పోస్ట్‌లు

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాలు

*AP: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..*  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది.  ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది.  26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో  గెజిట్‌ . ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.  *కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..* 1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం 2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం 3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ 4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం 5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం 6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,  7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ 8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) 9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు 10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త) 11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు 12. కృష్ణా : గుడివాడ,...

సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు

సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు  తెలుగు ప్రజలు జరుపుకునే వ్యవసాయసంబంధ పండుగ సంక్రాంతి. రాయలసీమ ప్రాంత ప్రజలైన కదిరి ప్రజానీకం కూడా ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని భావించే రోజును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చిన సందర్భంలో ఇది రైతులు చేసుకునే ఆనందోత్సాహాల పండుగ. ఈ పండుగకు  అల్లుళ్ళను పిలిచి మర్యాదలు చేయడం ఒక ఆనవాయితీ గా ఉంది. సంక్రాంతికి ముందు రోజును భోగి పండుగ అంటారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృ ద్ధిగా ఇళ్లకు వచ్చే కాలమిది. రెండో రోజును సంక్రాంతిగా, పెద్దలు పండుగగా, మూడో రోజును కనుమ పండుగ లేదా పశువుల పండుగగా జరుపుకుంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 14 న జరుపుతారు. భోగి రోజున తెల్లవారక ముందే కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభ మవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభించాలని మనసులో నిర్ణయించుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానాలు చేసి ప్రతి ఇంట...

రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?

రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?       1928 వరకు 'రాయలసీమ' అనే పదమే వాడుకలో లేదు. 1928 వరకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను దత్త మండలాలు (సీడెడ్ డిస్ట్రిక్ట్) అని వ్యవహరించేవారు.  'అభిషిక్త రాఘవం'లో నడిమింటి వెంకటపతి మొదటి సారిగా 'రాయలసీమ' పదాన్ని వాడారని శ్రీ రావినూతల రామారావు గారు (గుత్త కేశవ పిళ్లై జీవిత గాథలో) రాశారు. ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన కీర్తి ప్రధానంగా హరిసర్వోత్తమ రావు గారికి దక్కుతుంది. 1800 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు తనకు బ్రిటిష్ వారు సహాయం చేశారన్న కారణంతో  ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్తత ఇచ్చాడు. అందువల్ల ఈ జిల్లాలను దత్త మండలాలని అనేవారు. దత్త మండలాలు అని పిలిపించుకోవడం అగౌరవంగా భావించిన క నాయకులు 1928 నవంబరు 18వ తేదీన నంద్యాలలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన సభ జరిగిన సభలో ఈ ప్రాంతాన్ని 'రాయలసీమ ' అని పిలుచుకోవాలని తీర్మానించారు.  గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారు దీనిని ప్రతిపాదించారు.   రాజమండ్రి వ్యవస్థాపకులలో ఒకరైన చిలుకూరి నారాయణరావు  గారు సైతం ఈ సభలో పాల్గొన్నారు. 15వ, 16వ శతాబ్దాలలో విజయనగర పాలకులు నిర్మించిన నీటి వనరు...

బహుముఖ ప్రజ్ఞాశాలి డా|| ఎం.వి.రమణారెడ్డి

చిత్రం
బహుముఖ ప్రజ్ఞాశాలి డా|| ఎం.వి.రమణారెడ్డి                                 ఎం.వి.రమణారెడ్డిగా, ఎం వి ఆర్ గా ప్రసిద్ది పొందిన మల్లెల వెంకట రమణారెడ్డి ప్రొద్దుటూరు లో ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో 4.3.1944 లో మల్లెల వెంకటమ్మ, ఓబుల్ రెడ్డి దంపతులకు జన్మించారు.ఆయన జీవితం వైవిధ్య భరితం గా సాగింది. ఆయన గుంటూరు లో యం. బి.బి. ఎస్ చదివాడు. డాక్టరు గా పనిచేశాడు. యల్. ఎల్. బి. కూడా చదివాడు. కొంతకాలం లాయారుగా కూడా పనిచేశాడు.ప్రొద్దుటూరులో డాక్టర్ గా ప్రాక్టీసు ప్రారంభించి  పేదలకు ఉచితంగా వైద్యం చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలో అనేక మంది కార్మికులు ఆయన దగ్గరికి రావడం, వారు తాను రాయించిన మందులు కూడా కొనుక్కోలేని స్థితిని గమనించి, వారి పేదరికాన్ని చూసి చలించి పోయాడు. ఆ క్రమంలో  వారికి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ విధంగా ఆయన కార్మిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు.చదువుకునే రోజుల్లో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. అలా అతను రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. అటు తర్వాత ఎన్నో రచనలు చేసి సాహితీవ...

