పోస్ట్‌లు

రాయలసీమలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు

రాయలసీమలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు  “కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్ ఇది కడప గురించి చెప్పబడ్డా, మొత్తం రాయలసీమకు అన్వయించవచ్చు.  కృష్ణా, పెన్నా నదులే కాక అనేక నదులు రాయలసీమ జిల్లాల ద్వారా ప్రవహిస్తున్నాయి. కృష్ణా నది - కృష్ణవేణి - నల్లని నది - నల్లని జడ - కృష్ణ(కణ్ణ) వెణ్ణ(వేణి) నదుల సంగమం -   నల్లరేగడి భూముల మీదుగా ప్రవహించునది. శ్రీశైలం వద్ద ఆనకట్ట కట్టబడింది.  తుంగభద్ర - తుంగ నది , భద్ర నది కలయిక వలన ఏర్పడినది - కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది. మల్లాపురం వద్ద తుంగభద్ర బ్యారేజీ ఉన్నది. ప్రసిద్ద  క్షేత్రమైన మంత్రాలయం వద్ద ఈ నది రాయలసీమలో ప్రవేశించి ఆలంపూర్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.  పాపాఘ్ని - పాపాలను దహించునది - పెన్నా నదికి ఉపనది - వేంపల్లి వద్ద పాపాఘ్ని తీరంలోనే  గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ప్రసిద్ద శైవ క్షేత్రం వీరపునాయుని పల్లె వద్ద  కల సంగమేశ్వర ఆలయం కూడా పాపాఘ్ని తీరాన ఉన్నది. పెన్నా -ఉత్తర  పినాకిని - పినాకిని అంటే పినాక నుండి ఉద్భవించింది అని అర్థం. శివుని ధనస్...

అనంతప్రజాగాయకుడు లక్ష్మీనారాయణ

చిత్రం
అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన పోలప్ప నారాయణమ్మల కుమా   రుడు. 1999లో భారత జన విజ్ఞాన సమతి  ఆధ్వర్యంలో ప్రభుత్వం గతంలో నిర్వహించిన అక్షర దీక్ష కార్యక్రమం ద్వారా పరిచయమైన కంచు కంఠం పాటలద్వారా - చదువు ఆవశ్యకతను చైతన్యాన్ని కలిగించాడు.   ఇతని గళం... గర్జించే మేఘం!   ఇంటర్మీడియేట్ తో  చదువు ఆపేశాక అమ్మకు కిడ్నీ దెబ్బతినడంతో ఇల్లు గడవడం కష్టమైంది. అప్పుడు ప్రజా వైద్యశాలలో దినకూలీగా పనిచేస్తూ ఓ వైపు ఇంటిని పోషించుకుంటూ మరోవైపు నాటకాలు, పాటలలో ఆసక్తి చూపాడు. ఆరవ తరగతి నుంచే సామాజిక, సందేశాత్మక నాటకాలలో  తన ప్రతిభను నిరూపించుకున్నారు. పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా లక్ష్మినారాయణ ప్రార్థనాగీతంపాడందే సభ లేదంటే అతిశయోక్తి కాదు.  పాఠశాలలోపద్మనాభం అనే తెలుగు పండితుని ప్రోత్సాహంతో పాటలలో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. చదవాలిరా.. ఎన్ని ఆటంకాలు వచ్చినా.. అనే పాటను పాడి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు.  సినిమా పాటల కంటే సామాజిక, అభ్యుదయ గీతాలు పాడటానికే ఎక్కువ ఆసక్తి చూపే లక్ష్మీనారాయణ ప్రస్తుతం ప్రజానాట్య మం...

