తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం

తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం అల్లసాని పెద్దన తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం కడప నుంచి ఎర్రగుంట్ల కు వెళ్లే మార్గమధ్యంలో' కోగటం గ్రామం కనిపిస్తుంది.ఈ గ్రామం కమలాపురం మండలం పరిధిలో ఉంది. కమలాపురం చౌరస్తాలో అల్లసాని పెద్దన విగ్రహం కనిపిస్తుంది. కోగటం మండల కేంద్రమైన కమలాపురం నుండి 10 కి. మీ. దూరం లోను, కడప నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 గణాంకాల ప్రకారం ఈ గ్రామం 848 ఇళ్లతో, 3400 జనాభాతో 2389 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో పురుషులు 1722, మహిళలు 1678. షెడ్యూల్డ్ కులాలు 448 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యుల శాతం60.4 % (2053). అందులో మహిళా అక్షరాస్యులు25.4 % (863). కోగటం పేరు వినగానే గుర్తు కొచ్చే కవి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ప్రబంధ యుగానికి ఆది ...