పోస్ట్‌లు

కడప జిల్లా చారిత్రక దృష్టి

కడప జిల్లా చారిత్రక దృష్టి           కడప జిల్లా, రాయలసీమలోని రేనాటి సీమలో భాగం. నేటి కడప నాలుగు ప్రధాన చారిత్రక ప్రాంతాలుగా—దేవుని కడప, పురాతన కడప, కాపు కడప, మరియు శహర్ కడప ల సముదాయం.         కడప జిల్లా చరిత్రలో రేనాటి చోళుల పాత్ర చాలా కీలకమైనది.వీరి కాలం క్రీ.శ. 575కు సంబంధించిన ఎర్రగుడిపాడు శాసనం (కమలాపురంమండలం) తెలుగు భాషలో వేయబడిన మొట్టమొదటి శిలాశాసనంగా గుర్తించబడింది.  ఇది తెలుగు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ముఖ్యమైన పురావస్తు ఆధారం. దేవుని కడప:        దేవుని కడప, తిరుమలకు ఉత్తర ద్వారంగా పిలువబడే ఆధ్యాత్మిక కేంద్రం. దేవుని కడపలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళా లక్షణాలు చోళుల, విజయనగర శిల్పకళా రీతులను.  సూచిస్తాయి.ఆలయ గోపురం, శిల్పకళ 9వ-14వ శతాబ్దాల మధ్యకాల దక్షిణ భారత నిర్మాణ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ లభించిన శాసనాల్లో క్రీ.శ. 1570 నాటి సదాశివరాయల కాలం నాటి శాసనం చాలా ముఖ్యం. ఇది ఆలయానికి అప్పట్లో జరిగిన దానధర్మాలను వివరిస్తుంది....

రాయలసీమ‌ చరిత్ర __భాషా సంస్కృతులు

రాయలసీమ‌ చరిత్ర __భాషా సంస్కృతులు            రాయలసీమ చరిత్ర గురించే కాక భారతదేశ చరిత్ర ను తెలుసుకోవడానికి ఆయా ప్రాంతాల్లో త్రవ్వకాలలో లభించిన అనేక పనిముట్లు, వేయించిన శాసనాలు, ఆయా కాలాల్లో వున్న రచయితలు రచించిన గ్రంథాలే ప్రధాన ఆధారం.         కొత్త రాతి యుగం కంటే ముందు నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆదిమానవులు ఉన్నారు. కడప ప్రాంతంలో నివసించిన మానవులు హెమటైట్ రాతితోను పనిముట్లు తయారు చేసుకొనేవారు. కర్నూలుజిల్లాలో బిల్లసర్గం గుహలలోను, కడప, అనంతపురంజిల్లాలలోను క్రీ. పూ. 5000 నాటి పాత రాతియుగపు పనిముట్లు లభించాయి. జనాభా పెరిగేకొద్దీ ఈ ప్రాంతంలో జనపదాలు ఏర్పడి ఉండాలి. పైగా భాష కూడా ఏర్పడి ఉండాలి. జనపదాలు పెద్దవై రాజ్యాలు ఏర్పడిన తర్వాత తొలి శాసనాలు రాయలసీమలోనే లభించాయి.దీన్నిబట్టి తెలుగువారు రాయలసీమ వారై ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు.       చౌడేశ్వరీ పురాణం లో క్రీ.పూ. 320కన్నా ముందు నందరాజులు ఇప్పటి కర్నూలుజిల్లా లోని బనగానపల్లె సమీపంలోని నందవరాన్ని కేంద్రంగా చేసుకుని నందనుడు పాలించినట్లుంది. ఆ గ్రామాన్ని కాశీ నుంచి...

