అనంత సాహితీ కర్షకుడు కల్లూరు రాఘవేంద్రరావు

కల్లూరు రాఘవేంద్రరావు తల్లిదండ్రులు కల్లూరు అహోబలరావు,సీతమ్మ దంపతులు. అహోబలరావు ఉపాధ్యాయులు గా కళ్యాణదుర్గం లో పనిచేస్తున్న సందర్భం లో రాఘవేంద్రరావు 1.6.1946లో ఎనిమిదవ సంతానంగా అక్కడే జన్మించారు.కానీ వీరి కుటుంబ మూలాలు మాత్రం కల్లూరు గ్రామంలో ఉన్నాయి. తన తండ్రి అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. హైస్కూలు విద్యను హిందూపురంలో పూర్తి చేశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ డిగ్రీ పొందారు. 1966లో హిందూపురంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే లేపాక్షి మండలంలోని సిరిపురం లో , తదనంతరం 1969లో హిందూపురంలో కూడా పనిచేశారు. 1974లో హిందూపురం మున్సిపాలిటీ అయిన తర్వాత అక్కడే 1998 వరకు వివిధ మున్సిపల్ పాఠశాలల్లో పని చేశారు. 1999లో ప్రధానోపాధ్యాయుని గా పదోన్నతి పొందారు. 2004లో పదవీ విరమణ పొందే వరకు రహమత్ పురం లో పని చేసేవారు. అహోబల రావు కవి కావడం వల్ల తన కుమారుడు రాఘవేంద్ర రావును కూడా సాహిత్య కారునిగా మారడానికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని ఇచ్చారు . దా...