రేనాటి చోళులే రాయలసీమ నేలిన ప్రథమ రాజులు
రేనాటి చోళులే రాయలసీమ నేలిన ప్రథమ రాజులు రేనాడు అని వ్యవహరింపబడిన నేటి వైఎస్ఆర్ నాటి కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, నాటి చిత్తూరు జిల్లా నేటి రాయచోటి జిల్లాలోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలను కలిపి రేపాడు అని పిలిచేవారు.ఈ రేనాటి సీమను ధనుంజయుడు పాలించినట్లు శాసనాలు లభించాయి.మొదట రేనాటి సీమ 7,000 గ్రామాల పరిధిలో ఉండింది. మొట్ట మొదట తెలుగుభాషలో శాసనాలు వేయించిన కీర్తి రేనాటిచోళులకే దక్కింది. రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్ అయి ఉండొచ్చునని లభించిన శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధారించారు.ఈ రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని భావిస్తున్నారు. ఇతను తొలుత ఎరికల్ అంటే నేటి ఎర్రగుడిని రాజధానిగా చేసుకుని పరిపాలించి ఉండొచ్చునని శిలాశాసనాల ఆధారంగా భావిస్తున్నారు. ఎరికల్ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. 7వ శతాబ్దంలో...