అనంత సాహితీ కర్షకుడు కల్లూరు రాఘవేంద్రరావు

చిత్రం
                      కల్లూరు రాఘవేంద్రరావు తల్లిదండ్రులు కల్లూరు అహోబలరావు,సీతమ్మ దంపతులు. అహోబలరావు ఉపాధ్యాయులు గా కళ్యాణదుర్గం లో పనిచేస్తున్న సందర్భం లో రాఘవేంద్రరావు 1.6.1946లో ఎనిమిదవ సంతానంగా అక్కడే జన్మించారు.కానీ వీరి కుటుంబ మూలాలు మాత్రం కల్లూరు గ్రామంలో ఉన్నాయి. తన తండ్రి అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. హైస్కూలు విద్యను హిందూపురంలో పూర్తి చేశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ డిగ్రీ పొందారు. 1966లో హిందూపురంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే లేపాక్షి మండలంలోని సిరిపురం లో , తదనంతరం 1969లో హిందూపురంలో కూడా పనిచేశారు. 1974లో హిందూపురం మున్సిపాలిటీ అయిన తర్వాత అక్కడే 1998 వరకు వివిధ మున్సిపల్ పాఠశాలల్లో పని చేశారు. 1999లో  ప్రధానోపాధ్యాయుని గా పదోన్నతి పొందారు. 2004లో పదవీ విరమణ పొందే వరకు రహమత్ పురం లో పని చేసేవారు. అహోబల రావు కవి కావడం వల్ల తన కుమారుడు రాఘవేంద్ర రావును కూడా సాహిత్య కారునిగా మారడానికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని ఇచ్చారు . దా...

జిల్లాలో వికసించిన ప్రబంధ, ఆధ్యాత్మిక సాహిత్యం

చిత్రం
                           ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసినపుడు 16వ శతాబ్దంలో వసు చరిత్ర రాసిన రామరాజ భూషణుడు కొంతకాలం పెనుకొండలో నివసించినట్లుచారిత్రక ఆధారాలున్నాయి. వసుచరిత్రలో ఆయన వర్ణించిన కోలాహల పర్వతమే పెనుకొండ అనీ, సుక్తిమతీనదే చిత్రావతి నది అని చెపుతారు.          17వ శతాబ్దంలో పాఠకులకు ఆసక్తి పెంచే 'శుకసప్తతి' కథా కావ్యాన్ని రాసిన 'పాలవేకరి కదిరీపతి' ఈ జిల్లాలోని కదిరి ప్రాంతం వాడనేందుకుచారిత్రక ఆధారాలున్నాయి. ఈ కావ్యంలో ఆనాటి సామాజిక పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తాయి.    అదే 17వ శతాబ్దంలోనే సమాజంలోని కల్మషాన్ని తన పద్యాలతో కడిగేస్తూ, మంచి చెడ్డలను సమీక్షిస్తూ, ప్రజలలో మూఢ విశ్వాసాలను ఖండిస్తూ ప్రజాచైతన్యం రగిలిస్తూ ఆలవెలదులలో పద్యాలను సరళసుబోధకంగా అల్లిన 'ప్రజాకవి వేమన' కదిరి ప్రాంతంలోనే ఉన్నట్లు, గాండ్లపెంట మండలంలోని కటారుపల్లె గ్రామంలో సమాధి అయినట్లు అనేక చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  ప్రాచీన కవుల్లో వేమనది విశిష్ట స్థానం. తన సమకాలీన ...

అనంతపురం జిల్లాలో సాహిత్య వికాసం

                                                   “క్షామములెన్ని వచ్చినా రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞానమృత దృష్టికిన్ కొరతనందని రాయలసీమ లోపలన్” అని డాక్టర్ నండూరి కృష్ణమాచార్యులు చెప్పినట్లు రాయలసీమలోని అనంతపురము జిల్లాలో ప్రాచీన కాలంనుండి నేటి వరకు సాహిత్య వికాసం నిరంతరాయంగా ఫరిడ విల్లుతోంది.         ప్రాచీన సాహిత్యాన్ని మినహాయిస్తే, ఆధునిక సాహిత్యమంతా సంక్షోభ సమాజ ప్రతిబింబమే. కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న జీవితాన్ని, ఫ్యాక్షన్ రాజకీయాలను, రాజకీయ క్రీనిడల్ని సాహిత్యం ఆవిష్కరిస్తోంది.         సాహిత్యానికి, ఆర్థిక సామాజిక పరిస్థితులకు, రాజకీయ పరిస్థితులకు పరస్పర సంబంధముంది. కాలానుగుణంగా సాహిత్యంలో రూపం మారినట్లే, వస్తువూ మారుతూవస్తోంది. కాకపోతే జిల్లాలో ఉన్న నైసర్గిక స్వభావం వల్ల ఇక్కడ కరువు తాండ వించడం, దానికి తోడు పాలకవర్గాల నిర్లక్ష్యం, ప్రజల అమాయకత్వం వెరసి సాహిత్యంలో వ్యదార్థ జీవన దృశ్యం అణుమాత్రం కూడా మారలేదు. ...