లంబాడి తెగ గిరిజనులు -- భాషా సంస్కృతులు

లంబాడి తెగ గిరిజనులు -- భాషా సంస్కృతులు         భారతదేశ చరిత్ర సంస్కృతి వాస్తవానికి పూర్తిగా అది గిరిజనులకు సంబంధించినది. ఆర్యులు ద్రావిడులు ఇతర ప్రాంతాల నుంచి భారతదేశంలోకి వలస వచ్చినారని పరిశోధనకులు చెబుతున్నారు గిరిజనులు మాత్రం భారతదేశ మూలవాసులు. వీరి చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు ఇప్పటికీ మైదాన ప్రాంత వాసులు కన్నా భిన్నంగా ఉన్నాయి. ఎరుకలు ఏనాధులు లంబాడీలు మొదలైన వారి సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేస్తే చాలా కొత్త విషయాలన్నీ మనకు తెలుస్తాయి ముఖ్యంగా మూలవాసుల చరిత్ర సంప్రదాయాలు మనకు స్పష్టంగా అర్థం అవుతాయి.                 ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగలు లేదా గిరిజనులు అని రాష్ట్రపతి ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గిరిజన తెగలు 573. వారి జనాభా 10.43 కోట్లు (8.6%). ఇందులో పురుషులు 5.24 కోట్లు, స్త్రీలు 5.19 కోట్లు. దేశ జనాభాలో వీరి శాతం 8.6శాతం. గిరిజనుల్లో లింగ నిష్పత్తి దేశవ్యాప్తంగా 990.గిరిజనుల అక్షరాస్యత 58. ఇందులో పురుష అక్షరాస్యత 68.5. స్త్రీ అక్షరాస్యత 49.4శాతం. వీరు భారతదేశంలో సుమార...
ఆంధ్రప్రదేశ్‌లోని జ్వాలపురం అనే గ్రామం నిపుణులను ఆకర్షిస్తోంది. వేల సంవత్సరాల క్రితం టోబా సరస్సు (సుమత్రాన్ దీవులు, ఇండోనేషియా)లోని గొప్ప టోబా టఫ్ అగ్నిపర్వతం యొక్క ధూళి ఇక్కడ ఖననం చేయబడినందున ఈ గ్రామం శాస్త్రవేత్తలు, పురాతన వృక్షశాస్త్రజ్ఞులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగించే అంశం. అగ్నిపర్వతాలు ఎల్లప్పుడూ విధ్వంసక స్వభావం కలిగి ఉంటాయి, కానీ ఈ పురాతనమైనది భారతదేశంలో తొలి మానవుడు నివసించిన విధానంపై వెలుగునిచ్చింది. రవి కోరేశెట్టి నేతృత్వంలోని కర్ణాటక విశ్వవిద్యాలయం, ధార్వాడ్ (KUD) పరిశోధకులు మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ మైఖేల్ పెట్రోగాలియా బృందం అనేక నెలలు ఇక్కడ మకాం వేసి భారతదేశంలో తొలి మానవ స్థావరాన్ని ఈ అగ్నిపర్వత బూడిదను ఉపయోగించి తేదీని తెలుసుకోగలిగారు. 2003లో ఈ అగ్నిపర్వత బూడిదను కనుగొన్న KUDకి చెందిన ప్రముఖ పురావస్తు పరిశోధకుడు కోరేశెట్టి, ఈ బూడిద కింద తొలి మానవ స్థావరాన్ని కనుగొన్నారు. ఆయన కర్నూలు జిల్లాలోని జ్వాలపురంలోని గుహలు, సున్నపురాయి క్వారీలు మరియు యాగంటి గుహలను పరిశీలించి, అగ్నిపర్వత బూడిదను చూశాడు, 1987లో పూణేలో అదే బూడిదను కనుగొన్న తర...