సన్ టెంపుల్స్

సన్ టెంపుల్, గనీ గ్రామం: సూర్య దేవాలయాలు భారతదేశంలో అరుదు. కోణార్క్ సూర్య దేవాలయం మొదటిది, ఆర్సేవల్లి సూర్య దేవాలయం – శ్రీకాకుళం జిల్లా రెండవది మరియు గని గ్రామంలో ఉన్న 3 వ సూర్య టెంపుల్, గరుదిమ్మల మండలం, కర్నూలు జిల్లా 400 సంవత్సరాల పురాతనమైన సూర్య దేవాలయంగా పరిగణించబడుతుంది. చారిత్రాత్మక శాసనాల ప్రకారం, గురు రాజా ఆచార్య స్వామి ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించారు, సూర్యదేవుని యజ్ఞం ఒక్క గ్లాసు పాలు మరియు రెండు అరటి రోజులు యజ్ఞం యొక్క పూర్తి కాలం వరకు తీసుకువెళ్లారు. చివరికి సూర్యుడు లార్డ్ ఉనికిలోకి వచ్చాడు మరియు సన్ విగ్రాంమ్ను ప్రత్యేక స్థాన స్థానాలలో నిలువరించమని ఆదేశించాడు. అప్పుడు ఈ ఆలయం వాస్తు ప్రకారం మొదలైంది. నిర్మాణ సమయంలో, ఒక పెద్ద పాము వచ్చింది మరియు ప్రజలు పాములు అతిపెద్ద ఆకారం యొక్క భావోద్వేగ భావాలు గురించి ఆందోళన. ఆందోళనతో దృష్టిలో ఉన్న కార్మికుడు పామును చంపాడు. గురు రాజా చారీ యొక్క కలలో, పాము నన్ను చంపడం ద్వారా నా పాపను చూశానని పాపం హెచ్చరించింది, మగ శిశువు ఉండదు మరియు ఆలయం కొంతకాలం పాడైపోతుంది. ఆ ఆకారం ఫలితంగా గానీ గ్రామంలోని సూర్య ఆలయం పునరుద్ధరణకు వెళ్తుంది. చారిత్రక శాసన...

Bommanahaḷḷi inscription of Sōmēśvara I

చిత్రం
Bommanahaḷḷi inscription of Sōmēśvara I This office received photograph of this inscription from Mr. N. C. Prakash, Dy. S. A. (Retd.), engraved on a slab kept at the premises of Virupāksha temple at Bommanahaḷḷi, Bellary District,Karnataka. It is written in Kannaḍa language and characters issued during the reign of Sōmēśvara I of Kalyāṇi Chāḷukya dynasty, dated Śaka 971, Virōdhi, śu. 5, corresponding to 1049 A. D., June 8. It records the gift of land and _gadyāṇas_ for offering food to the god Daṇḍēśvaradēva by Bammiyabbarasi. Further it records the gift of tax probably for the maintenance of a alms house by _mahāmaṇḍalēśvara_ Satyaśrāya.

వేమన గొప్ప హేతువాదం, హేతుబద్ధత.

————————————————————————————— వేమనను కేవలం శతక కర్తగానే చూపించి ఆయన స్థాయిని తగ్గించారు. ఇదే వేమన వేరే దేశంలో ఉండిఉంటే గొప్ప తత్వవేత్తగా గుర్తింపు పొందేవాడు. లేదా బ్రాహ్మణ కులంలో జన్మించి ఉంటే గొప్ప సంస్కర్తగా కొనియాడబడేవాడు.. 1. మతాలు మంచే చెబుతుండవచ్చు  కానీ మతబోధకులు దొంగలంటాడు వేమన.  ఆరు మతములందు నధికమైన మతంబు లింగమతము కన్న లేదు భువిని లింగదార్ల కన్నా దొంగలు లేరయా విశ్వదాభిరామ వినుర వేమ. మతము వేషధార్లు మహిమీద పదివేలు. మూఢజనుల గలప మూగుచుండ్రు  కొంగలు గుమికూడి కొరకవా బోదెలు  విశ్వదాభిరామ వినుర వేమ.  2.  ఆత్మశుద్ది ముఖ్యం కానీ పూజలు ముఖ్యం కాదంటాడు... ఆత్మశుద్ది లేని ఆచార మదియేల  భాండ శుద్దిలేని పాకమేల  చిత్తశుద్ధి లేని శివపూజలేరా  విశ్వదాభిరామ వినుర వేమ  3.  పిండములను పెట్టడం గురించి.... పిండములను జేసి పితరుల తలబోసి  కాకులకు పెట్టు గాడ్దెలారా  పియ్యి తినెడు కాకి పితరుడెట్లాయెరా  విశ్వదాభిరామ వినుర వేమ.  4. జీవులను చంపి మనిషి అనే జీవి తింటే ఒళ్ళు వస్తుంది కానీ మోక్షం ఎలా వస్తుంది అంటాడు మరో పద్యంలో.. జీవి జీవి చ...