బాలకొండ ఆంజనేయులు

బి. కుళ్లాయప్ప, సారమ్మల మూడవ సంతానంగా 01.07.1957లో చెన్నో కొత్తపల్లి మండలంలోని బసినేపల్లి గ్రామంలో బాలకొండ ఆంజనేయులు జన్మించారు. ఆయనకు ఇద్దరు అక్కగార్లు, ఒక తమ్ముడు ఉన్నారు.బసినేపల్లిలో 5వ తరగతి పూర్తయ్యాక, ఉన్నత విద్య చెన్నెకొత్తపల్లి, ధర్మవరంలోనూ, బికామ్ డిగ్రి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోనూ పూర్తిచేసినారు. 1980లో జూనియర్ అసిస్టెంట్ గా అనంతపురం పి. టీ.సిలో నియమితులయ్యారు. బాల్యంలో తన గ్రామంలో మహాభారతం, రామాయణం, పారాయణంలో పాల్గొనేవారు. అప్పట్నించి కవిత్వం పట్ల ఆసక్తి ఏర్పడింది. తాను కవిని కావాలన్న కోరిక ఉండేది. ఇంటర్‌లో తెలుగును ఒక ఆప్షన్‌గా తీసుకోవాలనుకుంటే దానిలో ఎవరూ చేరకపోవడంవల్ల ఆ కోర్సును రద్దు చేసినారు. దాంతో తెలుగును చదువలేకపోయారు. అయినప్పటికి పద్యాలు, గేయకవితలు స్వయంగా రాసేవారు.1989లో తాను రాసిన 'తొలకరి చినుకులు' గ్రంథాన్ని జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రచురించి ఆవిష్కరించారు. ఆవిధంగా సాహిత్య రంగంలోకి ప్రవేశించారు. 1991లో 'ఉచ్చు' ...