రాయలసీమలో కొత్త రాతి యుగపు (Neolithic Period) అవశేషాలు

*రాయలసీమలో కొత్త రాతి యుగపు (Neolithic Period) అవశేషాలు*          కొత్త రాతి యుగం 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమై 4000 సంవత్సరాల వరకు సాగింది. ఈ యుగంలోనే మనిషి ఒకచోట స్థిరంగా ఆహారాన్ని వ్యవసాయం చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. దానికోసం శిలాపనిముట్లను తయారు చేసుకున్నాడు.  దాంతో గ్రామాలు ఏర్పడినాయి. నాగరిక జీవనానికీది నాంది పలికింది. ఈ కాలపు అవశేషాలు తెలుగు రాష్ట్రాల్లో 4000 ఏళ్ల కింద కనిపించాయి.  చరిత్రపూర్వయుగానికి పితామహుడిగా పేరొందిన రాబర్ట్ బ్రూస్ ఫుట్ కడప జిల్లాలో హనుమంతరావు పేట, పెద్దముడియం, బలిజపల్లె లో , అనంతపురంజిల్లాలో 25 స్థావరాల్లో త్రవ్వకాలు జరిపి ఈ యుగానికి చెందిన ఆధారాలు వెలికితీశాడు.           పశువుల పేడను కుప్పగా కాల్చడం వల్ల ఏర్పడిన బూడిద కుప్పలు (ash mounds)  అనంతపురం జిల్లాలోని పాలవాయి, కర్ణాటకలోని కుపల్, పిక్లిహాల్లో కనిపించాయి. కానీ ఇవి వైఎస్ఆర్ జిల్లాలో కనిపించలేదు. ధర్మోలు మినిసెన్స్ పద్ధతి ద్వారా ఈ బూడిద దిబ్బలు సుమారు క్రీ.పూ 2000 కాలంలో కాల్చినవని శాస్త్రవేత్తలు నిర్...

తెలుగు లిపి పరిణామం

తెలుగు లిపి పరిణామం                 ఇనుప యుగం కంటే ముందు నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆదిమానవులు ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో జనపదాలు ఏర్పడి ఉండాలి. పైగా భాష కూడా ఏర్పడి ఉండాలి. జనపదాలు పెద్దవై రాజ్యాలు ఏర్పడిన తర్వాత తొలి శాసనాలు రాయలసీమలోనే లభించాయు. దీన్నిబట్టి తెలుగువారు రాయలసీమ వారై ఉంటారని భావించవచ్చు . క్రీ.శ.6వ శతాబ్దం నాటికి దానిని రేనాడు అనిపిలిచే వారు.రేనాడు ఏడువేల గ్రామాల సముదాయం.దీనిని రేనాటి చోళులు పాలించేవారు. కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడు ఎర్రగుడి దగ్గర లభించిన శాసనాల ద్వారా సీమాంధ్ర ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.       దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ తర్వాత తెలంగాణ అని తుర్లపాటి రాజేశ్వరి పేర్కొన్నారు.       క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో ఎరికల్ ముత్తు రాజు బిరుదు గల ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలిస్తున్న కాలంలో వేయించిన శాసనం తెలుగులో వుంది. కమలాపురం లోని ఎర్రగుడిపాడు దగ్గర లభించిన క్రీ.శ.600 నాటి శాసనం ...

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి

  నిస్వార్థ ప్రజానాయకుడు — వై. ఈశ్వర రెడ్డి       రాయలసీమ రాజకీయ చరిత్రలో ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడిన నాయకులలో వై. ఈశ్వర రెడ్డి గారు (1915–1986) ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించారు. రైతాంగం, కార్మికులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆయన, కమ్యూనిస్టు ఉద్యమానికి కడప జిల్లాలో బలమైన పునాది వేశారు. ఆయన జీవితం కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు; అది ఒక సామాజిక ఉద్యమ చరిత్ర. జననం మరియు విద్యాభ్యాసం       వై. ఈశ్వర రెడ్డి  1915లో కడప జిల్లా పెద్దముడియం మండలంలోని పెద్దపసుపుల గ్రామంలో వెంకట సుబ్బారెడ్డి, మల్లమ్మ దంపతులకు  జన్మించారు.వారిది భూస్వామ్య కుటుంబం అయినప్పటికీ, ఫ్యూడల్ జీవనశైలిని వదిలి సాధారణ ప్రజల మధ్య జీవించడాన్ని ఎంచుకున్నారు.       వీరు1936లో  నుఅనంతపురంలోని డి.సి. కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ సమయంలోనే జాతీయోద్యమం, రైతాంగ సమస్యలు, సామాజిక అసమానతలపై అవగాహన పెంచుకున్నారు.1936లో కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. రైతాంగ ఉద్యమాల్లో భాగస్వామ్యం        1930లలో ఆంధ్ర ప్రాంతంలో జర...