అనంత రైతులకు కుడిఎడమల నిలిచిన కవి నర్సిరెడ్డి

చిత్రం
                   "మీ గుండెల్లో ఎక్కడైనా/ చీమ కనుగుడ్డంత కారుణ్యముంటే/ మాక్కొంచెం తడినివ్వండి/ మా పొలాల గుండె గదుల్లోంచి/ కావల్సినన్ని గింజలు తోడి పోయకుంటే అప్పుడడగండి" అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరిన యాముల నర్సిరెడ్డి సోమందేపల్లి మండలంలోని చాకర్లపల్లి లో యాములసుశీలమ్మ , చక్కీ రప్ప దంపతులకు జూన్ 11న 1976 లో జన్మించారు. తండ్రి చక్కీరప్ప టీచర్ గా పనిచేసేవారు. అయినప్పటికీ ఆయన ఉదార స్వభావం వల్ల, వ్యవసాయానికి అధికంగా ఖర్చు చేయడం వల్ల నర్సిరెడ్డి చదువు అనేక కష్టాలకడలిలో సాగింది.చాకర్లపల్లి లో ప్రాథమిక విద్యను,హైస్కూలు విద్యను సోమందేపల్లి లో పూర్తి చేశారు. తర్వాత చదువు మానేసి వ్యవసాయం చూసుకుంటూ ఉండేవారు. తండ్రి అనారోగ్యంతో మరణించడంతో నర్సి రెడ్డికి జూనియర్ సహాయకునిగా 2003లో హంద్రీనీవా సుజల స్రవంతి కార్యాలయంలో నియామకం జరిగింది. ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం లో దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు.       వ్యవసాయం లో ఉన్న ఆటుపోట్లను, అందులో కష్టాలలో తను చూసిన నర్సిరెడ్డి తన చిన్నతనం నుండి ఆసక్తి ఉన్న సాహిత్య రంగం...

సీమలో ఉషోదయ ప్రభాత గీతాన్ని ఆలపిస్తున్న రజిత

చిత్రం
'నేను నారిని,మ్రోగించిన సమరభేరిని' అంటూ తన్ను తాను నిర్వచించుకున్న కొండసాని రజిత అయ్యగారి నారాయణరెడ్డి సునందమ్మల దంపతులకు  మొదటి సంతానంగా 13 ఆగష్టు1985లో ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన పుట్టపర్తికి మండలం లోని గువ్వలగుట్టపల్లిలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం సుబ్బరాయనిపల్లి లోని అమ్మమ్మ తాతయ్య రామకృష్ణమ్మ నారాయణ రెడ్డి  వద్ద సాగింది. జూనియర్ కళాశాల చదువు మాత్రం అమ్మగారింట  పూర్తయింది. ఇంటర్ పూర్తికాగానే తన మేనమామ కొండసాని బయపరెడ్డి తో 3 జూన్ 2003 న వివాహం జరిగింది. వీరి కుమారుడు ప్రణీత్ కుమార్ రెడ్డి కూడా తల్లి బాటలో పయనిస్తూ కథలు రాయడం విశేషం. వివాహాం తర్వాత కూడా చదువును కొనసాగిస్తూ 2012లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా దూరవిద్య లో డిగ్రీ (బి.ఎ) పూర్తి చేశారు.ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా ఎమ్మెస్ డబ్ల్యూ కోర్సును పూర్తి చేశారు. ఈమె 14 ఫిబ్రవరి 2007 నుండి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది.2017 డిసెంబర్ నుండి 2018 ఆగష్టు వరకు అంగన్వాడీ మినీ సూపర్వైజర్ గా కూడా పనిచేశారు.             వ్యవసాయ కుటుంబం నేపథ్...