి సుబ్బారెడ్డి, బండి వెంకట్రామిరెడ్డి, సింహాద్రి పురానికి చెందిన పిళ్లా వెంకట్రామిరెడ్డి , సంకటి వెంకట్ రెడ్డి ,బద్వేలుకు చెందిన గోపవరం బొమ్మిరెడ్డి రాయచోటికి చెందిన టి చంద్రశేఖర్ రెడ్డి, కమలాపురానికి చెందిన మచ్చనూరు నారాయణరెడ్డి, బంగారు గండెన్న అలియాస్ గండ రాయుడు, కొప్పరపు గంగిశెట్టి, ఉలపాల చెన్నప్ప, మేడ నాగిశెట్టి, బండి మల్లారెడ్డి, సారెడ్డి చిన్న ఓబుల్ రెడ్డి, తుమ్మల పడగాల రెడ్డి, నా రెడ్డి శెంబురెడ్డి , బీపీ సంజీవప్ప,పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డి పల్లెకు చెందిన ఎస్.పి. గంగిరెడ్డి, జమ్మలమడుగు చెందిన రాజోలి జయరామిరెడ్డి , రాజోలి శివారెడ్డి, బాన కంబుగిరి, బి.మద్దయ్య, వర్రా రాములయ్య, ఎన్ సంగమేశ్వర రెడ్డి, కర్ణాటక రంగారెడ్డి, పోకట శేషారెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన గాడిచర్ల మధ్య ముని రావు, రాయచోటికి చెందిన హర్దగిరి నరసమ్మ, వ్యక్తి బద్వేల్ కు చెందిన తుంగ పెద్ద సుబ్బారెడ్డి, సోమేశుల రామయ్య, సిద్ధవటానికి చెందిన వీణ శేషమ్మ, అమలాపురానికి చెందిన ఎర్ర వెంకటస్వామి బద్వేలుకు చెందిన మేకపాటి వెంకటస్వామి గుప్తా జమ్మలమడుగు చెందిన గుండాల వెంకటేష్ ,మేడా వెంకయ్య మొదలైన వారు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వీరంతా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు.
1943 లో కమ్యూనిస్టులు పెద్దఎత్తున ప్రజా ఉద్యమ నిర్మాణం చేపట్టారు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నెలకొల్పినారు. అదే కాలంలో కమ్యూనిస్టులు సాంస్కృతిక సంఘాలను కూడా
నెలకొల్పారు. అభ్యుదయ సిద్ధాంతాలను పాటలద్వారా ప్రచారం చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులనుండి సంపూర్ణ స్వరాజ్యాన్ని, ఫ్యూడల్ వ్యవస్థ నిర్మూలన కోసం, ముఖ్యమైన కర్మాగారాలను జాతీయం చేయాలని కోరారు. కడప జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖంగా పనిచేసిన ఎద్దుల ఈశ్వర రెడ్డి అందరిలో ప్రముఖుడు.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
(సిహెచ్ ఆచార్య రాసిన రాయలసీమ స్వాతంత్ర సమర చరిత్ర, ఆంధ్రప్రదేశ్ దర్శిని, వికీపీడియా ఆధారంగా)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి